Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్గేమ్స్ 2022 లో బంగారు పతకాన్ని స్క్వాశ్ పురుషుల జట్టు గెలిచినందుకు సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 


హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో బంగారు పతకాన్ని క్రీడాకారులు శ్రీయుతులు సౌరవ్ ఘోసల్, అభయ్ సింహ్, హరీందర్ సంధు మరియు మహేశ్ మన్ గాఁవ్ కర్ లతో కూడిన స్క్వాశ్ పురుషుల జట్టు గెలిచినందుకు గాను ఆ జట్టు ఆటగాళ్ల కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి సామాజిక మాధ్యం ఎక్స్ లో ఒక సందేశం లో

‘‘ప్రతిభావంతులైన క్రీడాకారులు శ్రీయుతులు సౌరవ్ ఘోసల్, అభయ్ సింహ్, హరీందర్ సంధు మరియు మహేశ్ మన్ గాఁవ్ కర్ లతో కూడిన మన స్క్వాశ్ పురుషుల జట్టు ఏశియాన్ గేమ్స్ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినందుకు మరియు ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాన్ని స్వదేశానికి తీసుకు వస్తున్నందుకు గాను ఇవే అభినందన లు. ఈ ప్రయాస క్రీడల ను అనుసరించడానికి మరియు అందులో రాణించడానికి ఎంతో మంది యువ క్రీడాకారులకు, క్రీడాకారిణుల కు ప్రేరణ ను అందించగలుగుతుంది. భారతదేశం సంతోషిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS