Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏయన్నార్ గారు భారత్‌కు గర్వకారణం ఆయన అద్భుత నటన రాబోయే తరాల వారి మనసుల్నీ ఆకట్టుకొంటూ ఉంటుంది: ప్రధానమంత్రి


అక్కినేని నాగేశ్వర రావు గారు మన దేశానికి గర్వకారణం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసిస్తూ, ఆయన అద్భుత నటన భావి తరాల వారి మనసుల్ని ఆకట్టుకొంటూ ఉంటుందన్నారు. శ్రీ నాగార్జున అక్కినేనిని, ఆయన కుటుంబాన్ని కలుసుకొన్నందుకు ప్రధాని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నాగార్జున అక్కినేని పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘నాగార్జున గారూ, మీ కుటుంబంతో పాటు మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా ఆనందం కలిగించింది. ఏయన్నార్ గారు దేశానికి గర్వకారణం. ఆయన నటన ముందు తరాల వారి మనసులను ఆకట్టుకొంటూ ఉంటుంది.’’