ఏడవ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫారసులను మొత్తం మీద క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాసెస్ చేయటానికి కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఒక కార్యదర్శుల సాధికార సంఘాన్ని నియమించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఏడవ సీపీసీ సిఫారసులకు సంబంధించిన అన్ని అంశాలను త్వరిత గతిన కూలంకుషంగా పరిశీలించి ప్రాసెస్ చేయటంలో కార్యదర్శుల సాధికార సంఘం ఒక స్క్రీనింగ్ కమిటీగా పనిచేస్తుంది.