Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మా కే నామ్ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లోని బుద్ధ జయంతి పార్కు లో ఒక రావి మొక్క ను నాటారు. మన భూ గ్రహాన్ని మెరుగైంది గా మలచడం లో అందరు వారి వంతు తోడ్పాటు ను అందించవలసింది అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. గడచిన పది సంవత్సరాల లో భారతదేశం చేపట్టిన అనేక ఉమ్మడి ప్రయాస లు దేశం లో అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగేందుకు దారితీశాయి అని ఆయన అన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశ లో మనం పడుతున్న తపన లో ఇది ఒక మహత్కార్యం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఈ క్రింది విధం గా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు న, ప్రపంచ పర్యావరణ దినం నాడు, #एक_पेड़_माँ_के_नाम (ఏక్ పేడ్ మా కే నామ్’) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషం గా ఉంది. భారతదేశం లో మరియు ప్రపంచ దేశాల లో ప్రతి ఒక్కరిని రాబోయే రోజుల లో మీ మాతృమూర్తి కి ఒక ప్రశంస గా ఒక మొక్క ను నాటండి అంటూ నేను పిలుపును ఇస్తున్నాను. మొక్క ను నాటుతున్నప్పటి ఛాయా చిత్రాన్ని #Plant4Mother తో గాని లేదా #एक_पेड़_माँ_के_नाम తో గాని కలిపి పంచుకోగలరు.’’

‘‘ఈ రోజు న ఉదయం పూట, నేను మన ప్రకృతి మాత ను పరిరక్షించడం పట్ల మన నిబద్ధత కు అనుగుణం గా ఒక మొక్క ను నాటాను; మీరందరు కూడ మన భూగ్రహాన్ని మెరుగైందిగా మలచడం కోసం మీ వంతు తోడ్పాటు ను అందించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. #Plant4Mother #एक_पेड़_माँ_के_नाम’’

గడచిన దశాబ్దం లో, దేశం అంతటా అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడం లో దోహదపడ్డ అనేక ఉమ్మడి ప్రయాసల ను భారతదేశం చేపట్టింది అనే విషయం మీ అందరి ని సంతోష పరచేదే. స్థిర అభివృద్ధి దిశ లో మనం పడుతున్న తపన లో ఇది ఒక గొప్ప విషయం. స్థానిక సముదాయాలు సందర్భానికి తగినట్లు చొరవ తీసుకొని ఈ విషయం లో నాయకత్వ భూమిక ను పోషించాయనేది సైతం ప్రశంసనీయం గా ఉంది.’’