‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) కార్యక్రమానికి గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ మద్దతును తెలియజేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు ధన్యవాదాలు తెలిపారు. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో భాగంగా నిన్న నిర్వహించిన ఎపిసోడ్ లో గయానాలోని భారతీయ సముదాయాన్ని తాను ప్రశంసించిన విషయాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరచిన ఒక సందేశానికి ప్రధాని ప్రతిస్పందిస్తూ, ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘మీ మద్ధతును సదా మదిలో పదిలపరచుకొంటాను. ఈ విషయాన్ని గురించి నా #MannKiBaat (‘మనసులో మాట’) కార్యక్రమంలో ప్రస్తావించాను. అదే ఎపిసోడ్ లో గయానాలోని భారతీయ సముదాయాన్ని కూడా నేను ప్రశంసించాను.’’
@DrMohamedIrfaa1
@presidentaligy”
Your support will always be cherished. I talked about it during my #MannKiBaat programme. Also appreciated the Indian community in Guyana in the same episode. @DrMohamedIrfaa1 @presidentaligy https://t.co/1pUrdJVsFl
— Narendra Modi (@narendramodi) November 25, 2024