Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏఐఐఏలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి అనువాదం

ఏఐఐఏలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి అనువాదం


ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రివర్గ సహచరులుశ్రీ జగత్ ప్రకాష్ నడ్డామన్సుఖ్ మాండవీయప్రతాప్ రావ్ జాదవ్శ్రీమతి అనుప్రియా పటేల్శోభా కరంద్లాజేఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తోన్న శ్రీ రామ్‌వీర్ సింగ్ బిధూరీఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లుగౌరవ ముఖ్యమంత్రులుఎంపీలుఎమ్మెల్యేలుఇతర ప్రజాప్రతినిధులువైద్యులుఆయుర్వేదాన్నిఆయుష్‌ను ప్రాక్టీస్ చేస్తున్నవారుదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న నిపుణులుఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికిఅఖిల భారత ఆయుర్వేద సంస్థకు చెందిన వైద్యులుఇతర సిబ్బందికిసోదరసోదరీమణులారా!

దేశం మొత్తం ధంతేరాస్ పర్వదినాన్నీధన్వంతరి భగవానుని జయంతినీ జరుపుకొంటోందిఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలుఈ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ గృహాల కోసం ఏదో ఒక కొత్త వస్తువు కొంటారుముఖ్యంగా వ్యాపార సమూహాలకు లాభం చేకూరాలని నేను కోరుకుంటున్నానుఅందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నానుమనం ఎన్నో దీపావళి పండుగలు జరుపుకున్నాంకానీ ఈ ఏడాది జరుపుకునే దీపావళి చాలా ప్రత్యేకంఎన్నో దీపావళిలు చూసి మా తలలు నెరిసిపోయాయనిఈ చరిత్రాత్మక దీపావళిని మోదీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. 500 ఏళ్ల తర్వాత లభించిన అవకాశమిదిఅయోధ్యలోని రామ్ లల్లా జన్మస్థలంలో నిర్మించిన మందిరంలో వేలాది దీపాలు వెలిగించి అద్భుతమైన రీతిలో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారుమన రాముడు తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భంగా జరుపుకుంటున్న దీపావళి ఇదిదీని కోసం14 ఏళ్లు కాదు 500 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.

స్నేహితులారా,

ధంతేరాస్ పర్వదినాన ఐశ్వర్యంఆరోగ్యాలను ఉత్సవంగా జరుపుకోవడం యాదృచ్ఛికం కాదుఇది భారత సంస్కృతిలోని జీవనతత్వానికి సూచిక. ‘ఆరోగ్యం పరమం భాగ్యం’ అని మన రుషులు అన్నారుఆరోగ్యమే గొప్ప అదృష్టంసంపద అని దాని అర్థంక్లుప్తంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటారుఈ ప్రాచీన భావన ఇప్పుడు ఆయుర్వేద దినోత్సవ రూపంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందిదాదాపుగా 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం మనం గర్వించాల్సిన విషయంప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనంతన ప్రాచీన అనుభవాలతో సరికొత్త భారత్ ఈ ప్రపంచానికి ఎలా సహాయపడనుందో ఇది తెలియజేస్తుంది.

మిత్రులారా,

గడచిన పదేళ్లలోఆయుర్వేద పరిజ్ఞానాన్నిఆధునిక వైద్యంతో మేళవించడం ద్వారా దేశ ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయాన్ని రూపొందించాంఅఖిల భారత ఆయుర్వేద సంస్థ దీనికి ప్రధాన కేంద్రంగా మారిందిఏడేళ్ల క్రితంఇదే రోజు ఈ సంస్థ మొదటి దశను జాతికి అంకితం చేసే అపూర్వ అవకాశం నాకు దక్కిందిధన్వంతరి జయంతి సందర్భంగా రెండో దశను సైతం ప్రారంభించడాన్ని అదృష్టంగా పరిగణిస్తున్నానుఇక్కడ ఆధునిక టెక్నాలజీతోప్రాచీన ఆయుర్వేద పంచకర్మ విధానాలను మేళవించి చికిత్సను అందిస్తారుఆయుర్వేదంవైద్యశాస్త్రాల్లో అధునాతన పరిశోధనలు సైతం ఇక్కడ జరుగుతాయిఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

దేశ ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత వేగంగా అభివృద్ధి జరుగుతుందిదీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చిఅయిదు ప్రధానాంశాలతో ఆరోగ్యవిధానాన్ని తీసుకొచ్చిందిమొదటిది ప్రివెంటివ్ హెల్త్ కేర్అంటే వ్యాధుల బారిన పడక ముందే నివారించడంరెండోది సకాలంలో వ్యాధి నిర్దారణ చేయడంమూడోది ఉచితమైనసరసమైన ధరల్లో వైద్యంఅందుబాటు ధరల్లో ఔషధాలు ఉంచడంనాలుగోది చిన్న పట్టణాల్లో నాణ్యమైన చికిత్సడాక్టర్ల కొరతను తగ్గించడంఅయిదవది ఆరోగ్య రంగంలో సాంకేతికతను విస్తరించడంప్రస్తుత కాలంలో ఈ రంగాన్ని సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోణంలో భారత్ వీక్షిస్తోందిఈ అయిదు ప్రధాన విధానాలను ఈ రోజు చేపట్టిన కార్యక్రమం తెలియజేస్తోందిఈరోజు 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపనలు జరిగాయిఆయుర్ స్వాస్థ్య యోజన ద్వారా నాలుగు ఎక్సలెన్స్ కేంద్రాలుడ్రోన్ల ద్వారా ఆరోగ్య సేవల విస్తరణరిషికేష్‌లోని ఎయిమ్స్‌లో హెలికాప్టర్ సేవలుఢిల్లీబిలాస్ పూర్‌లోని ఎయిమ్స్‌ల్లో నూతన మౌలిక సదుపాయాల కల్పనమరో అయిదు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో సేవల విస్తరణవైద్య కళాశాలల ఏర్పాటునర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపనదేశంలో ఆరోగ్య సేవల్లో మార్పులకు నాంది పలికే కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించాంవీటిలోని చాలా ఆసుపత్రులను కార్మిక సోదరులుసోదరీమణులకు అవసరమైన చికిత్స అందించేందుకే ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నానుకార్మికులకు సేవా కేంద్రాలుగా ఈ ఆసుపత్రులు పనిచేస్తాయిఈ రోజు ప్రారంభించిన ఫార్మా యూనిట్లు దేశంలోని అధునాతనమైన ఔషధాలుఅత్యంత నాణ్యమైన స్టెంట్లుఇంప్లాట్లను అందిస్తాయిఇవి భారత ఫార్మా రంగ అభివృద్ధికి దోహదం చేస్తాయి.

స్నేహితులారా,

మనలో చాలామంది అనారోగ్యాన్ని అశనిపాతంలా భావించే కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చాంపేదల ఇళ్లలో ఎవరికైనా అనారోగ్యం ఎదురైతే అది కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపిస్తుందిచికిత్స కోసం తమ ఇళ్లుభూములునగలు అమ్ముకోవాల్సిన రోజులుండేవిచికిత్సయ్యే ఖర్చు గురించి వింటేనే పేదవాడి గుండె వణికిపోతుందితమ వైద్యం కోసం ఖర్చుపెట్టాలాలేదా మనవళ్ల చదువు కోసం డబ్బు వెచ్చించాలాఅని వయోధికురాలైన తల్లులు తల్లడిల్లుతారుఅదే తండ్రులైతే తన ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలాలేదా ఇంటి బాధ్యతలను నిర్వర్తించాలాఅని ఆలోచిస్తారుచివరికి వారు ఒకే ఒక మార్గాన్ని ఎంచుకుంటారుఅదే బాధలను నిశ్శబ్దంగా భరించడంమరణం కోసం మౌనంగా వేచి ఉండటండబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయత పేదలను కుదిపేసింది.

ఇలాంటి నిస్సహాయతలో ఉన్న నా పేద సోదర సోదరీమణులను చూసి నేను భరించలేకపోయానుఈ బాధల నుంచి నా తోటి ప్రజలకు ఉపశమనం కల్పించడానికే ఆయుష్మాన్ భారత్ పథకం పుట్టిందిపేదల వైద్యం నిమిత్తం రూ. 5 లక్షల వరకు అయ్యే ఆసుపత్రి ఖర్చులను భరించాలని ప్రభుత్వం నిర్ణయిచిందిఇప్పటి వరకు నాలుగు కోట్ల వరకు పేద ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం నాకు సంతృప్తినిస్తోందివారిలో కొందరు వివిధ రకాల వ్యాధులతో అనేక పర్యాయాలు రూపాయి ఖర్చు లేకుండా చికిత్స పొందారుఆయుష్మాన్ పథకం లేకపోతే వీరంతా దాదాపుగా రూ. 1.25 లక్షల కోట్లు తమ సొంత డబ్బులు వైద్య సేవలకు ఖర్చు చేయాల్సి వచ్చేదిదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం లబ్ధిదారులను నేను తరచూ కలుసుకుంటూ ఉంటానువారి బాధలుఆనందాలనుఅనుభవాలను వింటానుఆ సమయంలో వారి కళ్ల నుంచి జాలువారే ఆనందభాష్పాలు ఆయుష్మాన్ పథకంతో అనుబంధంగా పనిచేసే ప్రతి వైద్యుడుపారామెడికల్ సిబ్బందికి ఆశీర్వాదాలేఇంతకంటే గొప్ప వరం మరొకటి ఉండదు.

నన్ను నమ్మండిఇలాంటి కఠిన సమయాల్లో ప్రజలకు బాసటగా నిలిచే పథకాన్ని గతంలో ఎన్నడూ రూపొందించలేదుప్రస్తుతం ఆయుష్మాన్ పథకం అందిస్తున్న సేవలను విస్తరిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నానుప్రతి వయోధికుడు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారుప్రధానిగా నా మూడో పర్యాయంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పథకంలో చేరుస్తానని ఎన్నికల సమయంలో వాగ్ధానమిచ్చానుఈ రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా ఆ హామీని నెరవేరుస్తున్నానుఇఫ్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చువీరందరికీ ఆయుష్మాన్ వయో వందన కార్డులను అందజేస్తారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ వీలైనంత త్వరగా ఈ కార్డులు అందించాలనేది మా ప్రభుత్వ ప్రయత్నంఆదాయ పరిమితులేమీ లేకుండాపేదమధ్యతరగతిసంపన్న వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు.

వయోధికులు ఎలాంటి చింతలూ లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని హుందాగా గడపాలిదాన్ని సాధించడంలో ఈ పథకం కీలకంగా వ్యవహరిస్తుందిఆయుష్మాన్ వయో వందన కార్డు ద్వారా చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు తగ్గుతాయిచింతలు తీరుతాయిఈ పథకం లబ్ధి పొందే 70 ఏళ్ల దాటిన వారందరిని గౌరవిస్తూశుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ విషయంలో సాయం చేయలేకపోతున్నందుకు ఢిల్లీపశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన వృద్ధులను క్షమాపణలు కోరుతున్నానుమీ ఇబ్బందులు నాకు తెలుస్తున్నాయికానీ నేను మీకు ఏవిధమైన సాయం చేయలేనురాజకీయ స్వలాభం కోసం ఢిల్లీపశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం కాకపోవడమే దీనికి కారణంతమ సొంత రాష్ట్రాల్లోని రోగులను బాధించే ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదుఈ విషయంలో పశ్చిమ బెంగాల్ఢిల్లీలోని వృద్ధులను నేను క్షమాపణలు కోరుతున్నానునా తోటి ప్రజలందరికీ నేను సేవ చేయగలుగుతున్నాను కానీరాజకీయ ప్రయోజనాల గోడలు ఈ రెండు రాష్ట్రాల్లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అడ్డుకుంటున్నాయిఇది రాజకీయ సమస్య కానే కాదునేను ప్రస్తుతం ప్రసంగిస్తున్నాఢిల్లీలోని వృద్ధులు ఈ మాటను ప్రత్యక్షంగా వింటూ ఉండటం నాకు వేదన కలిగిస్తోందిఆ బాధ లోతును నేను మాటల్లో చెప్పలేను.

మిత్రులారా,

పేదవారైనామధ్యతరగతి వారైనాప్రతి ఒక్కరి చికిత్సకయ్యే ఖర్చును తగ్గించాలనేదే మా ప్రభుత్వ ప్రాధాన్యందేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 పీఎం జనఔషధి కేంద్రాలు ప్రభుత్వ పనితీరుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయిఈ కేంద్రాల్లో మందులు 80 శాతం రాయితీపై లభిస్తాయిఈ జన్ ఔషధి కేంద్రాలు లేకుంటే పేదమధ్యతరగతి ప్రజలు తమకు అవసరమైన ఔషధాల కోసం అదనం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చి ఉండేదిఈ కేంద్రాల ద్వారా 80 శాతం రాయితీపై మందులు పొందడంతో ఆ మొత్తాన్ని ఆదా చేసుకోగలిగారు.

మనం స్టెంట్లుమోకాలి ఇంప్లాట్లను చాలా తక్కువ ధరలోనే తయారు చేయగలిగాంమనం ఈ తరహా నిర్ణయాలు తీసుకోకపోతేఈ ఆపరేషన్లు చేయించుకున్న వారు అదనంగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదిమేం చేసిన కృషి ఫలితంగా ఆ మొత్తాన్ని ఆదా చేయగలిగాంఉచిత డయాలసిస్ పథకం వల్ల లక్షలాది మంది రోగులకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయిప్రాణాంతక వ్యాధుల నివారణకు మా ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందిఇది గర్భిణీలునవజాత శిశువుల ప్రాణాలను రక్షించితీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా వారిని కాపాడుతుందినా దేశంలోని పేదమధ్యతరగతి ప్రజలు ఖరీదైన చికిత్సల భారం నుంచి ఉపశమనం పొందేలా అవసరమైన చర్యలు తీసుకుంటానుఈ దిశగానే దేశం ముందుకు సాగుతోంది.

స్నేహితులారా,

అనారోగ్యం వల్ల ఎదురయ్యే ఇబ్బందులనునష్టాలను తగ్గించడానికి సకాలంలో రోగ నిర్ధారణ చేయడం అవసరమని మీకు తెలుసుఎవరైనా అనారోగ్యానికి గురైతేవారికి సత్వర వైద్య పరీక్షలుచికిత్స అందుబాటులో ఉండాలిదీని కోసమే దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభమయ్యాయివీటి ద్వారా కోట్లాది మంది ప్రజలు క్యాన్సర్రక్తపోటుమధుమేహం లాంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను సులభంగా చేయించుకుంటున్నారుతద్వారా సమయానికి చికిత్స లభించడంతో పాటుప్రజల సొమ్ము ఆదా అవుతుంది.

ఆరోగ్య రంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం ద్వారా మా ప్రభుత్వం పౌరుల డబ్బును ఆదా చేస్తోందిఈ సంజీవని పథకం ద్వారా 30 కోట్ల మంది ప్రజలుప్రముఖ వైద్యులను ఆన్ లైన్ సేవల ద్వారా సంప్రదించారుఇది తక్కువ సంఖ్యేమీ కాదువైద్యుల నుంచి ఉచితమైనకచ్చితమైన సేవలను పొందడం ద్వారా వారికి చాలా ధనం ఆదా అయిందిఈ రోజుమేం యువిన్ సేవలను కూడా ప్రారంభించాందీని ద్వారా భారత్ అధునాతమైన సాంకేతిక వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకుంటుందికొవిడ్ – 19 మహమ్మారి సమయంలో కొవిన్ ప్లాట్‌ఫాం విజయాన్ని ప్రపంచమంతా వీక్షించిందియూపీఐ చెల్లింపుల వ్యవస్థ కూడా ప్రపంచ గాథగా మారిందిడిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐద్వారా ఆరోగ్యరంగంలో అదే విజయాన్ని భారత్ ఇప్పుడు పునరావృతం చేస్తోంది.

మిత్రులారా,

గడచిన పదేళ్లలో ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధి స్వాతంత్ర్యం సిద్ధించిన 6-7 దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదుగత దశాబ్దంలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త ఎయిమ్స్మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయికర్ణాటకఉత్తరప్రదేశ్మధ్య ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో నిర్మించిన ఆసుపత్రులను ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారానే ప్రారంభిస్తున్నాంకర్ణాటకలోని నర్సాపూర్బొమ్మసంద్రమధ్యప్రదేశ్‌లోని పీఠంపూర్ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురంహర్యానాలోని ఫరీదాబాద్‌లో నిర్మించిన నూతన వైద్య కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయిఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కొత్త ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణం కూడా ప్రారంభమైందిఇండోర్‌లో ఒక ఆసుపత్రి ప్రారంభమైందివిస్తరిస్తున్న ఆసుపత్రులు మెడికల్ సీట్ల సంఖ్యలో పెరుగుదలను సూచిస్తున్నాయి.

డాక్టర్ కావాలన్న పేదవాడి కల చెదిరిపోకూడదని నేను కోరుకుంటున్నానుఏ యువకుడి కల కల్లలు కాకుండా చూడడంలోనే ప్రభుత్వ విజయం దాగి ఉందని నమ్ముతున్నానుకలలకు శక్తి ఉంటుందికొన్నిసార్లు అవి మనలో స్ఫూర్తి నింపుతాయిఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యతరగతికి చెందినవారు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా ఆగిపోకూడదని నేను భావిస్తానుఅందుకే గత పదేళ్లుగా భారత్‌లో మెడికల్ సీట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాంగత దశాబ్దంలోదాదాపు లక్ష వరకు ఎంబీబీఎస్ఎండీ సీట్లు పెరిగాయివచ్చే అయిదేళ్లలో వైద్య రంగంలో మరో 75,000 సీట్లను పెంచుతామని ఈ ఏడాది ఎర్రకోట నుంచి ప్రకటించానుతద్వారా గ్రామాల్లో అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య ఎంత పెరుగుతుందో ఒక్కసారి ఊహించండి.

స్నేహితులారా,

మన దేశంలో సుమారుగా 7,50,000కు పైగా ఆయుష్ వైద్య విధానాన్ని ప్రాక్టీసు చేస్తున్నవారు ఉన్నారుఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందిదానికి తగ్గట్టే కసరత్తు జరుగుతోందివైద్యంఆరోగ్య పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా భారత్‌ను ప్రపంచం చూస్తోందియోగాపంచకర్మధ్యానం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భారతదేశానికి వస్తున్నారురానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందిమన యువతఆయుష్ విధానాన్ని సాధన చేస్తున్నవారు దీనికి సిద్ధం కావాలిప్రివెంటివ్ కార్డియాలజీఆయుర్వేద ఆర్థోపెడిక్స్ఆయుర్వేద స్పోర్ట్స్ మెడిసిన్ఆయుర్వేద పునరావాస కేంద్రాలు– ఇలా అనేక విభాగాల్లో ఆయుష్‌ను సాధన చేసేవారికి భారత్‌తో పాటు విదేశాల్లోనూ అపారమైన అవకాశాలున్నాయిమన దేశ యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడమే కాకుండా మానవాళికి గణనీయమైన సేవలు అందిస్తుంది.

స్నేహితులారా,

21 వ శతాబ్ధంలో వైద్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందిఒకప్పుడు నయం కావని భావించిన రోగాలకు ఇప్పుడు చికిత్స అందుబాటులో ఉందిఆరోగ్య రక్షణ విషయంలోభారత్‌కు వేల సంవత్సరాల అనుభవం ఉందిఆధునికశాస్త్రం ద్వారా మన ప్రాచీన జ్ఞానాన్ని ధ్రువీకరించాల్సిన సమయం ఇదిఅందుకే నేను సాక్ష్యం ఆధారిత ఆయుర్వేదం గురించి పదే పదే ప్రధానంగా ప్రస్తావిస్తున్నానువ్యక్తుల అవసరానికి తగినట్టుగా చికిత్సా పద్ధతులను అందించగల విస్తృత పరిజ్ఞానం ఆయుర్వేదానికి ఉందిఅయినప్పటికీఈ రంగంలో ఆధునిక శాస్త్రీయ దృక్పథానికి తగినట్టుగా నిర్థిష్టమైన పని ఇంకా జరగడం లేదుఈ దిశగా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని మన దేశం ప్రారంభిస్తోందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నానుఅదే ‘ప్రకృతి పరీక్షా అభియాన్’ (ప్రకృతి పరీక్ష కార్యక్రమం)! ఎందుకంటే ఆయుర్వేదం వల్ల రోగి కోలుకుంటున్నప్పటికీదానికి తగిన ఆధారాలు ఇవ్వలేని పరిస్థితులను మనం చూస్తుంటాంఆరోగ్యాన్ని రక్షించే మూలికలు ఉన్నాయని ప్రపంచానికి చూపించడానికి మాకు ఫలితాలుసాక్ష్యాలు రెండూ అవసరమేఈ కార్యక్రమం ద్వారాఆయుర్వేద సూత్రాల ఆధారంగా ప్రతి వ్యక్తికి తగిన ఆదర్శవంతమైన జీవనశైలిని రూపొందించవచ్చువ్యాధులు రావడానికి ముందే ప్రమాద విశ్లేషణ చేయవచ్చుఈ దిశలో సాధిస్తున్న సానుకూల పురోగతి మన ఆరోగ్య రంగాన్ని పూర్తిగా పునర్నిర్వచించగలదని నేను విశ్వసిస్తున్నానుఆరోగ్య సంరక్షణలో ఈ నూతన దృక్పథాన్ని ప్రనపంచానికి మనం అందించగలం.

స్నేహితులారా,

ప్రతి అంశానికి ప్రయోగ ఆధారిత నిర్ధారణ ఉండటమే ఆధునిక వైద్య శాస్త్ర విజయానికి ప్రధాన కారణంమన సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సైతం ఈ ప్రమాణానికి అనుగుణంగా ఉండాలిఅశ్వగంధపసుపుమిరియాలు – తదితర మూలికలను మనం తరతరాలుగా వివిధ రకాల చికిత్సల కోసం ఉపయోగిస్తున్నాంఇప్పుడుఅత్యంత ప్రభావశీల అధ్యయనాలు వాటి ఉపయోగాలను రుజువు చేస్తున్నాయిఫలితంగాఅంతర్జాతీయంగా అశ్వగంధ లాంటి మూలికలకు డిమాండ్ బాగా పెరుగుతోందిఈ దశాబ్దం చివరి నాటికిఅశ్వగంధ సారం మార్కెట్ దాదాపు 2.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాప్రయోగ నిర్ధారణ ద్వారా ఈ మూలికల విలువను మనం ఎంత మేర పెంచగలమో మీరు ఊహించవచ్చువిస్తారమైన మార్కెట్‌ను సృష్టించవచ్చు.!

కాబట్టి మిత్రులారా,

ఆయుష్ విజయాలు ఆరోగ్య రంగానికి మాత్రమే పరిమితం కాదుప్రపంచ క్షేమానికి చేపడుతున్న చర్యలకు తోడ్పాటునిస్తూనే భారత్ లో నూతన అవకాశాలను సైతం కల్పిస్తోందిరానున్న పదేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా ఆయుష్ మారనుందిఆయుష్ కు చెందిన తయారీ రంగం విలువ 2014లో బిలియన్ల డాలర్లు ఉంటేఇప్పుడు అది 24 బిలియన్ డాలర్లకు చేరిందిఅంటే పదేళ్లలో రెట్లు వృద్ధిని సాధించిందిఅందుకే దేశంలోని యువత ఆయుష్ అంకుర సంస్థలను ప్రారంభిస్తున్నారుప్రస్తుతం దేశంలో 900కి పైగా ఆయుష్ అంకుర సంస్థలు ఉన్నాయిఇవి సంప్రదాయ ఉత్పత్తులుటెక్నాలజీ సాయంతో నడిచే ఉత్పత్తులుసేవలపై పనిచేస్తున్నాయిఇప్పుడు భారత్ 150 దేశాలకు బిలియన్ డాలర్ల విలువైన ఆయుష్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందిఇది ప్రత్యక్షంగా మన రైతులకు మేలు చేస్తుందిఒకప్పుడు స్థానిక మార్కెట్లకే పరిమితమైన మూలికలుసూపర్ ఫుడ్స్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్ కు చేరుతున్నాయి.

స్నేహితులారా,

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రైతులకు అందే ప్రయోజనాలను పెంచేందుకు ప్రభుత్వం మూలికల సాగును ప్రోత్సహిస్తోందినమామి గంగే ప్రాజెక్టు ద్వారా గంగా నది ఒడ్డున ప్రకృతి వ్యవసాయంమూలికల సాగును ప్రోత్సహిస్తున్నాం.

మిత్రులారా,

మన జాతీయ స్వభావంసామాజిక స్వరూప సారాంశాన్ని ‘సర్వే భవంతు సుఖినంసర్వే సంతు నిరామయం’ నుంచి స్వీకరించారుఅందరూ సంతోషంగా ఉండాలిఅనారోగ్యం నుంచి విముక్తి పొందాలి అని దీని అర్థంగత పదేళ్లలో, ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్‘ అనే మంత్రాన్ని అనుసరించడం ద్వారా ఈ భావనను దేశం అనుసరిస్తున్న విధానాలకు అనుసంధానించాంరాబోయే 25 ఏళ్లలోఆరోగ్య రంగంలో మేం చేస్తున్న ప్రయత్నాలు వికసిత్ భారత్‌’ (అభివృద్ధి చెందిన భారత్)కు బలమైన పునాది వేస్తాయిధన్వంతరి భగవంతుని ఆశీస్సులతో మనం ‘నిరామయ్ భారత్’ (ఆరోగ్యకరమైన భారతదేశం)తో పాటు ‘వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను.

స్నేహితులారా,

మనదేశానికి వారసత్వ సంపద అయిన ఆయుర్వేద గ్రంథాలను సంరక్షించేందుకు విశేష కృషి చేస్తున్నాంఇవి వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్నాయిఆ సంపదను భద్రపరిచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం పనిచేస్తోందిఇవన్నీ రాళ్లపైరాగి పలకలపై లేదా రాత ప్రతుల రూపంలో ఉండవచ్చువాటన్నింటినీ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాంఈ కృత్రిమ మేధ యుగంలో వాటిని టెక్నాలజీతో అనుసంధానించివాటిలోని కొత్త విషయాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాంఈ దిశగా గొప్ప ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాం.

స్నేహితులారా

మరోసారి ఈ దేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

 

 

***