Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్ సిఒ సమిట్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యలు

ఎస్ సిఒ సమిట్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యలు


శ్రేష్ఠులారా,

ఈ సంవత్సరం లో సవాళ్ల తో నిండిన ప్రపంచం మరియు ప్రాంతీయ వాతావరణం లలో ఎస్ సిఒ కు ప్రభావవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించినందుకు గాను అధ్యక్షుడు శ్రీ మిర్జియొయెవ్ ను నేను మనసారా అభినందిస్తున్నాను.
శ్రేష్ఠులారా,

ప్రస్తుతం, యావత్తు ప్రపంచం మహమ్మారి అనంతరం ఆర్థికం గా పుంజుకోవడం లో సవాళ్ల ను ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్ సిఒ యొక్క భూమిక చాలా ముఖ్యమైంది గా మారిపోతుంది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో సుమారు 30 శాతాన్ని తామే అందిస్తున్నాయి. మరి ప్రపంచ జనాభా ల 40 శాతం జనాభా నివసిస్తున్నది కూడా ఎస్ సిఒ దేశాల లోనే. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య మరింత సహకారాన్ని మరియు పరస్పర విశ్వాసాన్ని భారతదేశం సమర్ధిస్తుంది. మహమ్మారి మరియు యూక్రేన్ లో సంకటం ప్రపంచ సరఫరా వ్యవస్థల లో అనేక అడ్డంకుల ను ఏర్పరచాయి. ఈ కారణంగా, యావత్తు ప్రపంచం ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో శక్తి సంబంధి మరియు ఆహారం సంబంధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రాంతం లో ఆధారపడదగ్గ, ఆటుపోటులకు తట్టుకొని నిలబడగలిగిన మరియు వివిధత్వంతో కూడిన సరఫరా వ్యవస్థల ను తప్పక అభివృద్ధి పరచాలి. దీనికి గాను మెరుగైనటువంటి సంధానం అవసరపడుతుంది; అలాగే మనం అందరం ఒక దేశానికి మరొక దేశం గుండా ప్రయాణించడానికి పూర్తి హక్కు ను ఇవ్వడం కూడా ప్రధానం.

శ్రేష్ఠులారా,

మేం భారతదేశాన్ని తయారీ కేంద్రం గా తీర్చిదిద్దే అంశం లో పురోగతి ని సాధిస్తున్నాం. భారతదేశం లో ఉన్నటువంటి యవ్వన భరిత మరియు ప్రతిభాన్విత శ్రమ శక్తి మమ్మల్ని సహజంగానే స్పర్ధాత్మకం గా ఉంచుతుంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం లో 7.5 శాతం మేరకు వృద్ధి ని సాధించగలదన్న అంచనా ఉంది. ఇదే జరిగితే ప్రపంచం లోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల లోనే అత్యధికం కాగలదు. మేం అనుసరిస్తున్నటువంటి ప్రజలు కేంద్ర స్థానం లో ఉన్న అభివృద్ధి నమూనా లో సాంకేతిక విజ్ఞ‌ానాన్ని సరి అయిన విధం గా వినియోగించుకోవడం పట్ల చాలా శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతున్నది. మేం ప్రతి రంగం లో నూతన ఆవిష్కరణ ను సమర్థిస్తున్నాం. ఇవాళ, భారతదేశం లో 70 వేల కు పైగా స్టార్ట్-అప్స్ ఉన్నాయి. వాటి లో యూనికార్న్ స్ 100కు పైబడి ఉన్నాయి. మా యొక్క అనుభవం ఎస్ సిఒ లో ఇతర సభ్యత్వ దేశాల కు ఉపయోగకరం కావచ్చును. దీనికి గాను, స్టార్ట్-అప్స్ మరియు నూతన ఆవిష్కరణ ల గురించిన ఒక కొత్త స్పెశల్ వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేయడం ద్వారా మేం మా యొక్క అనుభవాన్ని ఎస్ సిఒ సభ్యత్వ దేశాలతో పంచుకొనేందుకు సిద్ధం గా ఉన్నాం.

శ్రేష్ఠులారా,

ప్రపంచం ప్రస్తుతం మరొక ప్రధానమైనటువంటి సమస్య ను ఎదుర్కొంటోంది. మరి అది ఏమిటి అంటే మన పౌరుల కు ఆహారపరమైన భద్రత కు పూచీ పడడం అనేదే. ఈ సమస్య కు ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారం ఏది అంటే అది చిరుధాన్యాల సాగు ను మరియు వినియోగాన్ని ప్రోత్సహించడం అనేదే. చిరుధాన్యాలు అనేవి చక్కని తిండి అని చెప్పాలి. వీటిని ఒక్క ఎస్ సిఒ దేశాలలోనే కాకుండా ప్రపంచం లో అనేక దేశాల లో వేల సంవత్సరాల నుండి పెంచడం జరుగుతూ వస్తోంది. అంతేకాక ఇవి సాంప్రదాయకం, పుష్టికరం కావడం తో పాటు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తక్కువ ఖర్చు తో లభించే ప్రత్యామ్నాయం కూడాను. 2023 వ సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరం గా పాటించడం జరుగుతుంది. ఎస్ సిఒ ఆధ్వర్యం లో ఒక చిరుధాన్యాల ఆహార ఉత్సవాన్ని నిర్వహించడాన్ని గురించి మనం పరిశీలించాలి.

ప్రపంచం లో వైద్యపరమైన మరియు శ్రేయస్సు సంబంధమైన పర్యటకానికి ప్రస్తుతం అతి తక్కువ ఖర్చయ్యే దేశాల లో భారతదేశం ఒక దేశం గా ఉంది. డబ్ల్యుహెచ్ఒ గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రేడిశనల్ మెడిసిన్ ను 2022 ఏప్రిల్ లో గుజరాత్ లో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సాంప్రదాయక వైద్యానికి ఉద్దేశించినటువంటి ఒకటో మరియు ఏకైక గ్లోబల్ సెంటర్ అని చెప్పుకోవాలి. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య సాంప్రదాయక వైద్యానికి సంబంధించిన ఒక కొత్త ఎస్ సిఒ వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేసేందుకు భారతదేశం చొరవ తీసుకొంటుంది.

నా ప్రసంగాన్ని ముగించే ముందు, ఈ నాటి ఈ సమావేశాన్ని చక్కగా నిర్వహించినందుకు మరియు స్నేహపూర్ణమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గాను అధ్యక్షుడు శ్రీ మిర్జియొయెవ్ కు నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేయాలనుకొంటున్నాను.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

అస్వీకరణ ఇది ప్రధాన మంత్రి వ్యాఖ్యల కు రమారమి అనువాదం. సిసలు ప్రసంగం హిందీ భాష లో సాగింది.

 

***