Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్ సిఒశిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్అర్దోగన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

ఎస్ సిఒశిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్అర్దోగన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి


1. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో 2022 సెప్టెంబర్ 16వ తేదీ న ఎస్ సిఒ శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్ అర్దోగన్ తో సమావేశమయ్యారు.

2. భారతదేశం తుర్కీ సంబంధాల ను ఇద్దరు నేత లు సమీక్షించారు. ఇటీవల కొన్నేళ్ల లో ఆర్థిక సంబంధాలు ప్రత్యేకించి ద్వైపాక్షిక వ్యాపారం లో నమైదు అయిన వృద్ధి ని వారు గమనిస్తూ, ఆర్థికపరమైనటువంటి మరియు వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను మరింత గా విస్తరించుకొనేందుకు అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని అంగీకరించారు.

3. నేత లు ఇరువురు ప్రాంతీయ ఘటన క్రమాలు మరియు ప్రపంచ ఘటన క్రమాల పైన కూడా వారి అభిప్రాయాల ను ఒకరి దృష్టికి మరొకరు తీసుకు వచ్చారు. ఒక్క ద్వైపాక్షిక అంశాలపైనే కాక, ప్రాంతం లబ్ధి కోసం కూడాను క్రమం తప్పక సంపర్కం కొనసాగించాలనే విషయం లో ఇద్దరు నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.

సమర్ కంద్

సెప్టెంబర్ 16, 2022

***