ఎస్ఓయూఎల్ (స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్) వారు నాయకత్వ చర్చావేదిక కార్యక్రమాన్ని ఈ నెల 21న న్యూ ఢిల్లీలో నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
నాయకత్వానికి సంబంధించిన అంశాల్ని చర్చించడానికి జీవనంలో వివిధ రంగాలకు చెందిన వారిని ఈ వేదిక ఒక చోటుకు తీసుకువస్తుందని శ్రీ మోదీ అన్నారు. వక్తలు వారి ప్రేరణాత్మక జీవన యాత్రలను గురించి, కీలక అంశాలపై వారి ఆలోచనల గురించి తెలియజేస్తారని, ఈ కార్యక్రమం ప్రత్యేకించి యువ శ్రోతలను ఆకట్టుకోగలదని కూడా శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
ఎస్ఓయూఎల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను ఈ నెల 21, 22 లలో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నందుకు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్‌ను నేను అభినందిస్తున్నాను. నాయకత్వానికి సంబంధించిన అంశాల్ని చర్చించడానికి జీవనంలో వివిధ రంగాలకు చెందిన వారిని ఈ వేదిక ఒక చోటుకు తీసుకువస్తుంది. వక్తలు వారి ప్రేరణాత్మక జీవన యాత్రలను గురించి, కీలక అంశాలపై వారి ఆలోచనల గురించి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా యువ శ్రోతలను ఆకర్షిస్తుంది.
శుక్రవారం చర్చావేదికలో నేను కూడా పాల్గొంటాను.
@LeadWithSoul”
I compliment the School of Ultimate Leadership for organising the SOUL Leadership Conclave on 21st and 22nd February in New Delhi. This forum brings together people from different walks of life to discuss aspects relating to leadership. The speakers will share their inspiring…
— Narendra Modi (@narendramodi) February 18, 2025