Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్ఎఎఆర్ సి స‌భ్య‌త్వ దేశాల‌ కు ఉద్దేశించిన క‌రెన్సీ మార్పిడి వ్యవస్థ యొక్క సమగ్ర సదుపాయం పరిధి లో నిర్వహింపబడే విధం గా ఆ వ్యవస్థ లో 400 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల మేర ‘స్టాండ్ బై స్వాప్’ను కలుపుతూ సదరు వ్యవస్థ లో స‌వ‌ర‌ణ‌ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) స‌భ్య‌త్వ దేశాల విజ్ఞప్తుల ను మరియు భార‌తదేశం యొక్క స్వీయ అవ‌స‌రాల‌ ను ఉపయుక్త రూప రీత్యా పరిగణన లోకి తీసుకొని.. 2 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల తో కూడిన సమగ్ర సదుపాయం పరిధి కి లోబడి నిర్వహింపబడే విధం గా 400 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల రాశి మేర ‘అదనపు వినిమయా’న్ని చేర్చటం కోసం మరియు వినిమయం యొక్క అవధి, రోల్ ఓవర్ వగైరా కార్యవిధుల లో సరళత్వాన్ని ప్రవేశపెట్టటం కోసం ‘ఫ్రేమ్ వర్క్ ఆన్ కరెన్సీ స్వాప్ అరేంజ్ మెంట్ ఫర్ ఎస్ఎఎఆర్ సి మెంబర్ కంట్రీస్’ లో సవరణ కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

మ‌ఖ్యాంశాలు:

ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో ఫైనాన్షియ‌ల్ రిస్క్ మరియు అనిశ్చితి పెచ్చుపెరుగుతుండ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల సార్క్ దేశాల స్వ‌ల్ప కాలిక వినిమయ అవ‌స‌రాలు గ‌తం లో అంగీక‌రించిన స్థాయి లను మించిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇప్ప‌టికే ఆమోదించినటువంటి సార్క్ స్వాప్ ఫ్రేమ్‌వ‌ర్క్ ప‌రిధి లో ‘స్టాండ్ బై స్వాప్‌’ను చేర్చ‌టం ఈ ఫ్రేమ్ వర్క్‌ ను స‌ర‌ళ‌త‌రం చేయ‌నుంది. ఇది సార్క్ స్వాప్ ఫ్రేంవ‌ర్క్ లో భాగం గా ప్ర‌స్తుతం నిర్దేశించిన ప‌రిమితి కి మించి స్వాప్ మొత్తాన్ని వాడుకొనేందుకు సంబంధించి సార్క్ స‌భ్య‌త్వ దేశాల‌ నుండి వ‌చ్చే ప్ర‌స్తుత విన‌తుల‌ కు భారతదేశం సత్వరం ప్రతిస్పందించేందుకు వీలు క‌ల్పించగలదు.

పూర్వరంగం:

ఫ్రేమ్ వర్క్ ఆన్ కరెన్సీ స్వాప్ అరేంజ్ మెంట్ ఫర్ ఎస్ఎఎఆర్ సి మెంబర్ కంట్రీస్ ను కేంద్ర మంత్రివర్గం 2012వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ న ఆమోదించింది. స్వ‌ల్ప‌ కాలిక విదేశీ మార‌క‌ ద్ర‌వ్య అవ‌స‌రాల కోసం ఒక ఫండింగ్ మార్గాన్ని క‌ల్పించ‌టానికి, లేదా దీర్ఘ కాలిక ఏర్పాటు జ‌రిగే వ‌ర‌కు బాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని అధిగ‌మించ‌టానికి, లేదా ఈ అంశాన్ని స్వ‌ల్ప‌ కాలంలో ప‌రిష్క‌రించ‌టానికి దీని ని ఆమోదించారు.

ఈ ఏర్పాటు లో భాగం గా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) వివిధ సైజుల‌ లో యుఎస్ డాల‌ర్ లు, యూరో లేదా ఐఎన్ఆర్ క‌రెన్సీల‌ లో ఆయా సార్క్ స‌భ్యత్వ దేశాల రెండు నెల‌ల దిగుమ‌తుల అవ‌స‌రాల‌ ను దృష్టి లో పెట్టుకొని మొత్తం గా 2 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల కు మించ‌కుండా స్వాప్‌ ను ఆఫ‌ర్ చేస్తుంది. ప్ర‌తి దేశాని కి సంబంధించి స్వాప్ మొత్తాన్ని ప్ర‌తి దేశాని కి పై ఏర్పాటు లో నిర్వ‌చించ‌డం జ‌రిగింది. ఇది క‌నిష్ఠం గా 100 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్లు, గ‌రిష్ఠం గా 400 మిలియ‌న్ డాల‌ర్లు గా ఉంటుంది. ప్ర‌తి డ్రాయ‌ల్ కూడా మూడు నెల‌ల కాలాని కి, గ‌రిష్ఠం గా రెండు రోల్ ఓవ‌ర్ లకు ఉంటుంది.

స్టాండ్‌ బై స్వాప్‌ ను వాడుకొనే సార్క్‌ స‌భ్య‌త్వ దేశాలకు చెందిన సెంట్ర‌ల్ బ్యాంకుల‌ తో ఇందుకు సంబంధించిన నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన వివరాల విష‌యం లో ఆర్‌బిఐ ద్వైపాక్షిక సంప్ర‌దింపుల ను జ‌రుపుతుంది.