కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ సవాలును ఎదుర్కొనడంపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎలక్ట్రానిక్ మాధ్యమ ప్రసారకర్తల్లోని కీలక భాగస్వాములతో దృశ్య-శ్రవణ మార్గంద్వారా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముందుగా- ఈ ప్రపంచ మహమ్మారి ముప్పు తీవ్రతను అర్థం చేసుకుని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా కృషిచేస్తున్న అన్ని మాధ్యమాలకూ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామన్లు, సాంకేతిక నిపుణులు అటు క్షేత్రస్థాయిలో, ఇటు స్టూడియోల్లో నిర్విరామంగా శ్రమిస్తున్నారంటూ ప్రశంసించారు. అంకితభావం, చిత్తశుద్ధితో కూడిన వారి విధి నిర్వహణను జాతికి చేస్తున్న గొప్ప సేవగా ఆయన కొనియాడారు. అదే సమయంలో కొందరు సిబ్బంది ఇళ్లనుంచే పనిచేసేలా కొన్ని చానెళ్లు వినూత్న ప్రయత్నం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19ను ఒక జీవితకాలపు సవాలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త, ఆవిష్కరణాత్మక పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. మన పోరాటం మున్ముందు కూడా సుదీర్ఘంగా కొనసాగాల్సి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా సామాజిక దూరం పాటించడంపై అవగాహన పెంచాలన్నారు. అలాగే తాజా పరిణామాలపై సమాచారాన్ని, కీలక నిర్ణయాలను వేగంగా ప్రజలకు చేరవేయాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఇదంతా సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ప్రజానీకానికి అందించడంలో వృత్తి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు. ప్రసార మాధ్యమాలు ఒకవైపు- ప్రజలు స్వీయ రక్షణను విస్మరించి, నిర్లక్ష్యానికి తావివ్వకుండా చూడటమేగాక మరోవైపు- వాస్తవ సమాచారమిస్తూ వారిలో నిరాశావాదాన్ని, భయాందోళనలను పారదోలేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో ఎంతో సాహసంతో ముందునిలిచి, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిత్యనూతన ఉత్తేజం నింపాల్సిన బాధ్యత కూడా మాధ్యమాలపై ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, ప్రసారంలో వార్తా చానెళ్లు కీలక సాధనంగా ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటున్నదని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్లకు పొడవాటి గొట్టం చివరన అమర్చిన ప్రత్యేక మైకులను అందించాలని చానెళ్ల యాజమాన్యాలకు ఆయన సూచించారు. ఆ మేరకు వారు ఇంటర్వ్యూల వంటివి నిర్వహించే సమయంలో ఒక మీటరు సామాజిక దూరం పాటించగలిగేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమాచార ప్రదానంలో శాస్త్రీయ నివేదికలకు ప్రాచుర్యం లభించేలా చూడాలన్నారు. అవాస్తవాల వ్యాప్తి నిరోధం కోసం బృంద చర్చలలో నిష్ణాతులైన ప్రముఖులను భాగస్వాములను చేయాలని నిర్దేశించారు. అలాగే వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సామాజిక దూరం పాటించడంలో పౌరులు కూడా క్రమశిక్షణతో మెలగటం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. కరోనా వైరస్ సవాలును ఎదుర్కొనడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రధానమంత్రి నాయకత్వ పటిమకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రపంచ మహమ్మారిని తరిమికొట్టడంలో ఆయనతో చేయికలిపి ముందడుగు వేస్తామని వారు హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రికి ప్రజలతో భావోద్వేగపూరిత అనుబంధం ఉందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. అందువల్ల తరచూ ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కోవిడ్-19పై సానుకూల కథనాలను… ప్రత్యేకించి ఆ మహమ్మారి నుంచి విముక్తులైనవారి అనుభవాలను తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని కోరారు. అలాగే లేనిపోని వదంతుల నివారణకు, వాస్తవాల నివేదనలో రిపోర్టర్లకు మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన డాక్టర్లతో 24గంటలూ పనిచేసే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వ మాధ్యమం ప్రసారభారతి ద్వారా రోజుకు రెండుసార్లు ప్రజలకు అధికారిక సమాచారం అందించాలని, దీన్ని ఇతర టీవీ చానెళ్లు కూడా వినియోగించుకనే వీలుందని సూచించారు.
ఎంతో విలువైన సూచనలు-సలహాలు, సమాచారం ఇచ్చినందుకుగాను ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రతినిధులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరెన్సీ నోట్లద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చానెళ్ల ప్రతినిధులకు ఆయన సూచించారు. దీంతోపాటు ప్రజలకు శాస్త్రీయ సమాచార నివేదనద్వారా మూఢనమ్మకాల వ్యాప్తిని నిరోధించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం సేకరించే విలేకరులు ఆ విషయాలను ఎప్పటికప్పుడు చురుగ్గా తమతో పంచుకోవడంపై ఆ శాఖ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం రూపొందించిన ప్రభుత్వ శ్రేణి ప్రభుత్వ వ్యవస్థ సంబంధిత వివరాలను ఆమె వివరించారు. దీంతోపాటు సవాళ్లను ఎదుర్కొనడంలో సామర్థ్య నిర్మాణం దిశగా నిరంతరం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. వైరస్ పీడితులకు పరీక్షల సంబంధిత వ్యూహంలోనూ ఇదేవిధమైన ప్రతిస్పందన విధానాన్ని అనుసరిస్తున్నామని, పరీక్ష ఉపకరణాలకు ఆమోద ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామని భారత వైద్యపరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ చెప్పారు. కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రితోపాటు ఆ శాఖ కార్యదర్శిసహా ప్రముఖ ఎలక్ట్రానిక్ మాధ్యమ సంస్థల సంపాదకులు, ఇతర సీనియర్ ప్రతినిధులు ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాల్గొన్నారు.
I have been having a series of video conference interactions with various stakeholders on tackling the COVID-19 menace. Today, I interacted with those associated with the electronic media and heard their insightful views. #IndiaFightsCoronahttps://t.co/IJUnkeZmhX
— Narendra Modi (@narendramodi) March 23, 2020
The media world has played a great role in spreading awareness on subjects related to COVID-19. I salute all those media persons who have been reporting from the ground as well as in the newsroom. Happy to see channels facilitating 'work from home arrangements' for their teams.
— Narendra Modi (@narendramodi) March 23, 2020
Even greater caution, zero carelessness.
— Narendra Modi (@narendramodi) March 23, 2020
Urged electronic media to counter misinformation related to COVID-19, which is creating panic. Also urged them to take relevant precautions in their own organisations especially when their team members do on ground reporting.
One thing I specially requested all media houses to do is to keep reiterating the importance of social distancing and being indoors.
— Narendra Modi (@narendramodi) March 23, 2020
I urge them to keep stating- #StayHome.