Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్ డిఎమ్ఎ ఆరో సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

ఎన్ డిఎమ్ఎ ఆరో సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

ఎన్ డిఎమ్ఎ ఆరో సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున న్యూ ఢిల్లీ లో జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డిఎమ్ఎ) ఆరో సమావేశానికి అధ్యక్షత వహించారు.

దేశం లో విపత్తులు వాటిల్లినప్పుడు వాటి పట్ల దీటుగా ప్రతిస్పందించడం కోసం ఎన్ డిఎమ్ఎ చేపట్టే కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఎన్ డిఎమ్ఎ అమలుపరుస్తున్న పథకాలను కూడా ఆయన సమీక్షించారు.

సంబంధిత వర్గాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని గురించి మరియు ప్రాణాలను కాపాడడం కోసం, ఆస్తులను కాపాడడం కోసం తగిన విధంగా స్పందించడానికై సంయుక్త విన్యాసాలను మరిన్నింటిని నిర్వహించవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. విపత్తు నిర్వహణ రంగం లోకి ప్రపంచ ప్రావీణ్యాన్ని తీసుకు రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశం లో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ఇంకా వ్యవసాయం రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాధా మోహన్ సింహ్ లతో పాటు ఎన్ డిఎమ్ఎ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.