నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ ఆర్ & డి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ (ఎన్ఎటిఆర్ఐపి) కి సంబంధించిన రూ. 3727.30 కోట్లతో కూడిన సవరించిన వ్యయ అంచనాకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఆమోదం కారణంగా ఎన్ ఎ టి ఆర్ ఐ పి కింద ఉన్న ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. భారతదేశంలో గ్లోబల్ టెస్ట్ సెంటర్ల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమమే ఎన్ ఎ టి ఆర్ ఐ పి. ఇది ఆటోమోటివ్ ఇండస్ట్రీ కి కీలకమైన పరిశోధన- అభివృద్ధి (ఆర్ & డి) అవసరాలను తీర్చుతుంది. పూర్తి స్థాయిలో పనిచేసే టెస్టింగ్, హోమోలొగేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ప్రాంతాలు హరియాణా లోని ఐ సి ఎ టి- మానేసర్ లోని ఉత్తర భాగ ఆటో- క్లస్టర్ లోను, తమిళ నాడు రాష్ట్రం చెన్నైలోని జి ఎ ఆర్ సి- ఒరగడమ్ లోని దక్షిణ ఆటో- క్లస్టర్ లోను ఉంటాయి. పశ్చిమ ప్రాంత ఆటో క్లస్టర్ కోసం ఇప్పటికే పని చేస్తున్న మహారాష్ట్ర పుణేలోని ఎ ఆర్ ఎ ఐ కేంద్రాన్ని, అహమ్మద్ నగర్ లోని వి ఆర్ డి ఇ కేంద్రాన్ని ఆధునికీకరించడం జరుగుతుంది.
ఎన్ ఏ టిఆర్ ఐ పి ప్రాజెక్ట్ అవసరం:
• భారతదేశంలో మోటారు వాహనాల డిజైన్, తయారీ, పరీక్ష, నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసి పర్యావరణ సంరక్షణ చేపట్టాలి. అంతే కాదు రహదారి భద్రత కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించాలి. ఇందుకోసం ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అంతే కాదు, 1998 డబ్ల్యుపి-29 కింద యుఎన్ రెగ్యులేషన్ ఆన్ హార్మొనైజేషన్ ఆప్ వెహికల్ స్పెసిఫికేషన్స్ పైన భారతదేశం సంతకం చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి వుంది.
• భారతదేశానికి సంబంధించిన ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2016-26 కు మద్దతుగా నిలచేందుకు ఈ ప్రాజెక్టు అవసరం. ఈ ప్లాన్ ప్రకారం భారతదేశ ఆటోమోటివ్, కాంపొనెంట్ తయారీదారులు అంతర్జాతీయ స్థాయి పోటీకి అనుగుణంగా ఎగుమతులు చేయగలుగుతారు. రాబోయే పది సంవత్సరాల్లో మొత్తం ఉత్పత్తిలో ఎగుమతులు 35-40 శాతంకు చేరుకోవడానికిగాను ఈ ప్లాన్ ను రూపొందించడం జరిగింది.
• భారతీయ వాహనాలు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయడానికి ఈ ప్రాజెక్టు అవసరం. ( ఐక్యరాజ్యసమితి బ్రసీలియా తీర్మానం ప్రకారం ) రోడ్డు ప్రమాద బాధితుల, ప్రమాదాల సంఖ్యను తగ్గించాల్సి వుంది. ( 2015 సంవత్సరంలో రోడ్డు ప్రమాద బాధితులు 1.46 లక్షలు, రోడ్డు ప్రమాదాలు 5.01 లక్షలు).
ఆటో విడిభాగాల అభివృద్ధి, ధ్రువీకరణలోను ఎమ్ ఎస్ ఎ ఇ లకు సహాయం చేయాల్సి వుంది. ఓఇఎంలు, విడిభాగాల అమ్మకం తర్వాత కూడా ఈ సహాయం ఉండాలి.
• ముఖ్యమైన కాంపొనెంట్లు అంతర్జాతీయ స్థాయి ల్యాబులతో కలిపి నెలకొల్పుకోవాలి. పవర్ ట్రెయిన్, పాసివ్ సేప్టీ టెస్టులు 1 (క్రాష్ టెస్టులతో కలిపి), సాంకేతికత పరీక్ష కోసం ట్రాకులు (ఇండోర్ దగ్గర గల హైస్పీడ్ ట్రాక్ తో కలిపి), ఫాటిగ్యు అండ్ సర్టిఫికేషన్, ఎలక్ట్రో మేగ్నటిక్ కంపేటబిలిటీ టెస్టులు, నాయిస్ వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్ టెస్టులు, సి ఎ డి అండ్ సి ఎం ఇ అండ్ ఇన్ ఫో ట్రానిక్స్ కోసం వీటిని నెలకొల్పుకోవాలి. వీటిలో చాలా ల్యాబులు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఈ మౌలిక వసతులు మన దేశంలో వాహన, వాహన విడిభాగాల తయారీదారులు ఆటోమోటివ్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, సర్టిఫికెట్ తేవడానికిగాను వాటి తయారీదారులకు ఉపయోగపడతాయి. అంతే కాదు వారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అనుసరించడానికి ఉపయోగపడతాయి. తద్వారా “మేక్ ఇన్ ఇండియా” లక్ష్యం నెరవేరుతుంది.
ఆటోమోటివ్ క్లయింట్ బేస్, అందించే సేవలకు సంబంధించిన సారాంశం కింద ఇవ్వడం జరిగింది. ఎన్ ఎ టి ఆర్ ఐ పి కేంద్రాలను స్థానికంగాను, అంతర్జాతీయంగాను పోటీపడేలా చేయడానికి, ఆటో హబ్ లతో పూర్తిగా కలసిపోయేలా చేయడానికిగాను సేవలను రూపొందించడం జరిగింది. తద్వారా “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి ఊతాన్ని ఇచ్చి భారతీయ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఎగుమతులలో పోటీ పడేలా చేయడానికిగాను క్లయింట్ బేస్ ను, సేవలను రూపొందించడం జరిగింది.
ఎ) వినియోగదారుల విభాగాలు
నాలుగు చక్రాల వాహనాల తయారీదారులు / వాణిజ్య వాహనాల తయారీదారులు / మూడు చక్రాల వాహనాల తయారీదారులు / ద్విచక్ర వాహనాల తయారీదారులు / నిర్మాణరంగ వాహనాల తయారీదారులు / వ్యవసాయ వాహనాల తయారీదారులు (ట్రాక్టర్లు) / ఇ- రిక్షాల తయారీదారులు / బస్ బాడీ తయారీదారులు / సి ఎన్ జి- ఎల్ పి జి కిట్ రెట్రోఫిట్టర్స్ / ఆటోమోటివ్ అండ్ నాన్ ఆటోమోటివ్ ఇంజిన్ తయారీదారులు / డిజిసెట్ తయారీదారులు / ఆటోమోటివ్ కాంపొనెంట్ తయారీదారులు.
బి) సేవల వివరాలు
1. వివిధ విభాగాల వాహనాల ధ్రువీకరణ. సిఎంవిఆర్ – 1989 ప్రకారం హెచ్ఇవి/ ఇవి / డీసెల్ / గాసోలిన్ / సిఎన్ జి / ఎల్ పి జి మొదలైనవి కలుపుకొని.
2. సి ఎం వి ఆర్ – 1989, సంబంధిత ఐ ఎస్ / ఎ ఐ ఎస్ ల ప్రకారం వాహనాలకు సంబంధించి గుర్తించిన విడిభాగాల ధ్రువీకరణ.
3. ఇతర అధీకృత ఏజెన్సీలతో కలసి భారతీయ తయారీదారులు యూరోప్ / దక్షిణ ఆఫ్రికా / మలేషియా / ఇండోనేషియా / బ్రెజిల్ మొదలైన దేశాలకు వాహనాలను, విడిభాగాలను ఎగుమతి చేసేందుకు వీలుగా ధ్రువీకరణ.
4. ఆటోమోటివ్ పరిశ్రమ, ఒ ఇ ఎం లు, విడిభాగాల అభివృద్ధి కోసం సేవలు. ఉత్పత్తితోపాటు, అభివృద్ధి అవసరాల మేరకు.
5. ఆటోమోటివ్ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వహణ.
6. అభివృద్ధి దశలోని వాహనం, వాహన శ్రేణి పరీక్ష, సామర్థ్య అంచనా, మన్నిక పరీక్ష.
7. సాంకేతిక అభివృద్ధి, ఆర్ & డి ప్రాజెక్టులు.
8. నూతన నిబంధనల రూపకల్పన కోసం సమాచార సేకరణ.