Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన   ప్ర‌ధాన మంత్రి

ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన   ప్ర‌ధాన మంత్రి

ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన   ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఎన్‌సిసి కేడెట్ ల మ‌ధ్య తాను ఉన్న ప్ర‌తి సంద‌ర్భం లోనూ తనకు గ‌త స్మృతులు గుర్తు కు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు.

గ‌డ‌చిన ఒక సంవ‌త్స‌రం కాలం లో ఎన్‌సిసి కేడెట్ లు స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్‌, డిజిట‌ల్ లావాదేవీలు త‌దిత‌ర అనేక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల తో మ‌మేకం అయ్యారంటూ ఆయ‌న హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. కేర‌ళ లో వ‌ర‌ద‌ల కాలం లో ర‌క్ష‌ణ మరియు స‌హాయ‌క కార్య‌క‌లాపాల లో వారు అందించిన తోడ్పాటు ప్ర‌త్యేకించి ప్ర‌శంసార్హ‌ంగా ఉందని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశాన్ని ఒక వెలుగులీనుతున్న న‌క్ష‌త్రం వలె యావ‌త్తు ప్ర‌పంచం చూస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌త‌దేశం చాలా సామ‌ర్ధ్యం క‌లిగిన‌టువంటిదే కాక ఆ సామ‌ర్ధ్యాన్ని కార్య‌రూపం లోకి కూడా తీసుకు వ‌స్తోంద‌న్న ఒక దృష్టికోణం నెలకొంద‌ని ఆయ‌న చెప్పారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా కావ‌చ్చు లేదా ర‌క్ష‌ణ రంగం పరంగా కావ‌చ్చు, భార‌త‌దేశం యొక్క సామర్థ్యాలు విస్త‌రించాయని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం శాంతి కి ఒక మ‌ద్ద‌తుదారు గా ఉన్న‌ప్ప‌టికీ, జాతీయ భ‌ద్ర‌త కోసం అవ‌స‌ర‌మైతే ఎటువంటి చ‌ర్య‌ల‌నైనా తీసుకోవ‌డానికి వెనుకాడ‌బోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవత్స‌రాల లో ర‌క్ష‌ణ కోసం మ‌రియు భ‌ద్ర‌త కోసం ప‌లు ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌ ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. ప‌ర‌మాణు త్రిపాది ని అభివృద్ది ప‌ర‌చిన అతి కొద్ది దేశాల స‌ర‌స‌ న ప్ర‌స్తుతం భార‌త‌దేశం నిల‌చింద‌ని ఆయ‌న చెప్పారు. యువ‌జ‌నులు వారి యొక్క క‌ల‌ల‌ ను దేశం భ‌ద్రం గా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే పండించుకోగ‌లుగుతార‌ని ఆయ‌న అన్నారు.

కేడెట్ లు క‌ఠోరంగా శ్ర‌మించారని ఆయ‌న ప్ర‌శంసిస్తూ, వారి లో చాలా మంది ప‌ల్లెల నుండి, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల నుండి వ‌చ్చిన వారు ఉన్నారన్నారు. ఈ దేశం గ‌ర్వపడేట‌ట్టు ప‌లువురు ఎన్‌సిసి కేడెట్ లు చేశార‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భం లో ప్ర‌ఖ్యాత క్రీడాకారిణి హిమ దాస్ ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. క‌ఠోర శ్ర‌మ మ‌రియు ప్ర‌తిభ లే విజ‌యాన్ని ఖాయం చేస్తాయ‌ని ఆయ‌న అన్నారు. విఐపి సంస్కృతి స్థానం లో – ఇపిఐ (ఎవిరీ ప‌ర్స‌న్ ఈజ్ ఇంపార్టెంట్)ని ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. అన్ని విధాలైన ప్ర‌తికూల‌త కు దూరంగా ఉండండి; స్వీయ ఉన్న‌తి కి మ‌రియు దేశ ప్ర‌జ‌ల కోసం కృషి చేయండ‌ంటూ కేడెట్ ల‌కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. మ‌హిళ‌ల‌ కు అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం కోసం మరియు శ్రామిక శ‌క్తి లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచ‌డం కోసంఅనేక చ‌ర్య‌ల‌ ను తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు. మ‌హిళ‌ లు ప్ర‌స్తుతం భార‌తీయ వాయు సేన‌ లో మొట్ట‌మొద‌టి సారి గా ఫైట‌ర్ పైలట్ లు అయ్యార‌ని ఆయ‌న తెలిపారు.

అవినీతి ‘న్యూ ఇండియా’ లో ఒక భాగం కాజాల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి ప‌లికారు. అవినీతి కి పాల్ప‌డుతున్న వారిని విడ‌చిపెట్ట‌బోమ‌న్నారు.

స్వ‌చ్ఛ్ భారత్ మ‌రియు డిజిట‌ల్ ఇండియా ల వంటి కీల‌క‌మైన కార్య‌క్ర‌మాల‌ లో యువ‌త క్రియాశీల భాగ‌స్వామ్యం వ‌హిస్తున్నందుకు వారిని ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ పట్ల ఇతోధిక జాగృతిన్ని వ్యాప్తి చేయ‌వ‌ల‌సిందిగా కేడెట్ ల‌ను ఆయ‌న కోరారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల‌ లో పెద్ద సంఖ్య‌ లో పాలుపంచుకొని వోటు ను వేయాలంటూ యువ‌తీ యువ‌కుల‌ ను ఉత్తేజ‌ప‌ర‌చవలసిందిగా కూడా వారి కి ఆయ‌న సూచించారు.

ఇటీవ‌ల కాలం లో ఢిల్లీ న‌గ‌రం లో రూపుదిద్దుకున్న అనేక నూత‌న చిహ్నాల‌ ను కేడెట్ లు సంద‌ర్శించ‌వ‌చ్చున‌ని ఆయ‌న చెప్పారు. వీటి లో మ‌హానాయ‌కుల మ‌రియు భార‌త‌దేశ వార‌స‌త్వం తో ముడిప‌డిన చిహ్నాలు ఉన్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ సంద‌ర్భం గా ఎర్ర‌ కోట లోని క్రాంతి మందిర్ ను గురించి మ‌రియు అలీపుర్ రోడ్డు లోని బాబాసాహెబ్ డాక్టర్ భీం రావ్ ఆంబేడ్ కర్ యొక్క మహాపరినిర్వాణ్ స్థ‌ల్ ను గురించి ఆయ‌న ప్రస్తావించారు. ఈ స్థలాలను ఎవరైనా సంద‌ర్శిస్తే చాలు, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌న్న ఒక కొత్త శ‌క్తి వారి లో నిండిపోతుంద‌ని ఆయ‌న అన్నారు.

***