Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్‌సిసి ర్యాలీలో ప్రసంగించిన ప్ర‌ధాన‌ మంత్రి


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ఎన్‌సిసి ర్యాలీలో ప్ర‌సంగించారు. ప్ర‌తి ఒక్క ఎన్‌సిసి కాడెట్ అతడి లేదా ఆమె యొక్క సొంత వ్య‌క్తిత్వంతో, గుర్తింపుతో ఇక్క‌డ‌కు వ‌చ్చార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. నెల రోజుల పాటు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డి ఉంటాయి, ప‌ర‌స్ప‌రం చాలా నేర్చుకొని ఉంటారు అని కాడెట్ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి వ్యాఖ్యానించారు. పాల్గొన్న యువ‌తీయువ‌కులలో ప్ర‌తి ఒక్క‌రికీ దేశం లోని భిన్న సంస్కృతులను గురించి ఎన్‌సిసి శిబిరాలు బోధిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. జాతికి ఏదో ఒక మేలు చేయాల‌నే కాంక్ష‌ను ఈ శిబిరాలు ఉద్దీపింపచేస్తాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి పేర్కొన్నారు.

ఎన్‌సిసి శిబిరాలలో నేర్చుకొనే అంశాలు కాడెట్ లకు జీవిత‌ ప‌ర్యంతం స్ఫూర్తిగా నిలుస్తాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. నేష‌న‌ల్ కాడెట్ కోర్ అంటే యూనిఫారం ధ‌రించ‌డం, అంద‌రూ ఒకే ర‌కంగా క‌నిపించ‌డం మాత్ర‌మే కాద‌ని, అది ఐక్య‌త‌కు చిహ్న‌మ‌ని ఆయ‌న అన్నారు. ఎన్‌సిసి ద్వారా ఇత‌రుల‌కు స్ఫూర్తివంతంగా ఉండే ల‌క్ష‌ణాలను ఒక ఉద్య‌మ స్ఫూర్తితో ఈ బృందాల‌కు నేర్పుతార‌ని ఆయ‌న చెప్పారు.

ఎన్‌సిసి ఏడు ఉజ్జ్వల‌ ద‌శాబ్దాలను పూర్తి చేసుకొని ప‌లువురిలో ఉద్య‌మ స్ఫూర్తిని నింపినట్లు ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఈ రోజు మ‌నం ఇంత‌కాలం ఏ సాధించామో గుర్తు చేసుకొని వేడుక జరుపుకోవ‌డంతో పాటు రానున్న సంవ‌త్స‌రాలలో ఎన్‌సిసి మ‌రింత స‌మ‌ర్థ‌ంగా ప‌ని చేసి కొత్త అనుభ‌వాలను ఆర్జించేందుకు ఏం చేయాలి అని ఆలోచిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఎన్‌సిసి 75 సంవ‌త్స‌రాల పండుగ నాటికి- అంటే వ‌చ్చే ఐదు సంవ‌త్స‌రాల కాలంలో- ఏం చేయ‌వ‌ల‌సి ఉంటుందనే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికను గురించి ఆలోచించాల‌ని ఆ విభాగంతో సంబంధం ఉన్న వారంద‌రికీ ప్ర‌ధాన‌ మంత్రి సూచించారు.

భార‌త యువ‌త ఇప్పుడు అవినీతిని అనుమ‌తించ‌డం లేద‌ని శ్రీ న‌రేంద్ర‌ మోదీ అన్నారు. అవినీతిపైన, న‌ల్ల‌ధ‌నంపైన పోరాటం ఆగ‌బోద‌ని ఆయ‌న నొక్కి పలికారు. ఇది భార‌త యువత భ‌విష్య‌త్తు కోసం చేస్తున్న పోరాట‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

భీమ్ యాప్ ద్వారా డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించాల‌ని, ఆ వేదిక‌లో చేరాల‌ని ఇత‌రుల‌లో ప్రేరణను రగిలించాల‌ని ప్ర‌ధాన మంత్రి ఎన్‌సిసి కాడెట్ లకు విజ్ఞ‌ప్తి చేశారు. పార‌ద‌ర్శ‌క‌త‌ దిశగా, బాధ్య‌తాయుత వైఖ‌రి దిశ‌గా ఇది ఒక అడుగు అని ఆయ‌న చెప్పారు. భార‌త యువ‌త ఏదైనా ఒక‌టి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారంటే ప్ర‌తి ఒక్క‌టి సాధ్య‌మే అని ఆయ‌న అన్నారు.

సంప‌న్నులకు, శక్తివంతుల‌కు ఏదీ జ‌ర‌గ‌దు అని గ‌తంలో ప్ర‌జ‌లు భావించే వార‌ని, కానీ ఈ రోజు ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. అవినీతి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకుగాను గ‌తంలో ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేసిన ముగ్గురు నాయ‌కులు ఇప్పుడు జైలులో ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.

ఆధార్ ను గురించి మాట్లాడుతూ అది భార‌త అభివృద్ధికి ఎన‌లేని బ‌లాన్ని ఇచ్చింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. గ‌తంలో త‌ప్పుడు వ్య‌క్తుల చేతుల లోకి వెళ్లిన ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇప్పుడు అస‌లైన ల‌బ్ధిదారుల‌కే అందుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

***