Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్ఈపీ 2020 మన దేశంలో మేధా పునరుజ్జీవనోద్యమం: ప్రధానమంత్రి


గత పది సంవత్సరాల్లో భారత్‌లో విద్యారంగం చారిత్రక మార్పునకు లోనైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 (ఎన్ఈపీ 2020)ని మన దేశంలో చోటు చేసుకొన్న మేధా పునరుజ్జీవనోద్యమంగా ఆయన అభివర్ణించారు. ఈ ఎన్ఈపీ విద్య ద్వారా, నవకల్పన ద్వారా ఒక స్వయంసమృద్ధ, ప్రపంచ స్థాయిలో పోటీపడగలిగే దేశ ఆవిష్కారానికి బాటను పరుస్తోందని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంపై ప్రధాని స్పందిస్తూ:

‘‘గత పదేళ్లలో భారత్‌లో విద్యారంగం ఎలా ఒక చారిత్రక మార్పునకు లోనైందో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ (@dpradhanbjp) ప్రధానంగా చెప్పారు. ఎన్ఈపీ 2020 ఒక సంస్కరణకన్నా మించింది. ఇది మన దేశంలో మేధా పునరుజ్జీవనోద్యమం. విద్య బోధన, నవకల్పనల అండతో ఒక స్వయంసమృద్ధమైన, ప్రపంచ దేశాలతో పోటీపడగలిగిన దేశ నిర్మాణానికిది బాటవేస్తోంది’’ అని పేర్కొన్నారు.