కళ ద్వారా పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేలా నిర్వహించిన ఎగ్జామ్ వారియర్స్ కళా ఉత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
న్యూఢిల్లీలోని శాంతిపథ్‌లో జనవరి 4న ఈ ఎగ్జామ్ వారియర్స్ కళా ఉత్సవాన్ని నిర్వహించారు. తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు 30 పాఠశాలలకు చెందిన 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 4,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పైన పేర్కొన్న కళా ఉత్సవానికి సంబంధించి ఎగ్జామ్ వారియర్స్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు ప్రధాని స్పందించారు:
‘‘సృజనాత్మక విజయం ద్వారా పరీక్షల ఒత్తిడిని అధిగమించడం!
ఎంతో మంది బాలలు సమష్టిగా ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించి శక్తిమంతమైన సందేశాన్ని అందించేందుకు కళాశక్తిని ఉపయోగించడం ఆనందంగా ఉంది’’.
Overcoming exam stress through creative success!
— Narendra Modi (@narendramodi) January 7, 2025
Happy to see so many youngsters come together and harness the power of art to convey a powerful message of stress free exams. https://t.co/84glxybKhs