Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎక్స్ పో 2020, దుబయి లోని ఇండియా పెవిలియన్ లో సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం

ఎక్స్  పో 2020, దుబయి లోని ఇండియా పెవిలియన్ లో సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం


నమస్తే,

ఎక్స్ పో 2020, దుబయి లో ఇండియా పెవిలియన్ కు స్వాగతం. ఇది ఒక చరిత్రాత్మకమైన ఎక్స్ పో. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాల లో నిర్వహిస్తున్న ఒకటో ఎక్స్ పో ఇది. ఈ ఎక్స్ పో లో అతి పెద్దవైన పెవిలియన్ లలో ఒక పెవిలియన్ ను ఏర్పాటు చేయడం ద్వారా దీని లో భారతదేశం పాలుపంచుకొంటోంది. యుఎఇ తోను, దుబయితోను మన ప్రగాఢ సంబంధాల ను, చరిత్రాత్మక సంబంధాల ను మరింత దృఢం గా నిర్మించుకోవడం లో ఈ ఎక్స్ పో ఒక ప్రముఖ పాత్ర ను తప్పక పోషిస్తుందని నేను భావిస్తున్నాను. యుఎఇ ప్రెసిడెంటు, అబూ ధాబీ పాలకుడు అయిన మాన్య శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ బిన్ అల్ నాహ్ యాన్ కు భారతదేశం ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలను తెలియజేస్తూ, నా ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టనివ్వండి.

 

యుఎఇ ప్రధాని మరియు ఉపాధ్యక్షుడు, అలాగే దుబయి పాలకుడు అయిన మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ కు కూడా నేను హృదయ పూర్వక అభినందనల ను వ్యక్తం చేయదలచుకొన్నాను. నా సోదరుడు, అబూ ధాబీ క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు కూడా నేను శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. మన వ్యూహాత్మక భాగస్వామ్యం లో మనం సాధించిన పురోగతి లో ఆయన తన వంతు పాత్ర ను పోషించారు. మన రెండు దేశాల ప్రగతి కోసం, సమృద్ధి కోసం, మన కృషి ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను.

 

మిత్రులారా,

 

‘కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్’ అనేది ఎక్స్ పో 2020 తాలూకు ప్రధాన ఇతివృత్తం గా ఉంది. ఒక న్యూ ఇండియాను ఆవిష్కరించడం కోసం మనం ముందుకు పోవడానికి చేస్తున్న కృషిలో సైతం ఇదే విషయం ప్రేరణ గా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఎక్స్ పో 2020 ని అద్భుత రీతి లో నిర్వహిస్తున్నందుకు యుఎఇ ప్రభుత్వాన్ని సైతం నేను అభినందించ దలచుకొన్నాను. ఈ ఎక్స్ పో వంద సంవత్సరాల లో ఒకసారి దాపురించేటటువంటి ఒక విశ్వమారి కి వ్యతిరేకం గా మానవ జాతి చాటుతున్న దృఢత్వాని కి ఒక ప్రమాణం గా ఉంది.

 

మిత్రులారా,

 

బాహాటత్వం, అవకాశం మరియు వృద్ధి అనేది భారతదేశం యొక్క పెవిలియన్ ప్రధాన విషయం గా ఉన్నది. వర్తమాన కాలపు భారతదేశం ప్రపంచం లో కెల్లా అత్యంత బాహాటమైన దేశాల లో ఒకటి గా ఉంది. నేర్చుకోవడానికి, నూతన ఆవిష్కరణ లకు, పెట్టుబడి కి భారతదేశం తలుపుల ను తెరచి ఉంచింది. మరి ఈకారణం గా ఇక్కడ కు విచ్చేసి, మా దేశం లో పెట్టుబడుల ను పెట్టవలసింది గా మిమ్ముల ను నేను ఆహ్వానిస్తున్నాను. ప్రస్తుతం భారతదేశం అవకాశాల కు నిలయం గా ఉంది. అది కళలు లేదా వాణిజ్యం కావచ్చు, పరిశ్రమ లేదా విద్య కావచ్చు, ఆయా రంగాల లో భాగస్వామి కావడాని కి, పురోగమించడానికి అవకాశాలు ఉన్నాయి. భారతదేశాని కి తరలి వచ్చి ఈ అవకాశాల ను వెతకండి. మీకు గరిష్ట వృద్ధి ని కూడా ఇవ్వడాని కి భారతదేశం తయారు గా ఉంది. భారతదేశం లో పరిమాణం పరం గా, ఆకాంక్ష పరం గా, ఫలితాల పరం గా వృద్ధి ఉంటుంది. భారతదేశాని కి విచ్చేసి, మా వృద్ధి గాథ లో ఒక భాగం గా అవ్వండి.

 

మిత్రులారా,

 

భారతదేశం తన చైతన్యాని కి, వైవిధ్యానికి పేరు తెచ్చుకొంది. మా దేశం లో విభిన్న సంస్కృతులు, భాషలు, వంటకాలు, కళారూపాలు, సంగీతం, ఇంకా నృత్యం విలసిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాని కి మా పెవిలియన్ అద్దం పడుతున్నది. ఇదే విధం గా భారతదేశం ప్రతిభ కు ఒక పెట్టని కోట గా ఉంది. సాంకేతిక విజ్ఞానం, పరిశోధన, నూతన ఆవిష్కరణ ల జగతి లో మా దేశం అనేకమైనటువంటి ముందడుగుల ను వేస్తున్నది. చాలా కాలం గా కొనసాగుతూ ఉన్న పరిశ్రమలు, స్టార్ట్- అప్ స్ జోడీ మా ఆర్థిక వృద్ధి కి జోరు ను ప్రసాదిస్తున్నది. ఈ బహుళ రంగాల లో భారతదేశం అంతటా ఉన్న ఉత్తమమైన వస్తువుల ను ఇండియా పెవిలియన్ లో చూడవచ్చును. అంతేకాకుండా, ఆరోగ్యం, వస్త్రాలు, మౌలిక సదుపాయాల కల్పన, సేవలు, ఇంకా ఇతర పలు రంగాల లో పెట్టుబడి కి ఉన్న అవకాశాల ను కూడా ఈ పెవిలియన్ కళ్ళ కు కడుతున్నది. గడచిన ఏడు సంవత్సరాలకు పైగా కాలం లో ఆర్థిక వృద్ధి ని ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం అనేకమైన సంస్కరణ లను చేపట్టింది. ఇదే వైఖరి ని మరింత గా ముందుకు తీసుకు పోవడం కోసం మేం కృషి చేస్తూనే ఉంటాం.

 

మిత్రులారా,

 

 భారతదేశం  ‘అమృత్మహోత్సవ్రూపం లో తన స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల వేడుక ను జరుపుకొంటూ ఉన్న వేళ లో, ఇండియా పెవిలియన్ ను సందర్శించవలసింది గా ప్రతి ఒక్కరి ని మేం ఆహ్వానిస్తున్నాం. మరి పునరుత్థానం పొందుతున్న న్యూ ఇండియాలో అవకాశాల ను సద్వినియోగ పరచుకోండి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్స్ఫూర్తి తో ప్రపంచాన్ని జీవించడాని కి ఎంతో మేలైన స్థలంగా మనం తీర్చిదిద్దుదాం.

 

మీకు ధన్యవాదాలు.

 

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

*********

DS