ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎక్సిమ్ బ్యాంకు) యొక్క రీ కేపిటలైజేశన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
• ఎక్సిమ్ బ్యాంకు లో 6,000 కోట్ల రూపాయల మూలధనాన్ని చొప్పించేందుకు భారత ప్రభుత్వం రీ కేపిటలైజేశన్ బాండ్ల ను జారీ చేస్తుంది.
• 2018-19 ఆర్థిక సంవత్సరం లో 4,500 కోట్ల రూపాయలు, 2019-20 ఆర్థిక సంవత్సరం లో 1,500 కోట్ల రూపాయల ను రెండు విడతలు గా అందజేయనున్నారు.
• ఎక్సిమ్ బ్యాంకు అధీకృత మూలధనాన్ని 10,000 కోట్ల రూపాయల నుండి 20,000 కోట్ల రూపాయల కు పెంచేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీ కేపిటలైజేశన్ బాండ్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల కు జారీ చేసిన తరహా లో ఉంటాయి.
ప్రభావం:
• ఎక్సిమ్ బ్యాంకు భారతదేశం లో ప్రధానమైనటువంటి ఎగుమతి పరపతి ఏజెన్సీ గా ఉంది.
• ఎక్సిమ్ బ్యాంకు లోకి మూలధనాన్ని చొప్పించడం వల్ల బ్యాంకు యొక్క మూలధన సామర్ధ్యం పెరిగేందుకు వీలవుతుంది; బ్యాంకు అధిక సామర్ధ్యం తో భారతదేశ ఎగుమతుల కు అండదండల ను సమకూర్చ గలుగుతుంది కూడాను.
• అదనపు నిధుల ప్రవాహం భారతదేశ వస్త్ర పరిశ్రమల కు మద్దతు, కన్సెశనల్ ఫైనాన్స్ స్కీమ్ (సిఎఫ్ఎస్) లో ఏవైనా మార్పులు, భారతదేశ క్రియాశీల విదేశీ వ్యవహారాల ను దృష్టి లో పెట్టుకొని భవిష్యత్తు లో నూతన ఎల్ఒసి లను కుదుర్చుకోవటం వంటి నూతన చొరవల అవకాశాల కు ప్రోత్సాహకారి కాగలదని భావించవచ్చును.
పూర్వరంగం:
ఎక్సిమ్ బ్యాంకు ను 1982 వ సంవత్సరం లో పార్లమెంటు ద్వారా ఒక చట్టాన్ని తెచ్చి ఏర్పాటు చేయడమైంది. భారతదేశ అంతర్జాతీయ వ్యాపారానికి ఆర్థిక సహాయాన్ని అందజేయటం, భారతదేశ అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించటం తో పాటు, భారతదేశ అంతర్జాతీయ వ్యాపారానికి మార్గాన్ని సుగమం చేసేటటువంటి అత్యున్నత స్థాయి ఆర్థిక సంస్థ గా ఎక్సిమ్ బ్యాంకు ను స్థాపించడమైంది. ఈ బ్యాంకు ప్రధానం గా భారతదేశం నుండి ఎగుమతులు చేసేందుకు రుణాల ను అందిస్తూ ఉంటుంది. అలాగే విదేశాలకు చెందిన కొనుగోలుదారుల కు మరియు భారతదేశానికి చెందిన సరఫరాదారు సంస్థ లకు భారతదేశం నుండి సామగ్రి, వస్తువులు, ఇంకా సేవల ను ఎగుమతి చేసే సంస్థ లకు మద్దతును అందిస్తోంది. ఇది ఆర్‌బిఐ నియంత్రణ లో ఉంది.
**