Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఐఐఎమ్ఎస్నాగ్ పుర్ ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

ఎఐఐఎమ్ఎస్నాగ్ పుర్ ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి


ఎఐఐఎమ్ఎస్ నాగ్ పుర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు. నాగ్ పుర్ ఎఐఐఎమ్ఎస్ ప్రాజెక్టు నమూనా ను ప్రధాన మంత్రి కలియదిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసినటువంటి మైలురాళ్ల కు సంబంధించిన ఒక ప్రదర్శన గేలరీ ని కూడా ఆయన చూశారు.

దేశం అంతటా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను సుదృఢం చేయాలి అనే ప్రధాన మంత్రి యొక్క వచనబద్ధత ఎఐఐఎమ్ఎస్ నాగ్ పుర్ ను దేశ ప్రజల కు అంకితం చేయడం ద్వారా మరింత గా సశక్తం కానున్నది. ఈ ఆసుపత్రి కి ప్రధాన మంత్రే 2017 జులై లో శంకుస్థాపన చేయగా, ఈ ఆసుపత్రి ని ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అనే కేంద్రీయ రంగ పథకం లో భాగం గా ఏర్పాటు చేయడమైంది.

మొత్తం 1575 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరుస్తున్నటువంటి ఎఐఐఎమ్ఎస్ నాగ్ పుర్ అత్యాధునిక సదుపాయాలు కలిగినటువంటి ఒక ఆసుపత్రి. దీనిలో ఒపిడి, ఐపిడి, రోగ నిర్ణయకారి సేవ లు, ఆపరేశన్ థియేటర్ లతో పాటు గా చికిత్స విజ్ఞానం తాలూకు అన్ని ప్రముఖ స్పెశియలిటీ మరియు సూపర్ స్పెశియలిటి విషయాలను కవర్ చేయడం జరిగింది. ఈ ఆసుపత్రి మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతాని కి ఆరోగ్యం పరం గా ఆధునిక సౌకర్యాల ను అందిస్తుంది. దీనితో పాటు గా గఢ్ చిరౌలి, గోందియా, ఇంకా మేల ఘాట్ చుట్టుపక్కల గల ఆదివాసీ ప్రాంతాల కు ఒక వరదానం గా కూడా ను ఈ ఆసుపత్రి భాసిల్లుతుంది అని చెప్పాలి.

ప్రధాన మంత్రి వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే, మహారాష్ట్ర గవర్నరు శ్రీ భగత్ సింహ్ కోశ్యారీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు రహదారి రవాణా, ఇంకా రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ లు ఉన్నారు.

 

 

**