Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఋషి శ్రీ తిరువళ్ళువ‌ర్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


తిరువళ్ళువ‌ర్ దినం సందర్భం లో ఋషి శ్రీ తిరువళ్ళువర్ కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తన సందేశాన్ని నమోదు చేశారు:

‘‘ఈ రోజు న మనం తిరువళ్ళువర్ దినం జరుపుకొంటున్నాం, ‘తిరుక్కురళ్’ లో ఆ తమిళ మహర్షి గ్రంథస్తం చేసిన విస్తారమైనటువంటి జ్ఞానం జీవనం లోని అనేక విషయాల లో మనలకు దారి ని చూపిస్తూ వస్తున్నది. అన్ని కాలాల్లో వర్తించేటటువంటి ఆయన యొక్క ప్రబోధాలు సద్గుణాల పట్ల మరియు చిత్తశుద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవలసిందంటూను, సద్భావనతోను, సదవగాహన తోను కూడిన ప్రపంచాన్ని పెంచి పోషించాలంటూ ను సమాజాని కి ప్రేరణ ను ఇస్తున్నాయి. ఆయన ఆచరణ లో చూపిన సర్వసామాన్య విలువల కు పట్టం కట్టడం ద్వారా ఆయన యొక్క దృష్టికోణాన్ని సాకారం చేయాలన్న మన నిబద్ధత ను కూడా ఈ సందర్భం లో పునరుద్ఘాటించుకొందాం.’’

********

DS/ST