Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉస్తాద్ శ్రీ రాశిద్ ఖాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


భారతదేశం యొక్క శాస్త్రీయ సంగీత జగతి లో ఓ ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఉస్తాద్ శ్రీ రాశిద్ ఖాన్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తన సందేశాన్ని ఈ క్రింది విధం గా ఎక్స్ మాధ్యం లో పొందుపరచారు :

‘‘భారతదేశాని కి చెందిన శాస్త్రీయ సంగీత జగతి లో ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఉస్తాద్ రాశిద్ ఖాన్ జీ యొక్క మృతి తో బాధ పడ్డాను. ఆయన యొక్క సాటిలేనటువంటి ప్రతిభ మరియు సంగీతం పట్ల ఆయన కు గల సమర్పణ భావం మన సాంస్కృతిక లోకాన్ని సుసంపన్నం చేయడం తో పాటు గా, అనేక తరాల వారి లో ప్రేరణ ను కలిగించాయి. ఆయన నిష్క్రమణ తో ఏర్పడ్డ శూన్యాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. ఆయన కుటుంబాని కి, ఆయన శిష్యుల కు మరియు ఆయన కు ఉన్న అసంఖ్య అభిమాన వర్గాని కి ఇదే నా హృదయపూర్వక సంతాపం.’’