ఉప రాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ కి ఈ రోజు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా రాజ్య సభ సభ్యులతో పాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాలు పంచుకొన్నారు. 100 సంవత్సరాలకు పైగా ప్రజా జీవనంలో గడిపినటువంటి ప్రసిద్ధమైన చరిత్ర శ్రీ అన్సారీ కుటుంబానికి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఉప రాష్ట్రపతి వృత్తి పరమైన దౌత్య నిపుణుడుగా సేవలను అందించారని, అనేక సందర్భాలలో దౌత్య పరమైన అంశాలపై ఉప రాష్ట్రపతి యొక్క అంతర్ దృష్టి నుండి తాను లబ్ధిని పొందానని ప్రధాన మంత్రి చెప్పారు.
శ్రీ హమీద్ అన్సారీ కి ప్రధాన మంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు.