ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు కు రాజ్య సభ లో ఈ రోజు న ఇచ్చిన వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. ఎగువ సభ కు ఎక్స్- అఫిశియో చైర్ మన్ గా ఉన్న ఉప రాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ఘనమైన నమస్సుల ను అర్పించారు.
శ్రీ వెంకయ్య నాయుడు యొక్క జ్ఞానం మరియు వాక్చాతుర్యం కలగలసినటువంటి అనేక సందర్భాల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ‘న్యూ ఇండియా’ లో నాయకత్వం యొక్క వన్నె లో వచ్చినటువంటి మార్పు ను గురించి ప్రధాన మంత్రి ప్రకటిస్తూ, ‘‘ఎప్పుడైతే మనం ఈ సంవత్సరం లో ఆగస్టు 15వ తేదీ ని అనభవం లోకి తెచ్చుకొంటామో, అది ఎటువంటి స్వాతంత్య్ర దినం అవుతుంది అంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ మరియు ప్రధాన మంత్రి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాతి కాలం లో జన్మించిన వారే అయి ఉంటారు. అదీనూ, వారి లో ప్రతి ఒక్కరు చాలా సీదా సాదా పూర్వ రంగాల కు చెందిన వారే అయి ఉంటారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి ఒక గొప్ప సంకేతాత్మకమైనటువంటి విలువ ఉంది; మరి ఇది ఒక కొత్త యుగాని కి అద్దం పడుతుంది అని కూడాను అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉప రాష్ట్రపతి సార్వజనిక జీవనం లో తాను చేపట్టిన అన్ని భూమికలలోనూ అదే పని గా దేశ యువత కు ప్రోత్సాహాన్ని అందిస్తూ రావడాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ఆయన సభ లో కూడా ఎప్పుడూ యువ సభ్యుల ను ప్రోత్సహించారన్నారు. ‘‘మన ఉప రాష్ట్రపతి గా మీరు ఉంటూ యువజన సంక్షేమాని కి చాలా కాలాన్ని సమర్పణం చేశారు. మీ కార్యక్రమాల లో చాలా వరకు కార్యక్రమాలు యువ శక్తి పైన కేంద్రీకృతం అయినటువంటివే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సభ వెలుపల ఉప రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగాల లో 25 శాతం ప్రసంగాలు భారతదేశ యువతీ యువకుల సమక్షం లో ఇచ్చినవే అని ప్రధాన మంత్రి అన్నారు.
శ్రీ వెంకయ్య నాయుడు తో వివిధ హోదాల లో తనకు ఉన్నటువంటి సన్నిహితమైన అనుబంధాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పార్టీ కార్యకర్త గా సైద్ధాంతిక నిబద్ధత, శాసన సభ్యుని గా ఆయన చేసిన కార్యాలు, పార్లమెంటు సభ్యుని గా చేపట్టిన కార్యకలాపాల స్థాయి; బిజెపి అధ్యక్షుని గా ప్రదర్శించినటువంటి సంస్థాగతమైన నైపుణ్యాలు; మంత్రి గా ఆయన చేసిన కఠోర శ్రమ మరియు కార్యదక్షత; అంతేకాక ఉప రాష్ట్రపతి గా మరియు సభాధ్యక్షుని గా ఆయన చూపిన అంకిత భావం, ఇంకా హుందాతనం లను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘నేను శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి తో సంవత్సరాల తరబడి సన్నిహితం గా పని చేశాను. ఆయన వేరు వేరు బాధ్యతల ను చేపట్టడాన్ని కూడా నేను గమనించాను. మరి వాటి లో ప్రతి ఒక్క బాధ్యత ను ఆయన గొప్ప సమర్పణ భావం తో నిర్వర్తించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సార్వజనిక జీవనం లో భాగం అయిన వారు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు వద్ద నుంచి ఎంతో నేర్చుకోవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు.
ఉప రాష్ట్రపతి యొక్క వాగ్ధార ను మరియు ఉప రాష్ట్రపతి యొక్క వాక్చాతుర్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ‘‘మీరు ఆడిన ప్రతి మాట ను ఆలకించడం, అభిమానించడం, ఇంకా ఆదరించడం జరిగేది.. అంతే తప్ప మారుమాట అనడం అనేది ఎన్నడూ జరుగలేదు’’ అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ఇంకా ఇలా అన్నారు.. ‘‘శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి వన్ లైనర్ స్ ఎంతో ప్రసిద్ధం అయ్యాయి. అవి చమత్కారం నిండి ఉండేవి. భాష లపై ఆయన కు ఉన్న పట్టు ఎల్లప్పటికీ ఎంతో గొప్పదిగా ఉండింది.’’ సభ లోపల, సభ వెలుపల ఉప రాష్ట్రపతి యొక్క బ్రహ్మాండమైన అభిప్రాయ వ్యక్తీకరణ ప్రావీణ్యాలు గొప్పవైన ప్రభావాన్ని ప్రసరింపచేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శ్రీ వెంకయ్య నాయుడు జీ చెప్పే దానిలో అటు విషయం, ఇటు గాఢత.. రెండూ ఉంటాయి, అది ఎంత సూటి గా ఉండేదో అంతే సాటి లేనిది గా కూడా ఉండేది; ఆ మాటల లో చతురత, విలువ.. రెండూ ఉండేవి; మీరు మాట్లాడే మాటల లో ఆత్మీయత తో పాటుగా జ్ఞానం కూడా నిండి ఉండేది’’ అని ఆయన అన్నారు.
దక్షిణ భారతదేశం లో శ్రీ ఎం. వెంకయ్య నాయుడు తన రాజకీయ కరియర్ ను ఎంతో అణకువ తో మొదలు పెట్టారు అని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆయన ఎంచుకొన్న సిద్ధాంతాల కు అప్పట్లో అక్కడ వెనువెంటనే ఎలాంటి అవకాశాలు కానరాలేదు అన్నారు. ఒక రాజకీయ కార్యకర్త స్థానం నుంచి ఆయన ఎంచుకొన్నటువంటి పార్టీ లో అధ్యక్ష స్థానం దాకా ఉప రాష్ట్రపతి సాగించిన యాత్ర సిద్ధాంతం మరియు దృఢత్వం ల పరం గా చూసినప్పుడు ఆయన లోని అజేయమైన ముక్కుసూటితనాన్ని ప్రతిబింబించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశం కోసం మనలో ఏవైనా భావాలు ఉన్నాయంటే గనుక, మన ఆలోచనల ను వెల్లడించే ఒక కళ, మరి భాషా పరమైన వైవిధ్యం పట్ల విశ్వాసం ఉన్నాయి అంటే అప్పుడు మనకు భాష, ప్రాంతం అనేవి ఎన్నటికి అడ్డంకులు గా మారజాలవు. మరి ఈ విషయాన్ని మీరు రుజువు చేశారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఉప రాష్ట్రపతి కి మాతృభాష అంటే ఉన్న ప్రేమ ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ‘‘వెంకయ్య గారి విషయం లో మెచ్చుకోదగిన అంశాల లో ఒకటి ఏమిటి అంటే అది భారతదేశ భాష లు అంటే ఆయన కు ఉన్న మక్కువ అని చెప్పాలి. సభ కు ఆయన ఏ విధం గా అధ్యక్షత వహించారో అనే అంశం లో అది ప్రతిబింబించింది. ఆయన రాజ్య సభ యొక్క పనితీరు వృద్ధి చెందేటట్లు చేయడానికి తోడ్పడ్డారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఉప రాష్ట్రపతి స్థాపించిన వ్యవస్థ లు, ఆయన యొక్క నాయకత్వం సభ పనితీరు ను సరికొత్త శిఖరాని కి చేర్చాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఉప రాష్ట్రపతి యొక్క నాయకత్వం కాలం లో, సభ సాధించినటువంటి ఫలితాలు 70 శాతం మేర కు పెరిగాయి, సభ్యుల హాజరు శాతం వృద్ధి చెందింది, రెకార్డు స్థాయి లో 177 బిల్లు లు అయితే ఆమోదం పొందడమో లేదా చర్చించడమో జరిగింది. ‘‘ఎగువ సభ ఊర్ద్వ ముఖ ప్రస్థానాన్ని గుర్తుపెట్టుకొనేటటువంటి అనేకమైన నిర్ణయాల ను మీరు తీసుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
సభ ను ఉప రాష్ట్రపతి చాకచక్యం గా, వివేకవంతం గా మరియు దృఢం గా నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి కొనియాడడం తో పాటు గా ఒక స్థాయి ని మీరి సభ కు అంతరాయాన్ని కలిగించడం అనేది సభా ధిక్కారం గా మారుతుంది అనేటటువంటి స్థిరమైన నమ్మకాన్ని కలిగివున్నందుకు కూడాను ఆయన ను ప్రశంసించారు. ‘‘మీరు ఏర్పరచిన ప్రమాణాల లో ప్రజాస్వామ్యం తాలూకు పరిపక్వత ను నేను గమనించాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కష్టమైన సందర్భాల లో సైతం సభ కార్యకలాపాల ను కొనసాగించడం లో ఆయన యొక్క సమన్వయాన్ని, సర్దుబాటు ను, అవతలి పక్షం తో సంభాషించే నేర్పు ను ప్రధాన మంత్రి అభినందించారు. ‘ప్రభుత్వాన్ని ప్రతిపాదించనివ్వండి, ప్రతిపక్షాన్ని వ్యతిరేకించనివ్వండి, అటు తరువాత సభ ను ముగియనివ్వండి’ అనే దృష్టికోణం శ్రీ వెంకయ్య నాయుడు ది అంటూ ప్రధాన మంత్రి ప్రశంస లు కురిపించారు. అన్య సభ నుంచి అందినటువంటి ప్రతిపాదనల ను ఆమోదించడానికి గాని, లేదా తిరస్కరించడానికి గాని, లేదా సవరించడానికి గాని ఈ సభ కు హక్కు ఉంది, అయితే మన ప్రజాస్వామ్యం అవతలి సభ నుంచి అందినటువంటి ప్రతిపాదనల ను నిలువరించే ప్రతిపాదన ను ఊహించ లేదు అని ఆయన అన్నారు.
దేశాని కి మరియు సభ కు అందించిన తోడ్పాటుల కు మరియు మార్గదర్శనాని కి గాను ఉప రాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
When we mark 15th August this year, it be an Independence Day when the President, VP, Speaker and PM would have been born after Independence. And that too, each of them belongs to very simple backgrounds: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) August 8, 2022
As our Vice President, you devoted a lot of time to youth welfare. A lot of your programmes were focused on Yuva Shakti: PM @narendramodi on @VPSecretariat Shri @MVenkaiahNaidu
— PMO India (@PMOIndia) August 8, 2022
I have worked with @MVenkaiahNaidu Ji closely over the years. I have also seen him take up different responsibilities and he performed each of them with great dedication: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) August 8, 2022
The one liners of @MVenkaiahNaidu Ji are famous. They are wit liners. His command over the languages has always been great: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) August 8, 2022
There is both depth and substance in what @MVenkaiahNaidu Ji says: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) August 8, 2022
One of the admirable things about @MVenkaiahNaidu Ji is his passion towards Indian languages. This was reflected in how he presided over the House. He contributed to increased productivity of the Rajya Sabha: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) August 8, 2022