Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపాధ్యాయ దినోత్స‌వ సంద‌ర్భంగా పాఠశాల విద్యార్థుల‌తో ప్ర‌ధాని సంభాష‌ణ‌

ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల‌తో సంభాషించారు. ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా చిన్నారులే నిర్వ‌హించారు. భార‌తదేశ ద్వితీయ రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ సర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ రెండు నాణేల‌ను విడుద‌ల చేశారు. అందులో ఒక‌టి 125 రూపాయ‌ల నాణేమైతే మ‌రొక‌టి 10 రూపాయ‌ల నాణెం. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని క‌ళా ఉత్స‌వ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన ఈ వెబ్‌సైట్ చిన్నారుల్లోని క‌ళా ప్ర‌తిభను లోకానికి చాటుతుంది. వారిలోని టాలెంట్‌ను వెలికి తీస్తుంది.

ఉపాధ్యాయ దినోత్స‌వ సంద‌ర్భంగా స్కూలు విద్యార్థుల‌తో తాను సంభాషించ‌డం వెన‌క ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌ముంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ అన్నారు. విద్యార్థులు సాధించిన విజ‌యాల‌తో గురువుల‌కు పేరు వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. బిడ్డ‌కు జ‌న్మినిచ్చేది అమ్మే అయిన‌ప్ప‌టికీ ఆ బిడ్డ‌కు జీవితాన్నిచ్చేది ఉపాధ్యాయుడేన‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

ఉపాధ్యాయుడు, విద్యార్థి…ఈ ఇద్ద‌రు ఒక‌రికొక‌రు ప్ర‌త్యేక‌మైన‌ ప్రాధాన్య‌త‌గ‌ల‌వారేన‌ని చెప్పిన ప్ర‌ధాని ఉపాధ్యాయులు త‌మ విద్యార్థుల‌తో త‌మ‌కుగ‌ల అనుభ‌వాల గురించి ఇత‌రుల‌కు తెలిసేలా వ్యాసాలు రాయాల‌ని సూచించారు. ఉపాధ్యాయుల‌కు త‌మ‌ త‌ర‌గ‌తిలోని ప్ర‌తి విద్యార్థి ముఖ్య‌మే. త‌ర‌గ‌తిలో బాగా చ‌దివే విద్యార్థుల‌ను మాత్ర‌మే కాదు, ఇత‌ర విద్యార్థులంద‌రినీ ఉపాధ్యాయులు గుర్తు పెట్టుకోవాలని ప్ర‌ధాని కోరారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ ఎపిజె అబ్దుల్ క‌లాంను గుర్తు చేసుకున్నారు. త‌న‌ను ఉపాధ్యాయునిగా అంద‌రూ గుర్తు చేసుకోవాలంటూ డాక్ట‌ర్ అబ్దుల్ క‌లాం గ‌తంలో వ్య‌క్తం చేసిన కోరిక‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌స్తావించారు.

ఇంజినీర్ల‌ను, వైద్యుల‌ను, శాస్త్ర‌వేత్త‌ల‌నెంతోమందిని ప్ర‌పంచం గ‌ర్వించేలా అందిస్తున్న ఉపాధ్యాయులెంత‌మందో ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉన్నార‌ని ప్ర‌ధాని అన్నారు. రోబోల్లాంటి విద్యార్థుల‌ను త‌యారు చేయ‌డం ఉపాధ్యాయుల ల‌క్ష్యం కాద‌ని…ఒక త‌రాన్ని తీర్చి దిద్దే బాధ్య‌త వారిపై ఉంద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమ‌తి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర స‌హాయ మంత్రులు శ్రీ ఉపేంద్ర కుస్వాహా, శ్రీ రామ్ శంక‌ర్‌ క‌థేరియా, శ్రీ జ‌యంత్ సిన్హా పాల్గొన్నారు.