Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపాధ్యాయ దినోత్స‌వం నాడు ఉపాధ్యాయ సముదాయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


 

ఉపాధ్యాయ దినోత్స‌వం సందర్భంగా ఉపాధ్యాయ సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి నివాళులను అర్పించారు.

‘‘ఉపాధ్యాయ దినోత్స‌వం ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ సముదాయానికి ఇవే శుభాకాంక్షలు. యువ మస్తిష్కాలను తీర్చిదిద్దడం లోను, మన దేశ నిర్మాణం లోను ఉపాధ్యాయులు ఒక కీలక పాత్ర ను పోషిస్తున్నారు.

మన పూర్వ రాష్ట్రపతి, స్వయంగా ఒక ప్రముఖ ఉపాధ్యాయుడైన కీర్తి శేషులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయనకు మనం ప్రణమిల్లుదాం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.