Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపాధ్యాయ దినం సంద‌ర్భంగా ఉపాధ్యాయుల స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి వంద‌నాలు; పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


ఉపాధ్యాయ దినం సంద‌ర్భంగా ఉపాధ్యాయుల స‌ముదాయానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్క‌రించారు. పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు కూడా ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.

‘‘ఉపాధ్యాయ దినం నాడు నేను స‌మాజంలో విద్యా కుసుమాల‌ను, బాలల మేధస్సును విక‌సింప‌జేయ‌డానికి అంకిత భావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయ లోకానికి వంద‌నమాచరిస్తున్నాను.

అసాధార‌ణ‌మైన ఉపాధ్యాయుడు మ‌రియు రాజ‌నీతిజ్ఞుడైన డాక్ట‌ర్ ఎస్‌. రాధాకృష్ణ‌న్ కు ఇవే నా నివాళులు.

అత్యంత సునిశిత‌మైన ప‌రిశోధ‌న‌లు మ‌రియు న‌వ క‌ల్ప‌న‌ల పునాదుల పైన ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించాల‌న్న మ‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డంలో ముఖ్య పాత్ర‌ ఉపాధ్యాయుల‌దే.

‘నాయ‌క‌త్వం వ‌హించ‌డం ఎలాగ‌న్న‌ది నేర్చుకోవ‌డం’, ‘సాధికారితను సాధించ‌డం కోసం చ‌దువుకోవ‌డం’, ‘ప‌రివ‌ర్త‌న దిశ‌గా ఎలా పయనించాలన్న పాఠాలు బోధించడం’ కోసం మనం త‌దుప‌రి 5 సంవ‌త్స‌రాల‌ను వెచ్చిద్దాము’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.