Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపాధ్యాయ దినం సందర్భంగా ఉపాధ్యాయులందరి సమర్పణ భావం, వచనబద్ధత లకు ప్రధాన మంత్రి అభివాదన; డాక్టర్ ఎస్. రాధాకృష్ణ న్ కు ఆయన శ్రద్ధాంజలి అర్పించారు కూడా..


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులందరి సమర్పణ భావం, వచనబద్ధత లకు ప్రణామాలు అర్పించారు. అంతే కాకుండా, భారతదేశ పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణ న్ కు ఆయన శ్రద్ధాంజలి అర్పించారు కూడా. డాక్టర్ ఎస్. రాధాకృష్ణ న్ జయంతి ని భారతదేశమంతటా ఉపాధ్యాయ దినంగా జరుపుకొంటారు.

“ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు. ఉపాధ్యాయులందరి సమర్పణ భావం, వచనబద్ధత లకు భారతదేశం ప్రణామాలు అర్పిస్తోంది. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర సర్వోన్నతమైంది.

పండితుడు, రాజనీతికుశలుడు, గౌరవనీయ ఉపాధ్యాయుడు అయిన డాక్టర్ ఎస్. రాధాకృష్ణ న్ ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగులు దిద్దారు; భారతదేశానికి సేవలు అందించారు కూడాను.. ఆయనకు ఇదే నా శ్రద్ధాంజలి.

మీ ఉపాధ్యాయులు మీపైన ఎటువంటి ప్రభావాన్ని చూపించారు ? అనే విషయంలో మీ అనుభూతులను పంచుకోండి – ఎందరో వారి ఉపాధ్యాయులను గురించి ఏమని రాశారనేది కూడా చదవండి ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.