Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపరాష్ట్రపతి కి మంచి ఆరోగ్యంతోపాటు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి


ఉపరాష్ట్రపతికి మంచి ఆరోగ్యం కలగాలని, ఆయన త్వరితగతిన కోలుకోవాలన్న ఆకాంక్షను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యక్తం చేశారు. ‘‘ఎయిమ్స్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ జీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నాను. ఆయన చక్కని ఆరోగ్యంతోపాటు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు. 

 
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఎయిమ్స్‌కు వెళ్లి, ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ జీ ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నాను. ఆయన మంచి ఆరోగ్యంతోపాటు, ఆయన త్వరగా కోలుకోవాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను.’’

@VPIndia