నమస్తే. మంత్రిమండలి లో నా సహచరులైన శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ నిశంక్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, జాతీయ విద్య విధానం రూపకల్పన లో కీలక పాత్ర ను పోషించినటువంటి భారతదేశ ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరిరంగన్ మరియు ఆయన బృందం సభ్యులు, ఈ సమ్మేళనం లో పాలుపంచుకొంటున్నటువంటి ఉప కులపతులు, ఇతర విద్యావేత్తలు అందరు, ఇంకా మహానుభావులు అందరికి అనేకానేక అభినందన లు.
జాతీయ విద్య విధానం యొక్క సందర్భం లో ఈ నాటి ఈ యొక్క కార్యక్రమం చాలా మహత్వపూర్ణమైనటువంటిది గా ఉన్నది. దీని ద్వారా జాతీయ విద్య విధానం లోని వివిధ అంశాల ను గురించి దేశం లోని విద్య రంగాని కి వివరణాత్మక సమాచారం లభిస్తుంది. జాతీయ విద్య విధానం లోని ప్రధాన అంశాలన్నిటి గురించి వివరంగా చర్చిస్తే దానిని అమలు చేయడం సులువవుతుంది.
మిత్రులారా, గత మూడు నాలుగు సంవత్సరాలు గా లక్షల మంది ప్రజలు సమగ్రమైన చర్చలు చేసిన తరువాత, సూచనలు సలహాలు ఇచ్చిన తరువాత జాతీయ విద్య విధానాని కి ఆమోదం తెలపడం జరిగింది. దీని ని గురించి ఇప్పుడు దేశవ్యాప్తం గా వివరం గా చర్చ లు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల కు చెందిన ప్రజలు, పలు సిద్ధాంతాల కు చెందిన ప్రజలు ఈ జాతీయ విద్య విధానాన్ని సమీక్షిస్తున్నారు. వారి అభిప్రాయాల ను తెలియజేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన చర్చ. ఈ చర్చ ల ద్వారా దేశం లోని విద్య వ్యవస్థ చక్క గా లబ్ధి ని పొందగలుగుతుంది. ఒక సంతోషకరమైన అంశం ఏమిటంటే ఏ ప్రాంతాని కి చెందిన వారు కూడా దీనిని వివక్షపూరితంగా ఉంది అని అనలేదు. దశాబ్దాల తరబడి కొనసాగిన పాత విద్య వ్యవస్థ లో ఎటువంటి మార్పు లు రావాలని ప్రజలు కోరుకుంటూ వచ్చారో, వారు కోరుకుంటున్న మార్పు లు జాతీయ విద్య విధానం లో వస్తున్నాయనడానికి ఇది ఒక సూచిక.
విద్య రంగం లో తీసుకువస్తున్న ఈ యొక్క భారీ సంస్కరణల ను ఎలా అమలు చేస్తారని కొంత మంది ప్రశ్నించడం సహజమే. ఈ జాతీయ విద్య విధానం అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సవాలు ను దృష్టి లో పెట్టుకొని అవసరమైన చోట మెరుగు లు దిద్దుకుంటూ దీని ని మనం అందరం కలసి అమలు చేయవలసివుంది. జాతీయ విద్య విధానం అమలు లో మీరంతా ప్రత్యక్షం గా భాగస్వాములై ఉన్నారు. కాబట్టి మీరు ప్రధానమైన పాత్ర ను పోషించాల్సి ఉంది. ఇక రాజకీయ చిత్తశుద్ధి కి సంబంధించి నేను పూర్తి స్థాయి లో నిబద్దత కలిగివున్నాను. నా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.
మిత్రులారా, ప్రతి దేశం తన జాతీయ విలువల కు, జాతీయ లక్ష్యాల కు అనుగుణం గా తన విద్య వ్యవస్థ లో సంస్కరణల ను అమలుపరుస్తుంది. దేశం లోని విద్య వ్యవస్థ వర్తమాన తరానికే కాదు భవిష్యత్ తరాల కు కూడాను మంచి భవిష్యత్తు ను అందించాలి అనేది ఈ సంస్కరణల వెనుక ఉన్నటువంటి ఆలోచన. ఇదే ఆలోచన భారతదేశ జాతీయ విద్య విధానం రూపకల్పన వెనుక కూడా ఉంది. ఈ 21వ శతాబ్దపు భారతదేశం లో.. మనం సాధించబోతున్న న్యూ ఇండియా కు జాతీయ విద్య విధానం పునాది ని వేస్తుంది. ఈ 21 వ శతాబ్దం యొక్క భారతదేశపు యువత కు కావలసిన విద్య ను మరియు నైపుణ్యాలను అందించడం పై జాతీయ విద్య విధానం దృష్టి పెట్టింది.
భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశం గా చేయడం పై ఈ విద్య విధానం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశాన్ని నూతన శిఖరాల కు చేర్చడం పైనా, భారతీయ పౌరుల ను సాధికారుల ను చేయడం పైనా, ప్రజల కు వీలైన అన్ని అవకాశాలు లభించేలా చేయడం పైనా ఈ విద్య విధానం ప్రత్యేకం గా శ్రద్ధ ను వహించింది. భారతీయ విద్యార్థులు.. వారు శిశు విద్యాలయం లో ఉండవచ్చు, లేదా కళాశాల లో ఉండవచ్చు.. వారు మారుతున్న పరిస్థితుల కు అనుగుణం గా శాస్త్రీయం గా చదువులు అభ్యసిస్తేనే జాతి నిర్మాణం లో వారు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతారు.
మిత్రులారా, చాలా సంవత్సరాలు గా మన విద్య వ్యవస్థ లో సంస్కరణ లు లేవు. దాంతో విద్యార్థుల లో నేర్చుకోవాలనే కాంక్ష, ఊహాశక్తి కి ప్రోత్సాహం లభించలేదు. ప్రమాదకరమైన పోటీ లో పడిపోయేలా ఇంతకాలం వారి ని ప్రోత్సహించారు. డాక్టర్ కావాలని లేదా ఇంజినీరు కావాలని, లేదా న్యాయవాది కావాలనే స్పర్ధ ఉండేది. విద్యార్థుల ఇష్టం, సామర్థ్యం, డిమాండు లను పట్టించుకోని స్పర్ధాత్మక మనస్తత్వాన్ని మన విద్య వ్యవస్థ నుండి తొలగించవలసిన అవసరం ఏర్పడింది. చదువుల పట్ల బలమైన కాంక్ష, విద్యయొక్క తాత్వికత, విద్య ఉద్దేశ్యం లేకపోతే మన యువత లో విమర్శనాత్మక, వినూత్న ఆలోచన లు ఎలా కలుగుతాయి?
మిత్రులారా, ఈ రోజు గురు రబీంద్రనాథ్ టాగోర్ వర్ధంతి. ఆయన అనేవారు:
‘‘ఉన్నతమైన విద్య అంటే అది సమాచారం ఇచ్చేది మాత్రమే కాదు, మనం మన చుట్టుపక్కల గల సృష్టి తో సామరస్యం తో జీవించేలా చేసేది’’ అని.
తప్పక, జాతీయ విద్య విధానం భవిష్యత్తు లో చేరుకోబోయే లక్ష్యం ఈ పలుకు ల మీద ఆధారపడి రూపొందింది. దీనిని సాధించడానికిగాను సమగ్రమైన విధానం ఉండాలి. అంతే తప్ప ముక్కలు ముక్కలు గా ఉండే విధానం కాదు. ఈ విషయం లో జాతీయ విద్య విధానం విజయం సాధించింది.
మిత్రులారా, జాతీయ విద్య విధానం స్పష్టమైనటువంటి మరియు దృఢమైనటువంటి రూపాన్ని సంతరించుకుంది. దీని అమలు కు సంబంధించి ప్రారంభ దినాల లో ఎదురయ్యే సవాళ్ల గురించి మీతో చర్చించాలని నేను అనుకుంటున్నాను. మన ముందు రెండు ముఖ్యమైన ప్రశ్న లు ఉన్నాయి. మన విద్య విధానం మన యువత లో సృజనాత్మకత ను, తృష్ణ ను నింపి నిబద్దత గల జీవితాన్ని గడిపే స్ఫూర్తి ని ఇవ్వగలదా? మీరు ఈ విద్య రంగం లో చాలా సంవత్సరాలు గా ఉన్నారు. ఈ ప్రశ్న కు సమాధానం మీకు తెలుసు.
మిత్రులారా, ఇక రెండో ప్రశ్న. మన విద్య వ్యవస్థ మన యువత కు సాధికారిత ను కలిగించి సాధికారిక సమాజాన్ని తయారు చేయడానికి సాయపడుతున్నదా? ఈ ప్రశ్నలు మీకు తెలుసు. వీటికి సమాధానాలు కూడా మీరు ఎరుగుదురు.
మిత్రులారా, భారతదేశ విద్య విధానాన్ని రూపొందిస్తున్నప్పుడే ఈ ప్రశ్నల ను పరిగణన లోకి తీసుకోవడం నాకు సంతృప్తి ని ఇస్తోంది.
మిత్రులారా, మారుతున్న పరిస్థితుల పై నూతన దృక్పథం తో నూతన ప్రపంచ విధానం రూపుదాలుస్తోంది. నూతన ప్రపంచ ప్రమాణం కూడా సిద్ధమవుతోంది. కాబట్టి తన విద్య వ్యవస్థ లో మార్పుల ను ప్రవేశపెట్టడం భారతదేశానికి తప్పనిసరి అయింది. పాఠశాల విద్య ప్రణాళిక ను 10+ 2 నిర్మాణం నుండి 5+3+3+4 కు మార్చడం ఈ దిశ గా వేసినటువంటి ఒక అడుగు. మనం మన విద్యార్థుల ను ప్రపంచ పౌరులు గా తీర్చిదిద్దాలి. అదే కాలం లో వారు తమ మూలాల ను మరచిపోకుండా మనం జాగ్రత్తల ను తీసుకోవలసి ఉంది. మూలాల నుండి ప్రపంచ స్థాయి దాకా, మనిషి నుండి మానవాళి దాకా, గతాన్నుండి ఆధునికత వరకు అన్ని అంశాల ను దృష్టి లో పెట్టుకొని జాతీయ విద్య విధాన రూపాన్ని నిర్ణయించడం జరిగింది.
మిత్రులారా, పిల్లలు ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారో అదే భాషలోనే చదువుకుంటే వారు వేగంగా నేర్చుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీలైనంత మేరకు బాలలు ఐదో తరగతి వరకు వారి యొక్క మాతృభాష లోనే చదువుకోవాలనే నిర్ణయానికి ఏకాభిప్రాయం రావడం వెనుక ఇదే కారణం ఉంది. ఇది పిల్లల పునాది ని బలం గా చేయడమే కాదు వారు ఉన్నత విద్యల ను చదువుకొనే కాలం లో ఆ ఉన్నత చదువుల కు అవసరమయ్యే పునాది కూడా బలోపేతం అవుతుంది.
మిత్రులారా, ఇంతకాలమున్న విద్య విధానం ఏమి ఆలోచించాలనే దానిపైన దృష్టి పెట్టి కొనసాగింది. ఇప్పుడు రాబోతున్న నూతన విద్యా విధానం ఎలా ఆలోచించాలి అనే దాని పైన దృష్టి పెడుతుంది. ఈ మాట లు ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజుల లో సమాచారానికి, కంటెంట్ కు కొదువ లేదు. సమాచారం వరదలా వచ్చి పడుతోంది. మొత్తం సమాచారం మొబైల్ ఫోన్ లలో లభ్యమవుతోంది. అయితే ఏ సమాచారం ముఖ్యం, ఏ అవసరాల కు అనుగుణం గా చదువుకోవాలి అనేది చాలా ప్రధానం. ఇది మనసు లో పెట్టుకొని అవసరంలేని పాఠ్య ప్రణాళిక బరువును తగ్గించడానికి జాతీయ విద్య విధానంలో ప్రయత్నం జరిగింది. కుతూహలం తో కూడిన, ఆవిష్కరణ లు చేయగలిగే, చర్చల కు ఆధారమయ్యే, విశ్లేషణయుత విధానాల ను విద్యార్థుల కు బోధించడమే ప్రస్తుత కాలం లో మనకు అవసరం. దీని వల్ల పిల్లల కు చదువుల పట్ల ఇష్టం పెరుగుతుంది. తరగతి గదుల లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది.
మిత్రులారా, ప్రతి విద్యార్థి కి తన అభిరుచి కి అనుగుణంగా చదువుకునే అవకాశం లభించాలి. తన అవసరాల కు అనుగుణం గా, తన సౌలభ్యానికి అనుగుణం గా డిగ్రీ గాని, మరొక కోర్సు గాని చదువుకునే వాతావరణం వుండాలి. అంతే కాదు తనకు ఇష్టం లేకపోతే ఆ డిగ్రీ ని, లేదా కోర్సు ను మధ్యలోనే వదిలేసేందుకు స్వేచ్ఛ ఉండాలి. ఒక విద్యార్థి తన చదువులు అయిపోయి ఉద్యోగం చేయడానిక వెళ్లినప్పుడు తాను చదివిన చదువు కు, అక్కడి ఉద్యోగ అవసరాల కు మధ్య పొంతన లేదనే విషయం తెలుసుకోవడం తరచు గా జరుగుతోంది. పలు కారణాల తో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేసి, ఏదో ఒక పనిలో పడుతుంటారు. అటువంటి విద్యార్థుల అవసరాల ను పరిగణన లోకి తీసుకొని ఒక కోర్సు లోకి పలుసార్లు రావడం, పోవడమనే సదుపాయాన్ని కల్పించడం జరుగుతోంది. ఈ నిర్ణయం కారణం గా ఇప్పుడు ఒక విద్యార్థి ఒక కోర్సు లో చేరి మరింత సమర్థవంతం గా చదువుకోవచ్చు. తన ఉద్యోగ అవసరాల కు తగిన విధం గా చదువుకోవచ్చు. ఇది ఈ కొత్త విద్య విధానం లోని మరో ముఖ్యమైన అంశం.
కాబట్టి ఇప్పుడు ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సు అంటే ఇష్టం లేక దానిని వదలిపెట్టాలనుకుంటే వదలిపెట్టి కొత్త కోర్సు లో చేరవచ్చు. దీనికోసం వారు కొంతకాలం పాటు మొదటి కోర్సు కు దూరంగా ఉండి ఆ తరువాత కొత్త కోర్సు లో చేరవచ్చు. ఈ ఆలోచనల తోనే ఉన్నత విద్య లో అనేక సార్లు చేరడం, వెళ్లిపోవడం, క్రెడిట్ బ్యాంకు వంటి సదుపాయాల ను కల్పించడం జరిగింది. ఒక ఉద్యోగం లో చేరి, అదే ఉద్యోగంలోనే జీవితాంతం కొనసాగే రోజులు కావు ఇవి. మార్పు అనేది చాలా సహజం. దీని కోసం ఆ మనిషి నిరంతరాయం గా నూతన నైపుణ్యాల ను తెలుసుకోవడం, నైపుణ్యాల ను మెరుగుపరచుకోవడం చేయాలి. జాతీయ విద్య విధానం లో దీనిని కూడా పరిగణన లోకి తీసుకోవడం జరిగింది.
మిత్రులారా, ఒక జాతి అభివృద్ధి లో గౌరవ మర్యాదలనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సమాజం లోని ఆయా వర్గాలు సగర్వం గా నిలవడం లో కూడా అవి ముఖ్యం. సమాజం లో ఒక వ్యక్తి ఎటువంటి వృత్తిని అయినా చేపట్టవచ్చు. ఏ పని అయినా సరే, వర్తమానం లోని వృత్తుల కంటే తక్కువది ఏమీ కాదు. ఒక పని గొప్పది, మరో పని తక్కువది.. అనే అనారోగ్యకరమైన ఆలోచన, సాంస్కృతికం గా ఎంతో గొప్పదైన మన దేశం లోకి ఎలా చొరబడిందో తప్పకుండా ఆలోచించవలసిన విషయం. ఒక వృత్తి పెద్ద, చిన్న అనే ఆలోచన మన మెదళ్ల లోకి ఎలా చొరబడింది? కార్మికుల పని ని తక్కువ చేసి చేసి ఎగతాళి చేయడం ఎందుకు జరుగుతోంది? ఇటువంటి ఆలోచన విధానం వెనక ప్రధాన కారణం సమాజాని కి దూరం గా విద్య వ్యవస్థ ఉండడమే. మీరు ఒక గ్రామాన్ని సందర్శిస్తే అక్కడ రైతు లు, కూలీ లు చేస్తున్న పనుల ను గమనిస్తే వారు ఈ సమాజ అభివృద్ది కి ఎలా కష్టపడుతున్నారో మీకు తెలుస్తుంది. ప్రజల ఆహార అవసరాల ను తీర్చి సమాజం కోసం వారు ఎలా శ్రమిస్తున్నారో అవగతం అవుతుంది. వారి శ్రమ ను గౌరవించడం మనం నేర్చుకోవాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి దశలోనే శ్రమశక్తి ని గౌరవించే విధం గా మన జాతీయ విద్య విధానం లో జాగ్రత్తల ను తీసుకోవడం జరుగుతోంది.
మిత్రులారా, 21వ శతాబ్ది నుండి ఈ ప్రపంచం చాలా ఆశిస్తోంది. ప్రపంచాని కి కావలసిన ప్రతిభ ను, సాంకేతికత ను అందించే సామర్థ్యం భారతదేశాని కి ఉంది. ఈ ప్రపంచం పట్ల మనం నెరవేర్చవలసిన బాధ్యత ను దృష్టి లో పెట్టుకొని జాతీయ విద్య విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తు లో ఉపయోగపడే సాంకేతికతల ను దృష్టి లో పెట్టుకొని మన ఆలోచన విధానాన్ని అభివృద్ధిపరచుకొనే లక్ష్యం తో జాతీయ విద్య విధానం లో పరిష్కారాల ను సూచించారు. తక్కువ వ్యయం తో, సమర్థవంతం గా, ఎంతో వేగం తో దూర ప్రాంతాల లోని విద్యార్థుల ను చేరుకోవడానికి గాను సాంకేతికత మనకు ఒక మాధ్యమాన్ని ఇచ్చింది. ఈ సాంకేతికత నుండి వీలైనంతగా లబ్ధి ని పొందాలి.
ఈ విద్య విధానం ద్వారా సాంకేతికత ఆధారం గా ఉండే మెరుగైన కోర్సుల ను, పాఠ్యపుస్తకాల ను అభివృద్ధి చేసుకోవడానికి కావల్సిన సహాయం లభిస్తుంది. కంప్యూటర్ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, కోడింగ్ లేదా పరిశోధన దృక్పథం తో కార్యకలాపాలు.. ఇవన్నీ విద్యవ్యవస్థ ను మార్చడమే కాకుండా మొత్తం సమాజ విధానాన్నే మార్చే మాధ్యమం గా పని చేస్తాయి. వర్చువల్ ల్యాబ్ అనే అంశం మెరుగైన విద్య ను అందుకోవాలనే నా యువ స్నేహితుల కలలను పండిస్తుంది. ల్యాబ్ ప్రయోగాలు అవసరం కాబట్టి ఆ కారణం గా చదవలేకపోయిన వారు ఇప్పుడు చదువుకోగలుగుతారు. మన దేశం లో పరిశోధన కు, విద్య కు నడుమన గల అంతరాన్నితొలగించడం లో జాతీయ విద్య విధానం ప్రధానమైన పాత్ర ను పోషిస్తుంది.
మిత్రులారా, విద్య సంస్థ లు, వాటిలో ఉన్న మౌలిక సదుపాయాల లో విద్య రంగ సంస్కరణ లు ప్రతిఫలించినప్పుడే జాతీయ విద్య విధానాన్ని సమర్థవంతం గా, వేగం గా అమలు చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు మన సమాజం లో ఎంతో అవసరమైంది ఏమిటంటే నూతన ఆవిష్కరణ లు, వాటి ని అమలు చేయడమనే విలువ లు. ఇవి మన జాతీయ విద్య సంస్థలలో మొదలవ్వాలి. వాటి స్వతంత్ర ప్రతిపత్తి అనేది మీ చేతుల్లోనే ఉంది. సాధికారిత కలిగిన సమాజాన్ని ఆవిష్కరించడానికిగాను విద్య ముఖ్యం గా ఉన్నత విద్య దోహదం చేయాలని మనం అనుకున్నప్పుడు దేశం లోని ఉన్నత విద్య సంస్థల కు తగిన సాధికారిత ను కల్పించాలి. విద్య సంస్థల కు సాధికారిత ఎలా కలిగించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి అనే అంశం తలెత్తుతుంటుందనే విషయం నాకు తెలుసు. మనకు తెలుసు, స్వతంత్ర ప్రతిపత్తి అనే దాని చుట్టూ పలు అభిప్రాయాలు ఉన్నాయి అనే సంగతి. దేశం లోని ప్రతి విద్య సంస్థ… ప్రభుత్వ ఆధ్వర్యం లో క్రమశిక్షణ తో నడవాలని కొంతమంది నమ్ముతారు. కాదు కాదు స్వతంత్ర ప్రతిపత్తి ఉండితీరాలి అని మరి కొంత మంది నమ్ముతున్నారు.
మొదటి విధానం లో ప్రభుత్వేతర సంస్థల పట్ల అపనమ్మకం కనిపిస్తోంది. మరో వైపున రెండో విధానం లో స్వతంత్రప్రతిపత్తి అనేది అంతా మేమే అనే లైసెన్స్ లాగా అయిపోతోంది. సరైన నాణ్యమైన విద్య విధానాన్ని సాధించాలంటే అది ఈ రెండు అభిఫ్రాయాల ను సమన్వయం చేసుకోవడం లో ఉంది. నాణ్యమైన విద్య కోసం తపించే విద్యాసంస్థల కు స్వేచ్ఛ ను ప్రసాదించాలి. ఆ పని చేస్తే నాణ్యత పెరగడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రగతి ని సాధించడానికి కారణమవుతుంది. జాతీయ విద్య విధానం తయారు కావడానికి ముందు..ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా .. దేశం లోని విద్య సంస్థల కు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికిగాను మా ప్రభుత్వం తీసుకొన్న చర్యలు మీకు తెలుసు. జాతీయ విద్య విధానం అభివృద్ధి చెంది అందుబాటు లోకి వస్తున్న ఈ తరుణం లో విద్య సంస్థల కు స్వతంత్ర ప్రతిపత్తి ని ఇచ్చే కార్యక్రమం మరింత వేగాన్ని పుంజుకొంటుందని నేను భావిస్తున్నాను.
మిత్రులారా, మన పూర్వ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ అంటుండే వారు.. నైపుణ్యం, నిపుణత లతో కూడిన విద్య యొక్క ఉద్దేశ్యం మనల్ని మానవత్వంతో నిండిన మనుషులు గా తయారు చేయడం అని. వికాసం పొందిన మానవుల ను ఉపాధ్యాయులే తయారు చేయగలరు. నిజాని కి మీరందరూ .. అంటే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు… మీరే ఈ విద్య వ్యవస్థ లో మార్పు ను తీసుకు రావడం లో కీలక పాత్ర ను పోషించేది. మీరు మంచి విద్యార్థుల ను అందించగలరు. సరైన వృత్తినైపుణ్యం గలవారిని తయారు చేయగలరు. అంతే కాదు ఈ దేశాని కి మంచి పౌరుల ను అందించేది మీరే. విద్య రంగం తో అనుబంధం గల మీరు ఈ పని ని చేస్తారు, చేయగలరు. అందుకే ఈ జాతీయ విద్య విధానం లో అధ్యాపకుల కు తగిన గౌరవాన్ని ఇచ్చే అంశాని కి ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇచ్చాము. అంతే కాదు భారతదేశం లోని ప్రతిభ భారతదేశం లోనే ఉండిపోయి రానున్న తరాల ను అభివృద్ది చేయడానికి దోహదం చేసేలా చర్యల ను తీసుకోవడం జరిగింది. అధ్యాపకుల కు శిక్షణ కార్యక్రమాల ను నిర్వహిస్తూ వారిని నిరంతరం వర్తమాన పరిస్థితుల కు అనుగుణం గా తయారు గా ఉండేలా చేయడమనే అంశాని కి జాతీయ విద్య విధానం లో ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇచ్చాము. ఉపాధ్యాయలు నిరంతరం నేర్చకుంటూ ఉంటే వారు దేశాన్ని ముందుకు తీసుకుపోగలరు అనే విషయం పై నాకు విశ్వాసం ఉంది.
మిత్రులారా, జాతీయ విద్య విధానాన్ని అమలు చేయాలంటే మనందరం దృఢ సంకల్పం తో, ఐకమత్యం తో పని చేయాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాల విద్య సంస్థ లు, పలు రాష్ట్రాలు, ఈ రంగం తో సంబంధమున్న వారందరితో మరో దఫా చర్చలు ఇక్కడ మొదలవుతాయి. మీరందరూ ఉన్నత విద్యాసంస్థల లో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు కాబట్టి మీపై ఉన్నతమైన బాధ్యత లు ఉన్నాయి. జాతీయ విద్య విధానం పై చర్చ లు చేయాలని, వెబినార్ లు నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విద్య విధానం అమలు కోసం ఒక వ్యూహాన్ని తయారు చేయండి. ఈ వ్యూహం అమలు కోసం ఒక మార్గసూచి ని తయారు చేయండి. దానికి నిర్దిష్ట గడువు పెట్టుకోండి. వనరులను తయారు చేసుకోండి. మానవ వనరులను తయారు చేసుకోండి. తద్వారా ఈ విధానాన్ని అమలు చేయండి. నూతన విద్య విధానం నేపథ్యం లో ఈ అంశాలన్నిటినీ ఒక చోటు కు చేర్చడానికి ఒక ప్రణాళిక ను సిద్దం చేసుకోండి.
జాతీయ విద్య విధానం అనేది కేవలం ఒక సర్ క్యులర్ కాదు. జాతీయ విద్య విధానాన్ని ఒక సర్ క్యులర్ ను ఇచ్చినంతనే, దానిని నోటిఫై చేసినంతనే అమలులోకి తీసుకు రావడం జరుగదు. మన ఆలోచన విధానం లో మార్పు చేసుకొని, అపరిమితమైన అంకితభావం తో పని చేస్తేనే ఇది అమలవుతుంది. భారతదేశం యొక్క వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్మించాలంటే ఈ పని చాలా ముఖ్యం. దీనికి మీ వైపు నుండి ప్రధానమైన కృషి జరగాలి. ఈ సమావేశాన్ని చూస్తున్న వారు, వింటున్న వారు.. ప్రతి ఒక్కరు సహాయ సహకారాల ను అందించాలి. జాతీయ విద్య విధానం సమర్థవంతం గా అమలు కావడం కోసం ఈ సమావేశం ద్వారా మెరుగైన సూచనలు, ఉత్తమ సలహాలు, పరిష్కారాలు లభిస్తాయని నేను నమ్ముతున్నాను. డాక్టర్ కస్తూరిరంగన్ కు, ఆయన బృందం సభ్యుల కు ఒక సార్వజనిక వేదిక గుండా నా యొక్క గౌరవాదరాల ను మరియు కృతజ్ఞత ను వ్యక్తం చేయడానికి కూడాను ఈ సమావేశం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది.
మరోసారి, నేను అందరికీ నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. మీకు అనేకానేక ధన్యవాదములు.
**
Addressing ‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy.’ https://t.co/RmsnBiB37z
— Narendra Modi (@narendramodi) August 7, 2020
आज राष्ट्रीय शिक्षा नीति की देशभर में चर्चा हो रही है। 3-4 साल के व्यापक विचार-विमर्श और लाखों सुझावों पर लंबे मंथन के बाद इसे स्वीकृत किया गया है।
— Narendra Modi (@narendramodi) August 7, 2020
अब सबकी निगाहें इसके Implementation पर हैं। इस चैलेंज को देखते हुए जहां कहीं कुछ सुधार की आवश्यकता है, उसे हमें मिलकर ही करना है। pic.twitter.com/ulVM8qVtLe
हर देश अपनी शिक्षा व्यवस्था को अपनी National Values के साथ जोड़ते हुए, अपने National Goals के अनुसार रिफॉर्म करते हुए चलता है।
— Narendra Modi (@narendramodi) August 7, 2020
राष्ट्रीय शिक्षा नीति 21वीं सदी के भारत की, नए भारत की नींव तैयार करने वाली है। pic.twitter.com/qyScNQuC4a
हमें अपने विद्यार्थियों को Global Citizen भी बनाना है और इसका भी ध्यान रखना है कि वे अपनी जड़ों से जुड़े रहें।
— Narendra Modi (@narendramodi) August 7, 2020
जड़ से जग तक,
मनुज से मानवता तक,
अतीत से आधुनिकता तक,
सभी बिंदुओं का समावेश करते हुए इस राष्ट्रीय शिक्षा नीति का स्वरूप तय किया गया है। pic.twitter.com/WU38a1qto5
अभी तक जो हमारी शिक्षा व्यवस्था है, उसमें What to Think पर फोकस रहा है,
— Narendra Modi (@narendramodi) August 7, 2020
जबकि इस शिक्षा नीति में How to Think पर बल दिया जा रहा है।
कोशिश यह है कि बच्चों को सीखने के लिए Discovery Based, Discussion Based और Analysis Based तरीकों पर जोर दिया जाए। pic.twitter.com/mIbqhkYPT0
21वीं सदी के भारत से पूरी दुनिया को बहुत अपेक्षाएं हैं।
— Narendra Modi (@narendramodi) August 7, 2020
भारत में सामर्थ्य है कि वह टैलेंट और टेक्नोलॉजी का समाधान पूरी दुनिया को दे सकता है।
इस जिम्मेदारी को भी हमारी एजुकेशन पॉलिसी Address करती है। pic.twitter.com/98IzoBnIau
राष्ट्रीय शिक्षा नीति का जैसे-जैसे विस्तार होगा, शिक्षा संस्थानों की ऑटोनॉमी की प्रक्रिया भी और तेज होगी। pic.twitter.com/tsWJRcuoDS
— Narendra Modi (@narendramodi) August 7, 2020
राष्ट्रीय शिक्षा नीति में Teacher Training पर बहुत जोर है, वे अपनी Skills लगातार अपडेट करते रहें, इस पर बहुत जोर है। pic.twitter.com/xBew4k3Efw
— Narendra Modi (@narendramodi) August 7, 2020
National Education Policy- राष्ट्रीय शिक्षा नीति के संदर्भ में आज का ये event बहुत महत्वपूर्ण है।
— PMO India (@PMOIndia) August 7, 2020
इस कॉन्क्लेव से भारत के Education World को National Education Policy- राष्ट्रीय शिक्षा नीति के विभिन्न पहलुओं के बारे में विस्तृत जानकारी मिलेगी: PM @narendramodi
जितनी ज्यादा जानकारी स्पष्ट होगी फिर उतना ही आसान इस राष्ट्रीय शिक्षा नीति का Implementation भी होगा।
— PMO India (@PMOIndia) August 7, 2020
3-4 साल के व्यापक विचार-विमर्श के बाद, लाखों सुझावों पर लंबे मंथन के बाद राष्ट्रीय शिक्षा नीति को स्वीकृत किया गया है: PM @narendramodi
आज देशभर में इसकी व्यापक चर्चा हो रही है।
— PMO India (@PMOIndia) August 7, 2020
अलग-अलग क्षेत्र के लोग, अलग-अलग विचारधाराओं के लोग, अपने views दे रहे हैं, राष्ट्रीय शिक्षा नीति को Review कर रहे हैं।
ये एक Healthy Debate है, ये जितनी ज्यादा होगी, उतना ही लाभ देश की शिक्षा व्यवस्था को मिलेगा: PM @narendramodi
ये भी खुशी की बात है कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से, किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का Bias है, या किसी एक ओर झुकी हुई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 7, 2020
कुछ लोगों के मन में ये सवाल आना स्वभाविक है कि इतना बड़ा Reform कागजों पर तो कर दिया गया, लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा।
— PMO India (@PMOIndia) August 7, 2020
यानि अब सबकी निगाहें इसके Implementation की तरफ हैं: PM @narendramodi
आप सभी राष्ट्रीय शिक्षा नीति के implementation से सीधे तौर पर जुड़े हैं और इसलिए आपकी भूमिका बहुत ज्यादा अहम है।
— PMO India (@PMOIndia) August 7, 2020
जहां तक Political Will की बात है, मैं पूरी तरह कमिटेड हूं, मैं पूरी तरह से आपके साथ हूं: PM @narendramodi
हर देश, अपनी शिक्षा व्यवस्था को अपनी National Values के साथ जोड़ते हुए, अपने National Goals के अनुसार Reform करते हुए चलता है।
— PMO India (@PMOIndia) August 7, 2020
मकसद ये होता है कि देश का Education System, अपनी वर्तमान औऱ आने वाली पीढ़ियों को Future Ready रखे, Future Ready करे: PM @narendramodi
भारत की National Educational Policy- राष्ट्रीय शिक्षा नीति का आधार भी यही सोच है।
— PMO India (@PMOIndia) August 7, 2020
राष्ट्रीय शिक्षा नीति, 21वीं सदी के भारत की, नए भारत की Foundation तैयार करने वाली है: PM @narendramodi
बीते अनेक वर्षों से हमारे Education System में बड़े बदलाव नहीं हुए थे।
— PMO India (@PMOIndia) August 7, 2020
परिणाम ये हुआ कि हमारे समाज में Curiosity और Imagination की Values को प्रमोट करने के बजाय भेड़ चाल को प्रोत्साहन मिलने लगा था: PM @narendramodi
हमारे students में, हमारे युवाओं में Critical और Innovative ability विकसित कैसे हो सकती है, जबतक हमारी शिक्षा में Passion ना हो, Philosophy of Education ना हो, Purpose of Education ना हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 7, 2020
आज गुरुवर रबीन्द्रनाथ ठाकुर की पुण्यतिथि भी है।
— PMO India (@PMOIndia) August 7, 2020
वो कहते थे - "उच्चतम शिक्षा वो है जो हमें सिर्फ जानकारी ही नहीं देती बल्कि हमारे जीवन को समस्त अस्तित्व के साथ सद्भाव में लाती है।"
निश्चित तौर पर राष्ट्रीय शिक्षा नीति का बृहद लक्ष्य इसी से जुड़ा है: PM @narendramodi
आज मुझे संतोष है कि भारत की नेशनल एजुकेशन पॉलिसी- राष्ट्रीय शिक्षा नीति को बनाते समय, इन सवालों पर गंभीरता से काम किया गया।
— PMO India (@PMOIndia) August 7, 2020
बदलते समय के साथ एक नई विश्व व्यवस्था खड़ी हो रही है।
एक नया Global Standard भी तय हो रहा है: PM @narendramodi
इसके हिसाब से भारत का एजुकेशन सिस्टम खुद में बदलाव करे, ये भी किया जाना बहुत जरूरी था।
— PMO India (@PMOIndia) August 7, 2020
School Curriculum के 10+2 structure से आगे बढ़कर अब 5+3+3+4 curriculum का structure देना, इसी दिशा में एक कदम है: PM @narendramodi
जड़ से जग तक,
— PMO India (@PMOIndia) August 7, 2020
मनुज से मानवता तक,
अतीत से आधुनिकता तक,
सभी बिंदुओं का समावेश करते हुए, इस राष्ट्रीय शिक्षा नीति का स्वरूप तय किया गया है: PM @narendramodi
इस बात में कोई विवाद नहीं है कि बच्चों के घर की बोली और स्कूल में पढ़ाई की भाषा एक ही होने से बच्चों के सीखने की गति बेहतर होती है।
— PMO India (@PMOIndia) August 7, 2020
ये एक बहुत बड़ी वजह है जिसकी वजह से जहां तक संभव हो, 5th class तक, बच्चों को उनकी मातृभाषा में ही पढ़ाने पर सहमति दी गई है: PM @narendramodi
अभी तक जो हमारी शिक्षा व्यवस्था है, उसमें What to Think पर फोकस रहा है।
— PMO India (@PMOIndia) August 7, 2020
जबकि इस शिक्षा नीति में How to think पर बल दिया जा रहा है।
ये मैं इसलिए कह रहा हूं कि आज जिस दौर में हम हैं, वहां Information और Content की कोई कमी नहीं है: PM @narendramodi
अब कोशिश ये है कि बच्चों को सीखने के लिए Inquiry-based, Discovery-based, Discussion based, और analysis based तरीकों पर जोर दिया जाए।
— PMO India (@PMOIndia) August 7, 2020
इससे बच्चों में सीखने की ललक बढ़ेगी और उनके क्लास में उनका Participation भी बढ़ेगा: PM @narendramodi
हर विद्यार्थी को, Student को ये अवसर मिलना ही चाहिए कि वो अपने Passion को Follow करे।
— PMO India (@PMOIndia) August 7, 2020
वो अपनी सुविधा और ज़रूरत के हिसाब से किसी डिग्री या कोर्स को Follow कर सके और अगर उसका मन करे तो वो छोड़ भी सके: PM @narendramodi
Higher education को streams से मुक्त करने, multiple entry और Exit, Credit Bank के पीछे यही सोच है।
— PMO India (@PMOIndia) August 7, 2020
हम उस era की तरफ बढ़ रहे हैं जहां कोई व्यक्ति जीवन भर किसी एक प्रोफेशन में ही नहीं टिका रहेगा।
इसके लिए उसे निरंतर खुद को re-skill और up-skill करते रहना होगा: PM @narendramodi
जब गांवों में जाएंगे, किसान को, श्रमिकों को, मजदूरों को काम करते देखेंगे, तभी तो उनके बारे में जान पाएंगे, उन्हें समझ पाएंगे, उनके श्रम का सम्मान करना सीख पाएंगे।
— PMO India (@PMOIndia) August 7, 2020
इसलिए राष्ट्रीय शिक्षा नीति में student education और Dignity of Labour पर बहुत काम किया गया है: PM @narendramodi
21वीं सदी के भारत से पूरी दुनिया को बहुत अपेक्षाएं हैं।
— PMO India (@PMOIndia) August 7, 2020
भारत का सामर्थ्य है कि कि वो टैलेंट और टेक्नॉलॉजी का समाधान पूरी दुनिया को दे सकता है हमारी इस जिम्मेदारी को भी हमारी Education Policy address करती है: PM @narendramodi
अब टेक्नोलॉजी ने हमें बहुत तेजी से, बहुत अच्छी तरह से, बहुत कम खर्च में, समाज के आखिरी छोर पर खड़े Student तक पहुंचने का माध्यम दिया है।
— PMO India (@PMOIndia) August 7, 2020
हमें इसका ज्यादा से ज्यादा उपयोग करना है: PM @narendramodi
वर्चुअल लैब जैसे कॉन्सेप्ट ऐसे लाखों साथियों तक बेहतर शिक्षा के सपने को ले जाने वाला है, जो पहले ऐसे Subjects पढ़ ही नहीं पाते थे जिसमें Lab Experiment जरूरी हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 7, 2020
जब Institutions और Infrastructure में भी ये Reforms, Reflect होंगे, तभी राष्ट्रीय शिक्षा नीति को अधिक प्रभावी और त्वरित गति से Implement किया जा सकेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 7, 2020
Good-Quality Education का रास्ता इन दोनों मतों के बीच में है।
— PMO India (@PMOIndia) August 7, 2020
जो संस्थान Quality education के लिए ज्यादा काम करे, उसको ज्यादा Freedom से Reward किया जाना चाहिए।
इससे Quality को Encouragement मिलेगा और सबको Grow करने के लिए Incentive भी मिलेगा: PM @narendramodi
शिक्षा व्यवस्था में बदलाव, देश को अच्छे students, अच्छे प्रोफेशनल्स और उत्तम नागरिक देने का बहुत बड़ा माध्यम आप सभी Teachers ही हैं, प्रोफेसर्स ही हैं।
— PMO India (@PMOIndia) August 7, 2020
इसलिए नेशनल एजुकेशन पॉलिसी-राष्ट्रीय शिक्षा नीति में dignity of teachers का भी विशेष ध्यान रखा गया है: PM @narendramodi
एक प्रयास ये भी है कि भारत का जो टेलेंट है, वो भारत में ही रहकर आने वाली पीढ़ियों का विकास करे।
— PMO India (@PMOIndia) August 7, 2020
राष्ट्रीय शिक्षा नीति में teacher training पर बहुत जोर है, वो अपनी skills लगातार अपडेट करते रहें, इस पर बहुत जोर है: PM @narendramodi
नेशनल एजुकेशन पॉलिसी- राष्ट्रीय शिक्षा नीति को अमल में लाने के लिए हम सभी को एकसाथ संकल्पबद्ध होकर काम करना है।
— PMO India (@PMOIndia) August 7, 2020
यहां से Universities, Colleges, School education boards, अलग-अलग States, अलग-अलग Stakeholders के साथ संवाद और समन्वय का नया दौर शुरु होने वाला है: PM @narendramodi
राष्ट्रीय शिक्षा नीति सिर्फ सर्कुलर जारी करके, नोटिफाई करके Implement नहीं होगी।
— PMO India (@PMOIndia) August 7, 2020
इसके लिए मन बनाना होगा, आप सभी को दृढ़ इच्छाशक्ति दिखानी होगी।
भारत के वर्तमान और भविष्य को बनाने के लिए आपके लिए ये कार्य एक महायज्ञ की तरह है: PM @narendramodi