ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్జ్వల్ డిస్కమ్ హామీ పథకం (యుడిఎవై.. ‘ఉదయ్’) పురోగతిని ఈ రోజు సమీక్షించారు. రుణ నిర్వహణ, ఫ్రేమ్ వర్క్ ల పర్యవేక్షణ, ఆర్థిక పరామితుల మెరుగుదల, నిర్వహణపరమైన విజయాలు, వినియోగదారుల సాధికారిత తదితర అంశాలను గురించి ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కి వివరణలిచ్చారు.
బొగ్గు, ఖనిజ ప్రాంతాల వేలానికి సంబంధించి సీనియర్ అధికారులు అందించిన ప్రదర్వనపూర్వక వివరణపై ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, గనుల తవ్వకాలను వేగిరపరచే మార్గసూచీల అవసరాన్ని గురించి నొక్కిచెప్పారు. ఖనిజ వనరుల లభ్యతపై అధ్యయనం, సంభావ్య భౌగోళిక ప్రాంతాల సర్వేక్షణకు, గుర్తింపునకు సంబంధించిన విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ప్రధాన మంత్రి కార్యాలయం, నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
Reviewed various aspects of UDAY & mineral block auction at a high level meeting today. https://t.co/w2nX0VHbo7
— Narendra Modi (@narendramodi) July 21, 2017