ప్రాత: స్మరణీయులైన గౌరవనీయ ఆధ్యాత్మిక వేత్తలు, సాధు పుంగవులు మరియు ఇక్కడ గుమికూడిన దైవ భక్తులారా,
అత్యంత ఆరాధనీయుడు, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం గల మహంత్ అవైద్యనాధ్ జీ మహరాజ్ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించే విశేష అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాలను నేను పొందే అవకాశం కూడా నాకు దక్కుతోంది. బుద్ధ భగవానుడు కావచ్చు, మహావీరుడు కావొచ్చు, లేదా కబీర్ కావచ్చు.. వీరందరూ ఏదో ఒక విధంగా గోరఖ్ పూర్ తో అవినాభావ సంబంధం కలిగివుండడం గోరఖ్ పూర్ గడ్డకు ఉన్న విశిష్టత. గురు గోరక్షనాధ్ జీ (గోరఖ్ నాథ్ జీ) నెలకొల్పిన మహత్తరమైన సంప్రదాయాలు కేవలం వ్యక్తుల అభ్యున్నతిని మాత్రమే కోరుకోలేదు.. మొత్తం సమాజ ప్రగతి కోసం వాటిని నెలకొల్పడం జరిగింది.
కాలక్రమంలో క్రమక్రమంగా సంభవించే రుగ్మతలు, అడ్డంకులు సమాజంలో నెలకొన్న సంప్రదాయాలలోకి చొచ్చుకువస్తుంటాయి. అయితే సంప్రదాయాల ఆదర్శాలను, నియమాలను పూర్తిగా గమనించి అవగాహన చేసుకుంటే పరిస్థితుల కారణంగా ఏర్పడే ఒత్తిడుల నుండి ఆ సంప్రదాయాలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవచ్చు. గోరఖ్ నాథ్ జీ ఏర్పరచిన అద్భుతమైన సంప్రదాయంతో సంబంధం గల అనేక ప్రదేశాలు గుజరాత్ లో వున్నాయని గర్వంగా చెప్పుకోవచ్చు. గుజరాత్ లో ఉన్నప్పుడు ఒక రోజు నేను మహంత్ అవైద్యనాధ్ జీతో భేటీ అయ్యే అదృష్టం నన్ను వరించింది. రాజకీయాలలో అంతగా సంబంధంలేని రోజుల నుండే నాకు ఆయనతో అనుబంధం ఉంది.
ఆ సమయంలో ఆయన ద్వారా నేను ఈ సంప్రదాయం గురించి సమగ్రంగా తెలుసుకోవడం జరిగింది. మొత్తం వ్యవస్థను నిర్వహించడం ఎలా జరుగుతుంది, దీని నియమాలు, విధానాలను ఎలా తయారు చేశారు, దీనితో సంబంధమున్న సాధువుల సమాచారాన్ని తిరిగి పొందడం ఎలా జరిగింది, వారు ఏ ప్రదేశంలో వున్నా వారి గురించి తెలుసుకోవడం ఎలా జరిగింది, అవసరమైనప్పుడు వారికి కావలసిన ఆర్ధిక సాయం అందజేయడం ఎలా జరిగింది మొదలైన విషయాలు తెలుసుకున్నాను. చాలా కాలం నుండీ గోరఖ్ నాథ్ సంప్రదాయాన్ని చాలా విజయవంతంగా అమలులో పెట్టడం జరుగుతోంది. ఈ మఠానికి సేవ చేసే భాగ్యం దక్కించుకున్న గొప్ప వారి వ్యక్తిత్వాల కారణంగానే ఇది
సాధ్యమవుతోంది.
స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం సామాజిక పునర్ నిర్మాణంలోను మహంత్ అవైద్యనాథ్ జీ గణనీయమైన పాత్రను పోషించారు. తనకున్న దూరదృష్టితో తన జీవితంలోని మరో కోణాన్ని ఆయన ఆవిష్కరించారు. పుణ్యస్థలాలను ప్రజాస్వామీకరించి వాటి ద్వారా ఏర్పడిన నూతన వాతావరణ లబ్ధిని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ దూరదృష్టి విజయవంతంగా ఈనాటికీ కొనసాగడానికి మహంత్ అవైద్యనాథ్ జీ శిష్యులైన యోగి ఆదిత్యనాథ్ జీ కృషి చేస్తున్నారు. భారతదేశంలోని సర్వ సాధు సంప్రదాయాలు, మఠాలు, అఖాడాలు కొన్ని సార్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి, బయటి నుండి చూసినప్పుడు బేధంతో వున్నట్టుగా అనిపిస్తుంది. అయితే అలా వున్నప్పటికీ వీటిలో ఉమ్మడిగా ఉన్న వారసత్వ అంశం ఏమంటే వాటి నుండి బయటకు వచ్చే వారు ఏనాడూ ఆకలితో బయటకు రారు. ఒక గుడిసెలో కూర్చున్న సాధువు, తన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా, తన దగ్గరకు వచ్చే భక్తుడిని మొదట ఒక ప్రశ్న అడుగుతారు. ప్రసాదం (దైవానికి సమర్పించిన ఆహారం) తీసుకుంటారా? అని అడుగుతారు. సమాజం పట్ల గల సున్నితమైన స్పందనల కారణంంగా అలాంటి అత్యద్భుతమైన సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఇతరుల సంక్షేమం కోసం, మంచి చెడ్డల కోసం మన జీవితాన్ని, వ్యవస్థలను వెచ్చించడానికి కావలసిన స్ఫూర్తి ఈ సంప్రదాయాల వల్లనే అందుతుంది. తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ సంప్రదాయాల వెనక ఉన్న విజయ మంత్రం కారణంగానే అవి ఈ వర్తమానంలోనూ పనికొస్తున్నాయి.
మన దేశంలోని అన్ని సంప్రదాయాలు కాలక్రమంలో మార్పులకు లోనయ్యాయి. అవి శాస్త్ర విజ్ఞానాన్ని రెండు చేతులతోనూ ఆహ్వానించాయి. ఎక్కడ అవసరమైతే అక్కడ వాటికి ఆహ్వానం పలికాయి. సామాజిక దృక్పథంలో వచ్చిన మార్పును స్వీకరించాయి. మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఎంతో మంది సాధువులు, సన్యాసులు స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలలో పాల్గొనడం నేను స్వయంగా గమనించాను. దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రచారోద్యమాలను చేపట్టిన సాధువుల గురించి నాకు తెలిసింది. వారు ఈ విషయంలో తమ భక్తులను చైతన్యవంతులను చేస్తున్నారు. మన మాతృమూర్తులు, సోదరీమణులు గౌరవప్రదంగా జీవించడానికి వీలుగా అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యేందుకుగాను వారు ప్రజలకు విజ్ఞప్తి చేయడం నా దృష్టికి వచ్చింది.
చాలా మంది సాధువులు మన దేశంలో నేత్రచికిత్స శిబిరాలను నిర్వహిస్తూ తమకు వీలున్నంత మేరకు సమాజంలోని పేద ప్రజలకు సాయం చేయడానికి కృషి చేస్తున్నారు. పశు సంపద ఆరోగ్యకరంగా ఉండేందుకుగాను తమ జీవితాలను అంకితం చేసిన ఎంతో మంది సన్యాసుల గురించి నాకు తెలుసు. విద్య కావచ్చు, సేవారంగం కావచ్చు, జీవితంలోని ప్రతి రంగంలోను మన సాధు సంప్రదాయం ఏదో ఒక రకంగా తన పాత్రను నిర్వహిస్తోంది.
భారతదేశం ఆధునికంగా తయారయ్యేలా, సౌభాగ్యవంతంగా ఉండేలా, ప్రజలలో మంచి విలువలు పెరిగేలా చూడడంలో ప్రధానమైన పాత్రను పోషించడానికి దేశంలోని లక్షలాది సాధువులు, వేలాది సంప్రదాయాలు, వందలాది మఠాలు ముందుకు రావలసిన సమయమిది. వీటిలో చాలా వరకు ఈ పనిని చేస్తున్నాయి. ఇది భారతదేశ భవిష్యత్ కు సంబంధించి శుభ సంకేతాలను పంపుతున్నది.
సమాజంలోని సుఖ దుఃఖాలను అర్థం చేసుకోవడానికి మహంత్ అవైద్యనాథ్ జీ తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అంకితం చేశారు. సమాజం పట్ల ఆయన ఎంతో బాధ్యతగా వ్యహరించారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రజలు మంచి పనులు చేసేలా వారిని ప్రోత్సహించడం కోసం ఆయన జీవిత పర్యంతం కృషి చేశారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలను అలంకరించే మహా భాగ్యం నాకు కలిగింది. మీ అందరితో పాటు, గోరఖ్ నాథ్ మందిర ప్రాంతానికి చేతులెత్తి నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తీవ్రమైన పశ్చాత్తాపానికి, అఖండ జ్యోతికి నెలవైన నేల గోరఖ్నాథ్ ప్రాంతం. అందరికీ స్ఫూర్తినిస్తున్న ఈ నేల మహత్తరమైన కార్యక్రమాలను పూర్తి చేసే వారికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఇచ్చే నేల. అలాంటి భూమికి ఇవే నా ప్రణామాలు.
మీ అందరికీ ధన్యవాదములు.
My association with Mahant Avaidyanath ji goes back to the time when I was not in active politics. Heard from him the work done here: PM
— PMO India (@PMOIndia) July 22, 2016
Our saints and seers, they are very noble and have always been compassionate towards society and the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 22, 2016
I have seen how so many saints and seers have immersed themselves towards furthering cleanliness and building toilets: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 22, 2016