ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ ను సందర్శించి, వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు. ఆయన హిన్డన్ విమానాశ్రయాని కి చెందిన సివిల్ టర్మినల్ ప్రారంభాని కి గుర్తు గా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత సికందర్‌పుర్ ను ఆయన సందర్శించి ఢిల్లీ- గాజియాబాద్- మేరఠ్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కు శంకుస్థాపన చేశారు. అనేక ఇతర అభివృద్ధి పథకాల ను కూడా ఆయన ప్రారంభించి, వేరు వేరు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కు ధ్రువీకరణ పత్రాల ను ప్రదానం చేశారు.
ప్రధాన మంత్రి గాజియాబాద్ లో శహీద్ స్థల్ (న్యూ బస్ అడ్డా) మెట్రో స్టేశన్ ను కూడా సందర్శించారు. శహీద్ స్థల్ స్టేశన్ నుండి దిల్‌శాద్ గార్డెన్ వరకు వెళ్ళే మెట్రో రైలు కు ఆయన ప్రారంభ సూచకం గా జెండా ను చూపెట్టారు. మెట్రో రైలు లో ఆయన ప్రయాణించారు కూడాను.
గాజియాబాద్ లోని సికందర్‌పుర్ లో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గాజియాబాద్ ప్రస్తుతం మూడు ‘సి’ ల వల్ల ఖ్యాతి గాంచిందన్నారు. అవి.. కనెక్టివిటీ (సంధానం) క్లీన్ లీనెస్ (స్వచ్ఛత), ఇంకా కేపిటల్ (మూలధనం) ..గా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ సందర్భం గా ఆయన గాజియాబాద్ లో రహదారి సంధానం మరియు మెట్రో సంధానం పెరిగిన సంగతి ని గురించి, స్వచ్ఛ్ సర్వేక్షణ్ స్థానాల లో గాజియాబాద్ 13వ స్థానాన్ని తెచ్చుకోవడాన్ని గురించి మరియు ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యాపార కేంద్రం గా గాజియాబాద్ యొక్క ఉన్నతి ని గురించి వివరించారు.
హిన్డన్ విమానాశ్రయం లో కొత్త సివిల్ టర్మినల్ రావడం తో గాజియాబాద్ ప్రజలు ఇతర నగరాల కు వెళ్లేటప్పుడు వారి ప్రయాణాల ను ఢిల్లీ కి వెళ్ళి మొదలుపెట్టుకొనేందుకు బదులుగా వారి ప్రయాణాల ను గాజియాబాద్ నుండే ఆరంభించవచ్చునని ప్రధాన మంత్రి తెలిపారు. సివిల్ టర్మినల్ యొక్క నిర్మాణం ఎంత వేగం గా జరిగిందంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దృఢ నిశ్చయాని కి, పని సంస్కృతి ని చాటుతోందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ మరియు ఢిల్లీ నడుమ రాకపోక లు జరిపే ప్రయాణికు లకు శహీద్ స్థల్ నుండి మెట్రో తాలూకు నూతన సెక్షన్ మొదలవడం వల్ల ఇక్కట్లు తగ్గగలవని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ – మీరఠ్ ఆర్‌ఆర్‌టిఎస్ సిస్టమ్ 30,000 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించబడిందని, ఇది భారతదేశం లో ఈ కోవ కు చెందిన ఒకటో రవాణా వ్యవస్థ గా అని ప్రధాన మంత్రి అన్నారు. దీని నిర్మాణం పూర్తి అయిందంటే ఢిల్లీ కి, మేరఠ్ కు నడుమ ప్రయాణ కాలం చెప్పుకోదగినంత గా తగ్గిపోతుందని వివరించారు. గాజియాబాద్ లో నిర్మాణాధీనం లోని నూతన మౌలిక సదుపాయాలు ఈ నగర ప్రజల కు మరియు సమీప ప్రాంతాల వారికి జీవించడం లో సౌలభ్యానికి పూచీ పడతాయని ఆయన అన్నారు. ఇదే విధమైన మౌలిక సదుపాయాలు దేశం అంతటా నిర్మాణం లో ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన తాలూకు లాభాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. అసంఘటిత రంగం లోని శ్రామికు లకు వారి యొక్క వృద్ధాప్యం లో ఆర్థిక భద్రత ను ఈ యోజన అందిస్తుందని ఆయన అన్నారు. రెండు కోట్ల మంది కి పైగా రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లో భాగం గా వారి యొక్క ఒకటో కిస్తీ ని అందుకొన్నారని ఆయన వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, పిం-ఎస్‌వైఎమ్ ల వంటి చక్కని ఆలోచన అనంతరం రూపొందించిన పథకాల అండ తో తన ప్రభుత్వం అసాధ్యమైన దాని ని సాధ్యం చేస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. కార్యాల ను సాధించడం కోసం శక్తి ని దేశ ప్రజల నుండి తాను పొందుతున్నానని ఆయన అన్నారు.