Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని చిత్రకూట్ లో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం


ఈ పవిత్రమైనటువంటి భూమి లో పెద్ద సంఖ్య లో విచ్చేసినటువంటి చిత్రకూట్ లోని నా యొక్క సోదరులు మరియు సోదరీమణులారా,

ఇది శ్రీ రామచంద్ర భగవానుని యొక్కయు, ఆయన సోదరుడైన లక్ష్మణుని యొక్కయు ఇంకా సీతాదేవి యొక్కయు నివాసం గా ఉండింది.  శ్రీ రామచంద్ర ప్రభువు తపోభూమి లోకి మీ అందరి కి నేను ఇదే ఆహ్వానం పలుకుతున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

ముందుగా, నేను మిమ్ములను క్షమాపణ వేడుకొంటున్నాను.. ఎందుకంటే సభాస్థలం లోపలి కంటే సభాస్థలి వెలుపలే ఎక్కువ మంది వేచివుండి మరి వారు లోపల కు చేరుకొనేటందుకు ప్రయత్నిస్తున్నారు గాని వారికి అది వీలుపడటం లేదు.  ఈ అసౌకర్యానికి గాను నేను క్షమాపణ కోరుకొంటున్నాను.  అయితే ఇక్కడ ఇంత పెద్ద సంఖ్య లో మీ యొక్క ఆగమనం అభివృద్ధి పథకాల పట్ల మీలో ఎంతటి ప్రగాఢమైన విశ్వాసం నెలకొన్నదీ చాటిచెబుతోంది.  గోస్వామి తులసీదాస్ అన్నారు కదా  –

चित्रकूट के घाट पर भई संतन की भीर। 

ఈ రోజు న, మీ అందరి ని చూస్తూవుంటే, మీ సేవకుడు కూడా అదే విధమైన అనుభూతి ని పొందుతూవున్నాడు.  చిత్రకూట్ కేవలం ఒక ప్రదేశం ఏమీ కాదు, కానీ అది భారతదేశపు ప్రాచీన సమాజ జీవనాన్ని అభివర్ణించేటటువంటి స్థలం గా అలరారుతున్నది.  ఈ ప్రాంతం భారతీయుల లో క్రొత్త విలువల ను ప్రతిష్ఠాపన చేసింది.  భారతదేశం లోని సంఘం నవీనం అయినటువంటి ఆదర్శాల ను పోగుచేసుకొన్నది ఇక్కడి నుండే.  శ్రీ రామచంద్ర ప్రభువు ఆదివాసీ ల నుండి, ఎవరైతే వన్య ప్రాంతాల లో మనుగడ సాగిస్తున్నటువంటి వారో అదుగో వారి వల్ల, మరి అలాగే ఇతర జీవిక లలో నిమగ్నం అయినటువంటి సహవాసి ల వల్ల ప్రభావితుడు అయ్యారని తెలిపే అసంఖ్యాక గాథ లు ఉన్నాయి.

మిత్రులారా,

మారుతున్న కాలాల అవసరాల తో పాటే భారతదేశ పురాతన సంప్రదాయాల ను సజీవం గా ఉంచే ప్రయోగాలు కూడాను ఈ ప్రదేశం నుండే చోటు చేసుకొన్నాయి.  భారత రత్న, రాష్ట్రీయ రుషి నానా జీ దేశ్ ముఖ్ భారతదేశాన్ని స్వాతంత్ర్య పథం లోకి తీసుకుపోయే ఒక భారీ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు.  నానా జీ ని ఆయన వర్ధంతి సందర్భం లో రెండు రోజుల క్రిందటే దేశం సంస్మరించుకొన్నది. 

సోదరులు మరియు సోదరీమణులారా,

‘గ్రామోదయ్ సే రాష్ట్రోదయ్’ అనే తన దార్శనికత కై జీవన పర్యంతం పరిశ్రమించిన నానా జీ కన్న కలల ను పండించడం కోసమని ఈ పవిత్రమైన నేల లో వేల కోట్ల రూపాయల విలువైన పథకాల కు ఈ రోజు న శంకుస్థాపన లు జరుగుతూ ఉండడమనేది మనకు అందరి కి విశేషమైనటువంటి లాభాన్ని అందించేదే.

బుందేల్ ఖండ్ ను అభివృద్ధి తాలూకు ఎక్స్ ప్రెస్ వే లోకి తీసుకుపోయేటటువంటి బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ఈ యావత్తు ప్రాంతాని కి మనుగడ రీతి ని మార్చివేసేది గా రుజువు చేసుకోనున్నది.  దాదాపు 15,000 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరుపుకోబోయే ఈ ఎక్స్ ప్రెస్ వే ఇక్కడ వేలాది ఉద్యోగ అవకాశాల ను అందిస్తుంది; అలాగే సామాన్య మానవుడి ని పెద్ద నగరాల తో కలుపుతుంది కూడా.  దేశం లోని రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం మరియు వారి కి సాధికారిత ను ప్రసాదించడం కోసం 10,000 ఫార్మర్ ప్రడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్)ను ఏర్పాటు చేసేందుకు ఒక పథకాన్ని కాసేపటి క్రితం ప్రారంభించడమైంది.  అంటే, ఇంత కాలం ఒక ఉత్పాదకుని గా మిగిలిన రైతు, ఇక మీదట ఫార్మర్ ప్రడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ ల) మాధ్యమం ద్వారా వ్యాపారాన్ని కూడా చేస్తాడన్న మాట.  ఇప్పుడు రైతు పంట ను నాటుతాడు; అంతేకాకుండా  నేర్పరి అయినటువంటి ఒక వ్యాపారి వలె బేరమాడి తన ఫలసాయాని కి సరి అయిన ధర ను కూడాను పొందుతాడు.  ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోకండి అంటూ మీకు నేను విన్నపం చేస్తున్నాను.  ఇక్కడ దేశవ్యాప్తం గా సఫలత ను సాధించిన ఎఫ్ పిఒ లతో ఒక ప్రదర్శన ఏర్పాటైంది.  నేను ఆ ప్రదర్శన ను చూశాను, మరి ఆ ప్రదర్శన ను చూసి గర్వపడ్డాను.  మీరు కూడా తప్పక ఆ ప్రదర్శన ను చూడాలని, అలా ఆ ప్రదర్శన ను వీక్షించి దాని ని గురించి అర్థం చేసుకోవాలని మీ అందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  అవి వాటి వాటి రాష్ట్రాల లో ఎఫ్ పిఒ ల మాధ్యమం ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని నెరవేర్చుతున్నాయి.  రాబోయే 5 సంవత్సరాల కాలం లో ఈ యావత్తు ప్రచార ఉద్యమం మీద దగ్గర దగ్గర గా 5,000 కోట్ల రూపాయల ను వెచ్చించడం జరుగుతుంది.  ఈ అభివృద్ధి పథకాలన్నిటికి గాను బుందేల్ ఖండ్ పౌరుల కు, అభివృద్ధి కై జరుగుతున్న ఈ పరుగు పందెం లో పాల్గొంటున్నందుకు బుందేల్ ఖండ్ లోని నా రైతు సోదరుల కు మరియు నా రైతు సోదరీమణుల కు అభినందన లు.

మిత్రులారా,

మన దేశం లో రైతుల కు సంబంధించిన విధానాలకు మా యొక్క ప్రభుత్వం అదే పని గా ఒక సరిక్రొత్త దిశ ను అందిస్తూ వస్తున్నది.  ఈ విధానాల కు రైతుల ఆదాయం తో ముడి పెట్టడమైంది.  రైతు పెట్టే ఖర్చు ను తగ్గించి, దిగుబడి ని పెంచి, తద్ద్వారా ఫలసాయాని కి దక్కే ధర సబబయింది గా ఉండేటట్లు చూడటం జరుగుతున్నది.  దీనికి గాను గడచిన అయిదు సంవత్సరాల లో అనేక నిర్ణయాల ను తీసుకోవడమైంది.  అది ఎమ్ఎస్ పి నిర్ణయం కావచ్చు లేదా సాయిల్ హెల్థ్ కార్డు నిర్ణయం కావచ్చు; లేదా యూరియా కు 100 శాతం వేప పూత ను పూయాలన్న నిర్ణయం కావచ్చు; లేదా దశాబ్దాల తరబడి పనులు అటకెక్కిన సేద్యపు నీటి పారుదల పథకాల ను పూర్తి చేసే నిర్ణయం కావచ్చు, ప్రభుత్వం ప్రతి ఒక్క స్థాయి లోను శ్రమించింది.  రైతుల ఆదాయాన్ని పెంచే కీలకమైన పయనం లో ఇది ఒక ముఖ్యమైన అడుగు.  ఈ రోజు న ఇక్కడ మనం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) తాలూకు ఒకటో వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొంటున్నాము.  ఈ పథకాన్ని ఏడాది క్రిందట ప్రారంభించినప్పుడు, ఎటువంటి భయ సంకోచాలు వ్యక్తం అయిందీ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది!  కానీ అంత తక్కువ కాలం లోనే, దేశం లో సుమారు 8.5 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల లోకి 50,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు ను జమ చేయడమైంది.  దరిదాపు గా 12,000 కోట్ల రూపాయల ను చిత్రకూట్ సహా యావత్తు ఉత్తర్ ప్రదేశ్ లో 2 కోట్ల కు మించిన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల లోకి  జమ చేయడం జరిగింది.  మీరు ఊహించగలరా,  బ్యాంకు ఖాతా లో 50,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు ను, అది కూడా ఒకే ఒక్క ఏడాది లో? మధ్యవర్తులు లేకుండాను, సిఫారసు అక్కరలేకుండాను మరియు ఎటువంటి భేదభావాని కి తావు ఉండకుండానే!

మిత్రులారా,

గడచిన దశాబ్దుల లో బుందేల్ ఖండ్ కోసం, రైతుల కోసం వేల కోట్ల కొద్దీ రూపాయల విలువైనటువంటి ప్యాకేజీ లను ప్రకటించిన రోజుల ను మీరు కూడా చూశారు, కానీ రైతుల కు ప్రయోజనం దక్కిందే లేదు.  ప్రస్తుతం దేశం ఆ రోజుల ను వెనుకపట్టునే వదలివేసింది.  ఇప్పుడు ఢిల్లీ నుండి ప్రకటించిన ప్రతి పెన్నీ దాని ని అందుకోవలసినటువంటి లబ్ధిదారు కు అందుతున్నది.  అటువంటి పరిస్థితి లో, కిసాన్ సమ్మాన్ నిధి యొక్క పరిధి ని మరింత గా విస్తరించడమైంది.  ప్రస్తుతం ఈ పథకం తాలూకు లబ్ధిదారులు బ్యాంకుల నుండి రుణాల ను సైతం ఇట్టే పొందగలుగుతారు.  ఇందుకు గాను రైతులందరి ని క్రెడిట్ కార్డుల సదుపాయం తో జతపరచడం జరుగుతున్నది.  మన పేద రైతులు, చిన్న రైతులు వడ్డీవ్యాపారుల దయాదాక్షిణ్యాలపైన  ఆధారపడవలసిన అగత్యం లేదు.  అంతటి ఒక మహా కార్యాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) నెరవేర్చబోతున్నది.  బ్యాంకు వద్ద నుండి సులభం గాను, చౌకగాను రుణం లభ్యం అవుతున్న కారణం గా, ఇక మీరు రుణం కోసం ఇక్కడి కో లేక అక్కడి కో వెళ్లవలసిన పని లేదు.

సోదరులు మరియు సోదరీమణులారా,

పిఎమ్ కిసాన్ యోజన తాలూకు లబ్ధిదారులందరి ని కిసాన్ క్రెడిట్ కార్డు కు కూడా జత పరచేటట్టు చూడాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాము.  ప్రస్తుతానికి, దాదాపు గా 1.75 కోట్ల మంది  లబ్ధిదారులు ఈ సౌకర్యాని కి నోచుకోకుండా ఉంటున్నారు.  ఈ అంతరాన్ని భర్తీ చేయడం కోసం, ఈ నెల లో ఒక 15 రోజుల ప్రచార ఉద్యమాన్ని కూడాను మొదలుపెట్టడమైంది; ఇది 40 లక్షల మంది కి పైగా రైతుల ను కెసిసి తో ముడి వేసింది.  ఈ మిత్రుల లో కొందరి కి కొద్ది సేపటి క్రితమే కార్డుల ను కూడా ఇవ్వడం జరిగింది.  

సోదరులు మరియు సోదరీమణులారా,

ఎవరైతే పిఎమ్ కిసాన్ యోజన తోటి లబ్ధిదారులు గా ఉన్నారో వారిని పిఎమ్ జీవన్ జ్యోతి ఇన్శోరన్స్ మరియు పిఎమ్ జీవన్ సురక్ష ఇన్శోరన్స్ స్కీముల తోనూ లంకె పెట్టడం జరుగుతున్నది.  ఇలా చేయడం వల్ల రైతుల కు కష్ట కాలాల్లో 2 లక్షల రూపాయల వరకు బీమా మొత్తాని కి పూచీ లభిస్తుంది.

మిత్రులారా,

ఇటీవలే, ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కు సంబంధించినటువంటి మరొక ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకొంది.  ఇప్పుడు ఈ పథకంలో చేరడాన్ని స్వచ్ఛందం గా మార్చడమైంది.  ఇదివరకు, బ్యాంకు నుండి రుణాల ను తీసుకొన్న రైతులు ఇందులో చేరవలసి ఉండేది, కానీ ఇక ఇది రైతు యొక్క ఇష్టానిష్టాల పైన ఆధారపడుతుంది.  ఇప్పుడు, వారు చేరాలి అని అనుకొంటే, అటువంటప్పుడు వారు చేరవచ్చును; ఒకవేళ వారు చేరాలి అని అనుకోకపోయినట్లయితే, అటువంటప్పుడు వారు దీని లో చేరకుండానే ఉండిపోవచ్చును.  ఈ నిర్ణయం కూడాను ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే ఈ పథకం లో వారంతట వారు గా వచ్చి చేరుతున్నటువంటి రైతుల సంఖ్య ఎడతెగకుండా పెరుగుతూంది.

ఈ పథకాని కి ముడి పెట్టడం మరో రకం గా కూడాను లాభదాయకంగానే ఉంది. అది ఎలాగంటే 13,000 కోట్ల రూపాయల ప్రీమియమ్ కట్టిన రైతుల కు మూడు సంవత్సరాల లో 56,000 కోట్ల రూపాయల క్లెయిము మొత్తాన్ని ఇవ్వడమైంది.  అంటే, సంకట కాలాల్లో ఈ పథకం రైతుల కు ఒక వరప్రసాదం వంటిది అన్న మాట.

మిత్రులారా,

ఈ సంవత్సరపు బడ్జెటు లో రైతుల కు ప్రయోజనకారి కాగల అనేక ముఖ్యమైన నిర్ణయాల ను సైతం తీసుకోవడం జరిగింది.  రైతుల ఆదాయం వృద్ధి చెందేందుకు గాను ఒక 16 అంశాల కార్యక్రమాన్ని సిద్ధం చేయడమైంది.

పల్లెల లో నిలవల కోసమని ఆధునిక గిడ్డంగుల ను, పంచాయతి స్థాయి లో శీతల గిడ్డంగుల ను నిర్మించడానికి మరియు పశువుల కు తగినంత మేత అందేటట్టు చూడటం కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక కు రూపకల్పన చేయడమైంది.

దీనికి అదనం గా, రైతుల వద్ద నుండి కాయగూరలు పండ్లు, పాలు మరియు చేపల వంటి త్వరగా పాడయిపోయే వస్తువులను, పశు పాలకుల ను సురక్షితం గా విపణుల కు రవాణా చేయడానికి గాను కిసాన్ రైల్ వంటి సదుపాయాల ను కూడా ప్రకటించడమైంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

గ్రామీణ బజారుల ను లేదా స్థానిక పల్లె మండీల ను టోకు బజారుల తోను, ప్రపంచ విపణుల తోను జోడించడం కూడా మన దేశం లో అవసరంగానే ఉంది.  దీనికోసం, ప్రభుత్వం గ్రామ ప్రాంతాల రిటైల్ అగ్రికల్చర్ మార్కెట్టు ను విస్తరించే అంశం పైన కసరత్తు చేస్తున్నది.  దేశం లోని 22,000 గ్రామీణ రూరల్ హాట్ లలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం జరుగుతున్నది.  రైతు ను దేశం లోని ఏ బజారు తో అయినా జత పరచేటటువంటి ఒక వ్యవస్థ ను- ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రం నుండి కొన్ని కిలోమీటర్ల పరిధి లోనే- ఏర్పరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.   రాబోయే కాలాల్లో, ఈ రూరల్ హాట్ లు వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థ తాలూకు నూతన కేంద్రాలు గా రూపొందుతాయి.  ఈ కారణం గానే గ్రామీణ ప్రాంతాల లోని అంగళ్ల ను పెద్ద సంతల తో, ఉదాహరణ కు ఎపిఎమ్ సి వంటి వాటి తో జోడించడం జరుగుతున్నది; ఆ పైన ప్రపంచ వ్యాప్త విపణి తో జత కలపడం జరుగుతుంది.  మన రైతులు వారి పంటల ను విక్రయించడం కోసం సుదూర ప్రాంతానికి వెళ్లే అవసరం తల ఎత్తకూడదన్నదే ఆలోచన గా ఉన్నది.  ఈ యొక్క కృషి ఫలితం గా ఉత్తర్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తం గా వేలాది గా ఉన్నటువంటి రూరల్ హాట్ లను ఎపిఎమ్ సి తో, ఇ- ఎన్ఎఎం (e-NAM)తో సంధానించే పని జరుగుతోంది.

ఈ ఇ- ఎన్ఎఎం వేదిక, అంటే రాష్ట్రీయ మండీ లో రైతులు వారి దిగుబడులను దేశం లో ఎక్కడి నుండయినా మొబైల్ ఫోన్ లు లేదా కంప్యూటర్ ల మాధ్యమాల ద్వారా విక్రయించగలగడం అనే పద్ధతి నానాటి కి బహుళ ఆదరణ కు నోచుకొంటున్నది.  యు పి లోనూ, 100 కు పైగా మండీల ను ఈ వేదిక కు జతచేయడమైంది.  ఇంత వరకు, యావత్తు దేశం లో దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు ఈ జాతీయ విపణి లో వ్యాపారం చోటు చేసుకొంది.  రైతులు సాంకేతిక విజ్ఞానం సహాయం తో ఒక లక్ష కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించారు. 

మిత్రులారా, 

ఐకమత్యమే బలం.  మరి ఈ యొక్క సామూహిక శక్తి తో, రైతు లు సైతం సమృద్ధి దిశ గా ముందుకు కదులుతారు.   రైతుల ఉమ్మడి శక్తి ని ఇక మీదట వారు న్యాయమైన ధరల ను పొందడం కోసమని వినియోగించడం జరుగుతుంది.  ఈ రోజు న చిత్రకూట్ లో ప్రారంభించినటువంటి వినూత్నమైన ఫార్మర్ ప్రడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ ల) మాధ్యమం వెనుక కూడాను ఇదే ఆలోచన ప్రాతిపదిక గా ఉన్నది.  ఇవి ప్రత్యేకించి దేశం లో పెద్ద సంఖ్య లో గల చిన్న రైతులు మరియు సన్నకారు రైతుల హితం కోసం ఉద్దేశించినటువంటివి.  ఎప్పుడైతే కేవలం ఒక రైతు పరివారాని కి బదులు గా, గ్రామం లోని అనేక మంది రైతులు విత్తనం గింజలు మొదలుకొని విపణి ఏర్పాటు ల వరకు కూడాను ఒక్కటి గా చేరి ముందుకు సాగుతారో, అదుగో అప్పుడు వారి సామర్థ్యం తప్పక పెరిగి తీరుతుంది.

ఇప్పుడు, గ్రామం లోని రైతుల తాలూకు ఒక పెద్ద సమూహం కలసికట్టుగా పోయి ఎరువులు కొనుగోలు చేసి మరి వాటిని తిరిగి గ్రామాని కి చేరవేసుకొంటారో, అప్పుడు ఎంత డబ్బు ఆదా అవుతుందనేది ఊహించండి.  ఇదే విధం గా, భారీ ఎత్తున సరకులను కొనుగోలు చేస్తే గనక ధర లో తగ్గింపులు కూడా లభిస్తాయి.  పంట లు కోత కు వచ్చాయీ అంటే, వాటి ని బజారు కు తీసుకుపోవలసి వచ్చినప్పుడు, అప్పుడు సైతం మీ యొక్క సాముదాయికత మరింత ఉపయోగకరం గా ఉండగలదు. మీరు బజారు లోని వ్యాపారి తో మరింత ప్రభావవంతమైన రీతి లో మాటలు ఆడుకొని మరియు మెరుగైన విధం గా సంప్రతించగలుగుతారు. 

సోదరులు మరియు సోదరీమణులారా,

గడచిన కొన్ని సంవత్సరాల లో, ఈ యొక్క ఎఫ్ పిఒ లు విస్తరింపబడ్డాయి.  అవి సాధించినటువంటి విజయాలే అందుకు కారణం అయ్యాయి.  ఈ యొక్క రైతుల మరియు ఉత్పత్తిదారుల సమూహాల ద్వారా వ్యవసాయ ఉత్పాదన ల యొక్క ఎగుమతి కి కూడాను సమగ్రమైనటువంటి మౌలిక సదుపాయాల యొక్క కల్పన కు రంగం సిద్ధం చేయడం జరుగుతున్నది.  ఇప్పుడు ఖర్చు తక్కువ రకం బంగాళాదుంపలు గాని లేదా ఇతర అటవీ ఉత్పాదనలు గాని ఉనికి లోకి వచ్చాయి.  అయితే ఈ బంగాళాదుంపల ను తునకలు గా మార్చి వాటిని శుద్ధి చేసి చక్కనైన ప్యాకేజింగు తో బజారుల లోకి తీసుకు వచ్చినట్లు అయితే కనుక అప్పుడు అది  మరింత అధిక ధర ను తెచ్చిపెడుతుంది. ఈ ఎఫ్ పిఒ ల ద్వారా ఇదే విధమైనటువంటి పరిశ్రమల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.  అలాగే భారత ప్రభుత్వం ప్రతి ఒక్క ఎఫ్ పిఒ కు 15 లక్షల రూపాయల వరకు సహాయాన్ని సమకూర్చేందుకు ఒక ఏర్పాటు ను కూడా చేసింది.  యోగి గారి ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాన్ని ప్రారంభించడం తోనే, ఈ సంస్థ లు కూడా దాని తో అనుబంధితం అవుతున్నాయి.  ప్రభుత్వం సైతం ఆదివాసీ ప్రాంతాల లోను మరియు చిత్రకూట్ వంటి దేశం లోని 100కు పైగా ఆకాంక్షభరిత జిల్లాల లోను ఇటువంటి సంస్థలను మరిన్నిటిని ప్రోత్సహించాలని నిర్ణయించింది; ప్రతి ఒక్క బ్లాకు లో కనీసం ఒక ఎఫ్ పిఒ ను ఏర్పాటు చేయడం తథ్యం.  ఈ చర్య ద్వారా ఆదివాసీ ప్రాంతాల లో అటవీ ఉత్పత్తి కి విలువ ను  జోడించడాని కి ఊతం లభిస్తుంది.  ఈ సంస్థల లో మరింత మంది సోదరీమణులు చేరే దిశ గా ప్రయత్నాలు  జరుగుతున్నాయి.

ప్రస్తుతం అక్కడ తక్కువ ధర కు లభ్యం అయ్యే బంగాళాదుంపలు గాని లేదా ఇతర అటవీ ఉత్పత్తులు గాని ఉన్నాయి.  అయితే ఈ బంగాళాదుంపల ను తునకలు (చిప్స్)గా మార్చివేసి మరి చక్కనైన ప్యాకేజిల రూపం లో బజారుల కు తీసుకువచ్చినట్లయితే గనక, అప్పుడు ఈ ప్రక్రియ తో మరింత ధర ను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్ పిఒ ల ద్వారా ఇదే తరహా పరిశ్రమల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.  ప్రతి ఒక్క ఎఫ్ పిఒ కు 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించే ఒక ఏర్పాటు ను కూడా భారత ప్రభుత్వం చేసింది.  యోగి గారి ప్రభుత్వం ఒక- జిల్లా- ఒక – ఉత్పత్తి పథకాన్ని ప్రారంభించడం తోనే, ఈ సంస్థ లు కూడాను దీని తో అనుబంధితం కావడం జరుగుతున్నది.  ప్రభుత్వం సైతం ఆదివాసీ ప్రాంతాల లోను , అలాగే చిత్రకూట్ మాదిరిగానే దేశం లో 100కు పైగా ఆకాంక్షభరిత జిల్లాల లోను మరిన్ని ఎఫ్ పిఒ లను ప్రోత్సహించాలని నిర్ణయించింది; కనీసం ప్రతి బ్లాకు లో కనీసం ఒక ఎఫ్ పిఒ ను అయినా ఏర్పాటు చేసి తీరాలి.  ఇది ఆదివాసీ ప్రాంతాల లో అటవీ ఉత్పత్తి కి విలువ జోడింపునకు ఊతాన్ని ఇస్తుంది.  ఈ సంస్థల లో సోదరీమణులు మరింత ఎక్కువ మంది చేరేటట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మిత్రులారా,

బుందేల్ ఖండ్ తో పాటు యావత్తు భారతదేశాని కి విస్తృతమైనటువంటి లబ్ధి ని చేకూర్చగల మరియొక ప్రచార ఉద్యమమే జల్ జీవన్ మిశన్.   ప్రస్తుతం దేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశాన్ని జలమయం కాకుండాను మరియు దుర్భిక్ష పరిస్థితుల నుండి విముక్తం చేయాలన్న ఒక సంకల్పం తో ముందుకు కదులుతున్నారు.  రాబోయే 5 సంవత్సరాల కాలం లో దేశం లో దాదాపు 15 కోట్ల కుటుంబాల కు శుద్ధమైనటువంటి త్రాగునీటి ని అందించేందుకు అవసరమైన పనులు మొదలయ్యాయి.  ఇందులో కూడాను, ఆకాంక్షభరిత జిల్లాల కు ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరుగుతున్నది.  ఇది ఎటువంటి పథకం అంటే దీని ని సాకారం చేయడానికి గాను మీరంతా, ప్రతి ఒక్క పల్లె పాలుపంచుకొనే తీరాలన్నమాట.  ప్రభుత్వం మీకు డబ్బు ను ఇస్తుంది; ప్రభుత్వం మీకు నిధుల ను ఇస్తుంది, అయితే పనిని చేయవలసింది మాత్రం మీరే.  గొట్టాల ను ఎక్కడెక్కడ వేయాలి, నీటి ని ఎక్కడెక్కడ సేకరించాలి అలాగే వాటి ని ఆ జలాల వినియోగాన్ని ఎలాగ నిర్వహించుకోవాలి అనేవి పల్లె వాసులు అందరూ కలసి నిర్ణయించాలి.  ఈ అంశాల లో మన సోదరీమణులు ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతారు.  ఇదే స్వావలంబన, ఇది పల్లె యొక్క సాధికారిత తాలూకు స్ఫూర్తి, ఇదే గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యం; మరి ఈ ప్రయోజనం కోసమే నానా జీ తన జీవనాన్ని అర్పణం చేశారు.

మిత్రులారా,

ఉత్తర్ ప్రదేశ్ రైతుల అభివృద్ధి మరియు వ్యాపారుల, ఇంకా నవ పారిశ్రామికుల యొక్క శీఘ్ర వృద్ధి కూడాను ఇక్కడి సంధానం పైన ఆధారపడివుంది.  దీనికోసం, యోగి గారు మరియు ఆయన యొక్క ప్రభుత్వం ఒక ‘ఎక్స్ ప్రెస్’ వేగం తో కృషి చేస్తోంది.  అది బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కావచ్చు, లేదా పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే కావచ్చు, లేదా ప్రతిపాదిత గంగా ఎక్స్ ప్రెస్ వే కావచ్చు.. అవి యుపి లో సంధానాన్ని పెంచడమొక్కటే కాకుండా, అనేక ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పించనున్నది.  ఇంతకు పూర్వం, ఢిల్లీ మరియు ముంబయి ల వంటి పెద్ద నగరాల లో మాత్రమే ఎక్స్ ప్రెస్ వే లు కనుపిస్తూవుండేవి, కానీ ఇప్పుడు చిత్రకూట్, బాందా, మహోబా, హమీర్ పుర్, జాలౌన్, ఔరైయ్యా ల ప్రజలు కూడాను ఆధునికమైనటువంటి ఎక్స్ ప్రెస్ వే ల మీద సాగిపోవచ్చును.  దగ్గర దగ్గరగా 300 కిలోమీటర్ల మేరకు ఉండేటటువంటి ఈ ఆధునికమైనటువంటి రహదారి సిద్ధం అయ్యిందీ అంటే గనక, అప్పుడు మీరు చాలా కొద్ది కాలం లోనే లఖ్ నవూ కు మరియు ఢిల్లీ కి చేరుకోగలుగుతారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ అధునాతనమైన మౌలిక సదుపాయాలు  క్రొత్త పరిశ్రమల ను మరియు క్రొత్త వాణిజ్య వ్యవస్థల ను ఇక్కడ కు తీసుకు వస్తాయి.  క్రిందటి సంవత్సరం ఫిబ్రవరి లో, యుపి డిఫెన్స్ కారిడోర్ కు పునాదిరాయి ని వేయడానికి నేను ఝాన్సీ కి వచ్చాను మరి ఈ సంవత్సరం లో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాపన చేయడం జరుగుతున్నది; ఇది ఒక యాదృచ్ఛిక సంఘటన గా ఉంది.  యుపి డిఫెన్స్ కారిడోర్ కోసం ఈ  సంవత్సరం బడ్జెటు లో 3700 కోట్ల రూపాయల ను సర్దుబాటు చేయడం జరిగింది.  ఈ రెండు పథకాలు ఒక దాని తో మరొకటి సన్నిహిత సంబంధాన్ని కలిగివున్నాయి.  బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ద్వారా యుపి డిఫెన్స్ కారిడోర్ సైతం వేగగతి ని పుంజుకోబోతోంది.

మిత్రులారా,

ఒకానొక కాలం లో, భారతదేశ స్వాతంత్ర్య సాధన వేళ, ఈ ప్రాంతం విప్లవకారుల ను అందిస్తూవచ్చింది.  మరి భవిష్యత్తు కాలం లో, ఈ ప్రాంతం రక్షణ రంగ సామగ్రి లో భారతదేశాన్ని స్వయం సమృద్ధం గా మార్చే ప్రదేశం గా కూడాను పేరు తెచ్చుకొంటుంది.  ఈ బుందేల్ ఖండ్ ప్రాంతం మేక్ ఇన్ ఇండియా తాలూకు ఒక భారీ కేంద్రం గా మారనున్నది.  ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువుల ను ప్రపంచం అంతటికీ ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది.  ఎప్పుడయితే పెద్ద కర్మాగారాలు ఇక్కడ ఏర్పాటు కావడం మొదలవుతుందో, అప్పుడు సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు కూడాను విస్తారమైన ప్రయోజనాల ను పొందగలుగుతాయి.  ఇక్కడి రైతులు సైతం లబ్ధి ని పొందుతారు.  ఈ విధం గా ఇక్కడ ఇదివరకు ఎరుగనటువంటి ఉద్యోగ అవకాశాల కల్పన కు వీలు ఏర్పడుతుంది మరి ప్రతి ఒక్క కుటుంబం తాలూకు ఆదాయం వృద్ధి చెందుతుంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఆధునిక మౌలిక సదుపాయాలు ఇక్కడి పర్యటక పరిశ్రమ కు మరీముఖ్యంగా ప్రయోజనకారి కానున్నాయి.  చిత్రకూట్ లో ప్రాకృతిక శోభ కూడా నెలకొన్నది.  అంతేకాక ఇది గాఢమైనటువంటి ఆధ్యాత్మికత కు నిలయం కూడాను.  భగవాన్ శ్రీరామచంద్రుడు తన చరణాల ను ఉంచిన చోటులన్నిటా ఆయా ప్రదేశాల ను ప్రస్తుతం సంధానించడం జరుగుతున్నది;  మరి వాటి ని ఒక ‘రామాయణ వలయం’గా తీర్చిదిద్దడం జరుగుతోంది. రాబోయే రోజుల లో, ఇక్కడి మౌలిక సదుపాయాలు మరింత గా అభివృద్ధి చెందినప్పుడు, అప్పుడు భక్తజనుల రాక పోక లు కూడా ను పెరుగుతాయి; ఇక్కడి యువతీయువకుల కు క్రొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి.  

చిత్రకూట్ నుండి, బుందేల్ ఖండ్ నుండి, యావత్తు ఉత్తర్ ప్రదేశ్ యొక్క మరియు యావద్భారతదేశం యొక్క ఆకాంక్ష లు శీఘ్రమైనటువంటి వేగ గతి ని అందుకొంటాయన్న నమ్మకం నాలో ఉంది.  ఈ యొక్క మంగళప్రదమైనటువంటి తపోభూమి మరియు దీని యొక్క కీర్తి ఒక న్యూ ఇండియా యొక్క స్వప్నాల తాలూకు ఓ ముఖ్య  కేంద్రం అవును గాక!  ఈ ఆకాంక్ష తో, అభివృద్ధి పథకాలకు  గాను ఈ ప్రాంత ప్రజలందరికి మరియు మీకు అందరికి ఇవే నా అభినందనలు.   నేను నా యొక్క రైతు సోదరుల కు మరియు నా రైతు సోదరీమణుల కు అనేకానేక శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.  ఇక బుందేల్ ఖండ్ ఒక్క తన విధి ని మాత్రమే కాకుండా భారతదేశం యొక్క విధి ని కూడాను మార్చివేయడానికి సన్నద్ధం అవుతున్నది!                                                                                  

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

జయ్ జవాన్ జయ్ కిసాన్

జయ్ జవాన్ జయ్ కిసాన్

డిఫెన్స్ కారిడోర్ – జయ్ జవాన్.

ఎఫ్ పిఒ స్ యొక్క ఆరంభం – జయ్ కిసాన్.

జయ్ జవాన్ జయ్ కిసాన్ మంత్రం తో బుందేల్ ఖండ్ ను పురోగమించనివ్వండి.  మీకు అందరికీ శుభాకాంక్షల తో –
ఇవే అనేకానేక ధన్యవాదాలు.

**