Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని కుశీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం గా ప్రకటించడానికి తెలిపిన మంత్రిమండలి


ఉత్తర్ ప్రదేశ్ లో గల కుశీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం గా ప్రకటించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

కుశీనగర్ విమానాశ్రయం శ్రావస్తి, కపిలవస్తు, లుమ్బినీ వంటి అనేక బౌద్ధ సాంస్కృతిక స్థలాల కు సమీపం లో ఉన్నది. కుశీనగర్ కూడా ఒక బౌద్ధ సాంస్కృతిక స్థలమే. మరి దీని ని ఒక ‘‘అంతర్జాతీయ విమానాశ్రయం’’ గా ప్రకటిస్తే వాయుమార్గ ప్రయాణికుల కు సంధానం మెరుగవడం తో పాటు స్పర్ధాత్మక రీతి వ్యయాల తాలూకు అవకాశాలు కూడా అధికం కాగలవు. అది దేశీయ/అంతర్జాతీయ పర్యటన ఇంకా ప్రాంతాల యొక్క ఆర్థిక అభివృద్ధి కి ఊతాన్ని అందించగలుగుతుంది. అంతర్జాతీయ సరిహద్దు కు బాగా దగ్గరగా ఉన్న కారణంగా ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి స్థానం కూడా కాగలదు.

కుశీనగర్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఈశాన్య ప్రాంతం లో నెలకొంది. ఇది గోరఖ్ పుర్ నుండి రమారమి 50 కి.మీ. తూర్పు దిశ లో ఉంది. ప్రముఖ బౌద్ధ తీర్థయాత్రాస్థలాల లో ఒకటి గా కూడా కుశీనగర్ పేరు తెచ్చుకొంది.

**