ఉత్తరాఖండ్ లోని హార్సిల్ లో ట్రెక్, బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ… అనంతరం శీతాకాల పర్యాటక కార్యక్రమంలో పాల్గొన్నారు. మఖ్వా ప్రాంతంలోని శీతాకాలపు గంగామాత దర్శన ప్రాంతాన్ని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనా గ్రామంలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారని, ఇది బాధిత కుటుంబాలకు మనోనిబ్బరాన్ని అందిస్తుందని అన్నారు.
“దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉన్నది. చార్ ధామ్ సహా అసంఖ్యాకమైన పవిత్ర ప్రాంతాలు ఇక్కడున్నాయి” అని ప్రధానమంత్రి అన్నారు. జీవదాయిని అయిన గంగమ్మకు శీతాకాల నివాసంగా ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. మరోసారి ఉత్తరాఖండ్ ను సందర్శించి ఇక్కడి ప్రజలను, వారి కుటుంబాలను కలుసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గంగమ్మ దయ వల్లే ఇది సాధ్యపడిందన్నారు. దశాబ్దాలుగా ఉత్తరాఖండ్ కు సేవలందించే భాగ్యం తనకు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గంగమ్మే తనను పిలిపించుకున్నదంటూ కాశీలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ.. “గంగమ్మ ఆశీస్సులే నన్ను కాశీకి నడిపించాయి. అక్కడ నేనిప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను” అని శ్రీ మోదీ అన్నారు. అయితే ఆ నదీమతల్లి తనవాడిగా సొంతం చేసుకున్నదని ఇప్పుడే తెలిసిందన్నారు. గంగా మాతకు ఈ బిడ్డపై ఉన్న ప్రేమాభిమానాల వల్లే తన తల్లిగారి ఇల్లయిన మఖ్వా గ్రామానికి వచ్చి.. ముఖీమఠ్– మఖ్వాను దర్శించుకుని పూజ చేసే భాగ్యాన్ని ప్రసాదించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తాను ‘దీదీ–భులియాస్’ అని పిలుచుకునే హార్సిల్ మహిళలు తనపై ఎంతో ఆప్యాయతను కనబరిచారంటూ ఆ ప్రాంతంలో పర్యటన సందర్భంగా తన అనుభవాలను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. హార్సిల్ రాజ్మా, ఇతర స్థానిక ఉత్పత్తులను ఇచ్చి తనపై ఆత్మీయ భావాన్ని చూపారన్నారు. వారి ఆప్యాయత, అనుబంధం, బహుమతుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
బాబా కేదార్ నాథ్ ను సందర్శించిన సమయంలో ‘‘ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దే’’ అని ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. బాబా కేదార్ నాథే ఆ మాట చెప్పే శక్తిని తనకు ప్రసాదించారని వ్యాఖ్యానించారు. బాబా కేదార్ నాథ్ ఆశీస్సులతో ఈ లక్ష్యం క్రమంగా సాకారమవుతోందన్నారు. ఉత్తరాఖండ్ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయని, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. నిరంతర విజయాలు, కొత్త లక్ష్యాలను సాకారం చేసుకోవడం ద్వారా ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం చేసిన వాగ్దానాలు నిజమవుతున్నాయని పేర్కొన్నారు. “శీతాకాల పర్యాటకం ఈ దిశగా పడిన తొలి అడుగు. ఉత్తరాఖండ్ ఆర్థిక సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఇది దోహదపడుతుంది’’ అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. రాష్ట్రం పురోగమించాలని ఆకాంక్షించారు.
“పర్యాటకాన్ని బహుముఖీనంగా విస్తరించడం, ఆ రంగంలో ఏడాది పొడవునా కార్యకలాపాలు జరిగేలా చూడడం ఉత్తరాఖండ్ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన, అత్యావశ్యకమైన అంశం’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ పర్యాటకంలో విరామ కాలమంటూ ఉండొద్దని, ప్రతి రుతువులోనూ పర్యాటక రంగం పురోగమించాలని సూచించారు. కొండల్లో పర్యాటకం ఈ కాలానికి అనువైనదనీ.. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందనీ ఆయన పేర్కొన్నారు. అయితే తర్వాతి కాలంలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ శీతాకాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి గృహాలు ఖాళీగా ఉంటున్నాయని చెప్పారు. ఈ అసమతౌల్యం వల్ల ఉత్తరాఖండ్ లోని చాలా ప్రాంతాల్లో అనేక రోజులపాటు ఆర్థిక స్తబ్ధత ఆవరిస్తోందని, పర్యావరణపరమైన సవాళ్లూ ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
“శీతాకాలంలో ఉత్తరాఖండ్ సందర్శన ద్వారా ఈ దేవభూమి దివ్య తేజస్సును స్పష్టంగా ఆస్వాదించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ట్రెక్కింగ్, స్కీయింగ్ వంటివి శీతాకాలంలో మరింత ఉల్లాసాన్నిస్తాయని ప్రముఖంగా పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక యాత్రలకు శీతాకాలం ప్రత్యేకమైనదని, అనేక పవిత్ర క్షేత్రాల్లో ఈ సమయంలో ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తారని చెప్పారు. మఖ్వా గ్రామంలోని ఆధ్యాత్మిక వేడుక ఈ ప్రాంత ప్రాచీన, అద్భుత సంప్రదాయాలలో అంతర్భాగమన్నారు. ఏడాది పొడవునా పర్యాటకం దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సంకల్పం.. ప్రజలకు ఆధ్యాత్మిక అనుభవాలను పొందే అవకాశాన్నిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, ఇది స్థానిక ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాఖండ్ యువతకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.
‘‘ఉత్తరాఖండ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థిలనూ తట్టుకునేలా చార్ ధామ్ రహదారి, ఆధునిక ఎక్స్ ప్రెస్ మార్గాలు, రాష్ట్రంలో రైల్వేలు, వాయు రవాణా, హెలికాప్టర్ సేవల విస్తరణ సహా గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేదారనాథ్ రోప్ వే ప్రాజెక్టు, హేమకుండ్ రోప్ వే ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోదించిందని తెలిపారు. కేదారనాథ్ రోప్ వే ప్రయాణ సమయాన్ని 8-9 గంటల నుంచి దాదాపు 30 నిమిషాలకు తగ్గిస్తుందని చెప్పారు. ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుందనీ.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు ప్రయాణ ఇబ్బందులను తొలగిస్తుందనీ అన్నారు. ఈ రోప్ వే ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు శ్రీ మోదీ తెలిపారు. ఈ విప్లవాత్మక కార్యక్రమాలపట్ల ఉత్తరాఖండ్ తో పాటు యావత్ దేశానికీ ఆయన అభినందనలు తెలిపారు.
కొండ ప్రాంతాల్లో పర్యావరణ హితమైన దుంగలతో నిర్మించిన ఆవాస (ఎకో లాగ్ హట్) సదుపాయాలు, సమావేశ కేంద్రాలు, హెలిప్యాడ్ మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. టిమ్మర్ సైన్ మహాదేవ్, మనా గ్రామం, జాడంగ్ గ్రామం వంటి ప్రదేశాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలను కొత్తగా అభివృద్ధి చేస్తున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు. 1962 నాటికి ఖాళీగా ఉన్న మనా, జాదుంగ్ గ్రామాలను పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఫలితంగా ఉత్తరాఖండ్ ను సందర్శించే పర్యాటకుల సంఖ్య గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగిందని శ్రీ మోదీ చెప్పారు. చార్ ధామ్ యాత్రకు హాజరయ్యేవారి సంఖ్య 2014కు ముందు ఏటా సగటున 18 లక్షలుగా ఉండేదని, ఆ సంఖ్య ఇప్పుడు 50 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది బడ్జెటులో 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేటాయింపులు చేశామని, ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలుగా హోటళ్లను అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమం పర్యాటకులకు మెరుగైన సదుపాయాలను అందిస్తుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తుందని పునరుద్ఘాటించారు.
डबल इंजन सरकार में डबल गति से जारी विकास कार्यों से साफ है कि ये दशक उत्तराखंड का दशक है। आज देवभूमि के हर्षिल में अपने परिवारजनों से मिलकर अत्यंत हर्षित हूं। https://t.co/SLFidzuX2Y
— Narendra Modi (@narendramodi) March 6, 2025
Blessed to be in Devbhoomi Uttarakhand once again: PM @narendramodi in Harsil pic.twitter.com/O6O5Ef2rUK
— PMO India (@PMOIndia) March 6, 2025
This decade is becoming the decade of Uttarakhand: PM @narendramodi pic.twitter.com/dfL6zq4Exv
— PMO India (@PMOIndia) March 6, 2025
अपने टूरिज्म सेक्टर को diversify करना…बारहमासी बनाना…उत्तराखंड के लिए बहुत जरूरी है: PM @narendramodi pic.twitter.com/9yqpJ6Q1dq
— PMO India (@PMOIndia) March 6, 2025
उत्तराखंड को विकसित राज्य बनाने के लिए हमारी डबल इंजन की सरकार मिलकर काम कर रही हैं: PM @narendramodi pic.twitter.com/Pwy70l7VnX
— PMO India (@PMOIndia) March 6, 2025
***
MJPS/SR
डबल इंजन सरकार में डबल गति से जारी विकास कार्यों से साफ है कि ये दशक उत्तराखंड का दशक है। आज देवभूमि के हर्षिल में अपने परिवारजनों से मिलकर अत्यंत हर्षित हूं। https://t.co/SLFidzuX2Y
— Narendra Modi (@narendramodi) March 6, 2025
Blessed to be in Devbhoomi Uttarakhand once again: PM @narendramodi in Harsil pic.twitter.com/O6O5Ef2rUK
— PMO India (@PMOIndia) March 6, 2025
This decade is becoming the decade of Uttarakhand: PM @narendramodi pic.twitter.com/dfL6zq4Exv
— PMO India (@PMOIndia) March 6, 2025
अपने टूरिज्म सेक्टर को diversify करना...बारहमासी बनाना...उत्तराखंड के लिए बहुत जरूरी है: PM @narendramodi pic.twitter.com/9yqpJ6Q1dq
— PMO India (@PMOIndia) March 6, 2025
उत्तराखंड को विकसित राज्य बनाने के लिए हमारी डबल इंजन की सरकार मिलकर काम कर रही हैं: PM @narendramodi pic.twitter.com/Pwy70l7VnX
— PMO India (@PMOIndia) March 6, 2025
मां गंगा की कृपा से ही मुझे दशकों तक आध्यात्मिक ऊर्जा से ओतप्रोत उत्तराखंड की सेवा का सौभाग्य मिला है। यह मां गंगा का दुलार और स्नेह ही है कि आज मुझे उनके मायके मुखवा आने का सुअवसर प्राप्त हुआ है। pic.twitter.com/yd3DyvjMCX
— Narendra Modi (@narendramodi) March 6, 2025
बाबा केदार के आशीर्वाद से उत्तराखंड नित-नई सफलताओं और नए लक्ष्यों की ओर बढ़ते हुए विकास के अपने संकल्प को साकार कर रहा है। शीतकालीन पर्यटन इस दिशा में एक और बड़ा कदम है। pic.twitter.com/W0jT5Ap7H2
— Narendra Modi (@narendramodi) March 6, 2025
मुझे विश्वास है कि डबल इंजन सरकार के प्रयासों से उत्तराखंड में कोई भी सीजन ऑफ सीजन नहीं रहेगा और हर सीजन में यहां टूरिज्म ऑन रहेगा। pic.twitter.com/PMQClVJGrE
— Narendra Modi (@narendramodi) March 6, 2025
टूरिज्म हो या फिर डेस्टिनेशन वेडिंग, देवभूमि से देशवासियों विशेषकर हमारी युवा पीढ़ी से मेरा यह आग्रह… pic.twitter.com/GgRVxsVi1K
— Narendra Modi (@narendramodi) March 6, 2025