Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’  ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ లో గల ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో జరుగుతున్న ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించడం తో పాటు, గ్రౌండ్ బ్రేకింగ్ వాల్ ను కూడా ఆవిష్కరించారు. సశక్త్ ఉత్తరాఖండ్ ను మరియు బ్రాండ్ హౌస్ ఆఫ్ హిమాలయాస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. శాంతి నుండి సమృద్ధిఅనేది ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం గా ఉంది.

 

 

ఈ సందర్భం లో పరిశ్రమ రంగ ప్రముఖులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అడానీ గ్రూపు డైరెక్టరు మరియు మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ప్రణవ్ అడానీ మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ప్రైవేటు రంగం సంబంధి పెట్టుబడికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల లో ఒక గమ్యస్థానం గా మారింది అన్నారు. దీనికి కారణం ఇటీవలి కాలాల్లో వృద్ధి మరియు అభివృద్ధి ల పట్ల రాష్ట్రం అనుసరిస్తున్న విధానమే అని ఆయన అన్నారు. ఈ విధానం లో భాగం గా ఏక సూత్ర ఆమోదాలు, స్పర్థాత్మకమైనటువంటి భూమి ధరలు, తక్కువ ఖర్చు లో విద్యుత్తు లభ్యత మరియు సమర్థమైన పంపిణీ వ్యవస్థ, ఉన్నత నైపుణ్యాలు సొంతం చేసుకొన్న శ్రమ శక్తి లతో పాటు, జాతీయ రాజధాని కి సమీపం లో ఉండడం, ఇంకా చాలా భద్రమైన చట్టం మరియు సురక్ష వాతావరణం ఈ రాష్ట్రం కలిగి ఉంది అని ఆయన వివరించారు. రాష్ట్రం లో తమ సంస్థ కార్యకలాపాల ను విస్తరించే దిశ లో తాము సిద్ధం చేసిన ప్రణాళిక లు మరియు మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం గురించి శ్రీ అడానీ తెలియ జేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రాని కి అదే పనిగా ఇస్తున్న సమర్థన కు గాను ప్రధాన మంత్రి కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం లో ప్రజలు ఆయన అంటే అపూర్వమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అని శ్రీ అడానీ అన్నారు.

 

 

జెఎస్‌డబ్ల్యు చైర్ మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జన్ జిందల్ ఉత్తరాఖండ్ రాష్ట్రం తో ప్రధాన మంత్రి కి ఉన్న అనుబంధాన్ని గురించి ప్రత్యేకం గా ప్రస్తావించారు. కేదార్ నాథ్ మరియు బద్రీనాథ్ లలో అభివృద్ధి పథకాల విషయం లో ఈ సంగతి తన అనుభవం లోకి వచ్చింది అని శ్రీ జిందల్ తెలిపారు. దేశం యొక్క స్వరూపాన్ని మార్చివేసినట్లు ప్రధాన మంత్రి చేసిన ప్రయాసల ను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భం లో జిడిపి వృద్ధి ని గురించి ఆయన పేర్కొనడం తో పాటు, త్వరలో భారతదేశం ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారబోతోందని చెప్పారు. ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా అయ్యేందుకు భారతదేశం సాగిస్తున్న యాత్ర లో ప్రధాన మంత్రి యొక్క నాయకత్వాని కి శ్రీ జిందల్ ధన్యవాదాలు తెలియ జేశారు. దేశవ్యాప్తం గా తీర్థయాత్ర స్థలాల కు సంధానం సదుపాయాన్ని మెరుగు పరచడం అనే అంశం లో ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ లో సుమారు గా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని తీసుకు రావడం కోసం కంపెనీ ఒక ప్రణాళిక ను అమలు పరచనుందని, అంతేకాకుండా, ‘క్లీన్ కేదార్ నాథ్ ప్రాజెక్టును నవంబరు లోనే మొదలు పెట్టిందని కూడా ఆయన వివరించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందిస్తున్న సమర్థన కు గాను ఆయన ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానం లో కంపెనీ సమర్థన ను కొనసాగిస్తుంది అని ప్రధాన మంత్రి కి ఆయన హామీ ని ఇచ్చారు.

 

 

ఐటిసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ పురి జి-20 శిఖర సమ్మేళనం యొక్క సాఫల్యాన్ని గుర్తు కు తీసుకు వస్తూ, గ్లోబల్ సౌథ్ ఆశయాల సాధన కు ప్రధాన మంత్రి వకాల్తా పుచ్చుకోవడాన్ని, మరి అలాగే ప్రధాన మంత్రి యొక్క ప్రపంచ స్థాయి రాజకీయ కుశలత ను మెచ్చుకొన్నారు. గడచిన కొన్నేళ్ళలో ప్రయోజన పూర్వకమైనటువంటి విధాన సంబంధి కార్యక్రమాలు అనేకం తెర మీద కు రావడం తో, ప్రపంచం అనేక విధాలైన సవాళ్ళ తో సతమతం అవుతుంటే, భారతదేశం మాత్రం సానుకూల వాతావరణం లో ఉండగలిగింది అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ లో అనేక రంగాలు మార్పు చెందడం, మరి జిడిపి సంఖ్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అని ఆయన అన్నారు. నాయకత్వం కల్పించినటువంటి ఒక స్థితి ఏదైతే ఏర్పడిందో, తత్ఫలితం గా ప్రపంచం అంతటా చూసుకొంటే, ఈ దశాబ్దం భారతదేశాని కి చెందుతుంది అని కొందరు, అసలు ఈ శతాబ్దం భారతదేశానిదే అని కొందరు అంటున్నారు అని ఆయన అన్నారు.

 

 

 

పతంజలియొక్క వ్యవస్థాపకుడు మరియు యోగ గురువు శ్రీ బాబా రామ్‌దేవ్ తన ప్రసంగం లో ప్రధాన మంత్రి ని వికసిత్ భారత్యొక్క దార్శకుని గా పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన 140 కోట్ల మంది భారతదేశ పౌరులకే కాకుండా, ప్రపంచాని కి కూడా ఒక కుటుంబ సభ్యుడు అని శ్రీ బాబా రామ్‌దేవ్ అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ అనే ప్రధాన మంత్రి పెట్టుకొన్న లక్ష్యం గురించి శ్రీ బాబా రామ్‌దేవ్ ప్రముఖం గా ప్రకటించారు. ఈ దిశ లో పెట్టుబడుల ను తీసుకు రావడం తో పాటు, ఉద్యోగ అవకాశాల కల్పన లో పతంజలి అందిస్తున్న తోడ్పాటుల ను గురించి ఆయన ప్రస్తావించారు. రాబోయే కాలాల్లో 10,000 కోట్ల కు పైచిలుకు పెట్టుబడులు మరియు 10,000 కోట్ల కు మించిన ఉద్యోగాల కల్పన కు సంబంధించి ప్రధాన మంత్రి కి ఆయన హామీ ని ఇచ్చారు. ఒక న్యూ ఇండియాను ఆవిష్కరించడం లో ప్రధాన మంత్రి యొక్క దృఢ సంకల్పాన్ని మరియు ఇచ్ఛాశక్తి ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రం లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం లో ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయాసల ను కూడా శ్రీ బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు. రాష్ట్రం లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయవలసింది గా కార్పొరేట్ లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నాయకత్వం లో రాష్ట్రం లోని పర్యటన, వైద్యం, విద్య, వ్యవసాయం, సంధానం మరియుు మౌలిక సదుపాయాల రంగాల లో జరిగిన అభివృద్ధి ని కూడా ఆయన హర్షించారు. భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక ప్రబల శక్తి గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి సంకల్పాన్ని బలపరచాలని, అలాగే ఒక వికసిత్ భారత్లక్ష్యాన్ని సాధించాలని, ఇన్వెస్టర్ లకు శ్రీ బాబా రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు.

 

 

దేశం యొక్క అభివృద్ధి కోసం దిశ ను, దృష్టి కోణాన్ని మరియు ముందు చూపును అందిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను ఎమ్మార్ ఇండియా సిఇఒ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి వ్యక్తం చేశారు. ఒక వికసిత భారత్గా దేశం సాగిస్తున్న యాత్ర లో భాగం పంచుకోవడాని కి కార్పొరేట్ జగతి కంకణం కట్టుకొంటుంది అని ఆయన అన్నారు. భారతదేశం-యుఎఇ సంబంధాల లో క్రొత్త చైతన్యం చోటుచేసుకొందని కూడా ఆయన పేర్కొన్నారు. ఎమ్మార్ యొక్క ప్రధాన కేంద్రం ఉన్నది యుఎఇ లోనే. భారతదేశం పట్ల ప్రపంచం యొక్క దృక్పథం లో సకారాత్మకమైన పరివర్తన రావడాన్ని గురించి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి ప్రముఖం గా పేర్కొన్నారు. జిఎస్‌టి వంటి విధాన పరమైన సంస్కరణ లు అనేకం అమలయ్యాయని, మరి పారిశ్రామిక జగతి కి క్రొత్త క్రొత్త అవకాశాలు ఫిన్ టెక్ విప్లవం ద్వారా అందివస్తున్నాయని ఆయన అన్నారు.

 

 

టివిఎస్ సప్లయ్ చైన్ సొల్యూశన్స్ యొక్క చైర్ మన్ శ్రీ ఆర్. దినేశ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి యొక్క దూరదృష్టి యుక్త నాయకత్వం పట్ల తమ కంపెనీ యొక్క నిబద్ధత ను గురించి పునరుద్ఘాటించారు. ఉత్తరాఖండ్ యొక్క వృద్ధి గాథ లో తమ సంస్థ అందించిన తోడ్పాటుల ను గురించి ఆయన వివరించారు. టైర్ లు మరియు ఆటో కంపోనంట్స్ ల తయారీ విభాగాలు, ఇంకా లాజిస్టిక్స్ సంబంధి సేవలు మరియు ఆటో రంగం గురించి ఆయన కొన్ని ఉదాహరణల ను ఇచ్చారు. తయారీ రంగం లో మరియు గోదాము సామర్థ్యం విషయం లో అదనపు పెట్టుబడులు పరం గా కంపెనీ కి ఉన్న పథకాల ను గురించి ఆయన వెల్లడించారు. వీటి ద్వారా సంస్థ తాలూకు వివిధ కంపెనీల లో 7,000 లకు పైగా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది అని ఆయన వెల్లడించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల కు అనుగుణం గా ఆర్థిక సహాయ సంబంధి సమర్థన, ఇంకా అదనపు నైపుణ్యాల సాధన ల ద్వారా ఆటో మార్కెట్ రంగం లో సహ భాగస్వాముల తో కలసి ముందంజ వేసేందుకు తమ కంపెనీ సిద్ధం గా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఒక లక్ష మంది కి పైగా వ్యక్తుల కు కౌన్సెలింగ్ మరియు సమర్థన అందించడం కోసం 10 నమూనా కెరియర్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని సిఐఐ యొక్క అధ్యక్షుని హోదా లో ఆయన వాగ్ధానం చేశారు. ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ మరియు అడ్వాన్స్‌డ్ మేన్యుఫాక్చరింగ్ రంగాల లో 10,000 మంది కి శిక్షణ ను అందించగలిగిన సామర్థ్యం కలిగి ఉండే ఒక స్పెశాలిటీ మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోయే మొదటి రాష్ట్రం గా ఉత్తరాఖండ్ నిలువబోతోంది అని ఆయన తెలిపారు.