“నా వరకూ- సరిహద్దులోని ప్రతి గ్రామమూ దేశానికి మొదటి గ్రామమే”;
“21వ శతాబ్దపు ప్రగతిశీల భారతదేశానికి మన వారసత్వంపై
గర్వం.. అభివృద్ధికి వీలైనంత కృషి రెండు ప్రధాన స్తంభాలు”
“ఈ అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి కావడంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు హర్షిస్తారు”;
“శ్రమజీవులు దైవకార్యం చేస్తున్నారు… మీరు వారి సంరక్షణ బాధ్యత
చూడండి… వారిని కూలిపని చేసే కార్మికులుగా పరిగణించకండి”;
“ఈ పుణ్యక్షేత్రాల శిథిలావస్థ బానిస మనస్తత్వానికి విస్పష్ట సంకేతం”;
“నేడు కాశీ.. ఉజ్జయిని.. అయోధ్య వంటి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు
కోల్పోయిన తమ ప్రతిష్టను.. వారసత్వాన్ని తిరిగి పొందుతున్నాయి”;
“స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు మీ ప్రయాణ బడ్జెట్‌లో 5 శాతం కేటాయించండి”;
“పర్వతప్రాంత ప్రజల దృఢతత్వం వారిపై నిర్లక్ష్యానికి సాకుగా చూపబడింది”;
“ఈ సరిహద్దు ప్రాంతాలను భాగ్యప్రదాతలుగా గుర్తించి
ఇక్కడి నుంచే మా ప్రగతి కృషికి శ్రీకారం చుట్టాం”;
“సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధిని వేడుక చేసుకునే
ఉత్తేజభరిత జీవితం దిశా మా వంతు కృషి చేస్తున్నాం”
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరాఖండ్‌లోని మనాలో రూ.3400 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే రహదారి-రోప్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు కేదార్‌నాథ్ వెళ్లిన ఆయన, అక్కడి ఆలయంలో శ్రీ కేదార్‌నాథుని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆది గురువు శంకరాచార్య సమాధిని సందర్శించి మందాకిని, సరస్వతీ అష్టపథాల వెంబడి కొనసాగుతున్న పనులను సమీక్షించారు. అటుపైన బద్రీనాథ్‌ను సందర్శించి, శ్రీ బద్రీనాథ్ ఆలయంలో దర్శనం చేసుకుని, పూజలు చేయించారు. అనంతరం అలకనంద నదీతీరంలో కొనసాగుతున్న పనులను కూడా ఆయన సమీక్షించారు.
ఈ కార్యక్రమాల తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- రెండు పుణ్యక్షేత్రాలలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించడం ద్వారా అలౌకిక ఆనందం పొందానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. “ఇవాళ నా జీవితం ధన్యమైంది.. హృదయంలో ఆనందం పొంగిపొర్లింది. ఈ క్షణాలు ఆత్మచైతన్యాన్ని చవిచూపాయి” అని ఆయన మహదానందం ప్రకటించారు. లోగడ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఇది ఉత్తరాఖండ్ దశాబ్దమంటూ తాను ప్రకటించడాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆనాటి తన మాటను బాబా కేదార్, బద్రీ విశాల్ నెరవేర్చి తనను ఆశీర్వదిస్తారనే పూర్తి నమ్మకం తనకుందని చెప్పారు. “నాటి సంకల్పాన్ని ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా పునరుద్ఘాటించడానికే నేనివాళ మీ మధ్యకొచ్చాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
మనా గ్రామాన్ని భారతదేశ సరిహద్దులోని చివరి గ్రామంగా పరిగణిస్తారని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, “నా వరకూ- సరిహద్దులోని ప్రతి గ్రామమూ దేశానికి మొదటి గ్రామమే. సరిహద్దు సమీపాన నివసించే ప్రజలు దేశానికి బలమైన కాపలాదారులుగా ఉంటారు” అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, దాని ప్రాముఖ్యంతో నిరంతరం ముడిపడి ఉండటాన్ని ప్రధాని గుర్తుకు తెచ్చుకున్నారు. అక్కడి ప్రజల మద్దతు, విశ్వాసాన్ని కూడా ఆయన ప్రశంసించారు. మనా గ్రామవాసులు తనపై చూపుతున్న నిరంతర ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారతదేశానికి రెండు ప్రధాన స్తంభాల గురించి ప్రధాని ప్రస్తావించారు. “వీటిలో మొదటిది- మన వారసత్వంపై గర్వివించడం కాగా… రెండోది ప్రగతి సాధనకు వీలైనంతగా శ్రమించడం. ఇవాళ ఉత్తరాఖండ్ ఈ రెండు స్తంభాలనూ మరింత బలోపేతం చేసుకుంటోంది” అని ఆయన పేర్కొన్నారు. కేదారనాథ్, బద్రీ విశాల్ సందర్శనతో తనకు అలౌకిక ఆనందం ప్రాప్తించిందని చెబుతూ- అదే తరహాలో “దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు కూడా నాకు దైవ సమానులే” అన్నారు. కాబట్టే ఇక్కడి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించానని ఆయన తెలిపారు.
కేదార్‌నాథ్ నుంచి గౌరీకుండం, హేమకుండం వైపు రెండో ‘రోప్ వే’లను ప్రస్తావిస్తూ- ఈ స్ఫూర్తి, పనుల ప్రగతి ఘనత బాబా కేదార్‌నాథ్, బద్రీ విశాల్, సిక్కు గురువుల ఆశీస్సులకే దక్కుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ అనూహ్య అభివృద్ధి పనులతో ప్రపంచవ్యాప్తంగా గల భక్తులు ఎంతో సంతోషిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల పనులు చేస్తున్న శ్రమజీవులకు, ఇతర సిబ్బందికి భద్రత కోసం ప్రధానమంత్రి దైవాన్ని ప్రార్థించారు. ఇక్కడి సంక్లిష్ట పరిస్థితుల నడుమ పనిచేస్తున్న వారి అంకితభావాన్ని ప్రశంసించారు. “ఈ శ్రమజీవులు దైవకార్యం చేస్తున్నారు.. మీరు వారి సంరక్షణ బాధ్యత చూడండి. వారిని ఎన్నడూ కూలిపని చేసే కార్మికులుగా భావించకండి. వారు దివ్య పథకాలు సాకారం కావడానికి సహకరిస్తున్నారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కేదార్‌నాథ్‌లో కార్మికులతో తాను ముచ్చటించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ- కార్మికులతోపాటు ఇంజనీర్లు కూడా తాము చేస్తున్న పనిని బాబా కేదార్‌నాథ్ ఆరాధనగా అభివర్ణించడం గొప్ప అనుభవమని ప్రధాని సంతోషం వెలిబుచ్చారు.
వలసవాద మనస్తత్వం నుంచి విముక్తం కావాలని ఎర్రకోట బురుజుల నుంచి తాను జాతికి చేసిన విజ్ఞప్తిని ప్రధానమంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచాక ఇలా ఎందుకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. బానిస మనస్తత్వం దేశానికి ఎంత బలమైన సంకెళ్లు వేసిందంటే- చివరకు అభివృద్ధి పనులు చేయడం కూడా ఒక నేరంగా జనం పరిగణించే స్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. “దేశాభివృద్ధిలో సాధించిన పురోగతిని బానిసత్వ తులాదండంతో తూచే పరిస్థితి ఏర్పడింది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రార్థన స్థలాలను చాలాకాలం నుంచీ చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు. “ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఈ పుణ్యక్షేత్రాలను స్తుతించడం ఎన్నటికీ మానుకోరు” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రయత్నాలను గుర్తుచేస్తూ- సోమనాథ్ ఆలయం, రామ మందిర నిర్మాణ సమయంలో జరిగిందేమిటో అందరికీ తెలిసినదేనని వ్యాఖ్యానించారు.
“ఈ పుణ్యక్షేత్రాల శిథిలావస్థ బానిస మనస్తత్వానికి విస్పష్ట సంకేతం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. చివరకు సదరు ఆలయాలకు వెళ్లే మార్గాలు కూడా దారుణ స్థితిలో ఉన్నాయి. “భారత ఆధ్యాత్మిక కేంద్రాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇదంతా గతకాలపు స్వార్థపూరిత ప్రభుత్వాల నిర్వాకమే”నని ఒకింత ఆగ్రహం ప్రకటించారు. కోట్లాది భారతీయుల దృష్టిలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎంత ముఖ్యమైనవో సదరు పాలకులు విస్మరించారని పేర్కొన్నారు. కానీ, వారి కృషి కారణంగా మన ఆధ్యాత్మిక కేంద్రాల ప్రాధాన్యం ప్రభావితం కాలేదని, అలాగే వాటిపట్ల ప్రజల్లోగల విశ్వాసం సడలిపోలేదని స్పష్టం చేశారు. “నేడు కాశీ, ఉజ్జయిని, అయోధ్య వంటి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు కోల్పోయిన తమ ప్రతిష్టను, వారసత్వాన్ని తిరిగి పొందుతున్నాయి. మరోవైపు కేదారనాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ సాంకేతికతతో తమ సేవలను సంధానిస్తూనే విశ్వాసాన్ని నిలుపుతున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. “అయోధ్యలోని రామ మందిరం నుంచి గుజరాత్‌లోని పావగఢ్‌లోగల కాళికా మాత ఆలయం దాకా- దేవి వింధ్యాచల్ కారిడార్ వరకూ భారతదేశం తన సాంస్కృతిక, సంప్రదాయక ఉద్ధరణను ప్రస్ఫుటం చేస్తోంది” అని ఆయన నొక్కిచెప్పారు. యాత్రికులు ఈ విశ్వాస కేంద్రాలకు ఇకపై సులువుగా చేరుకోగలరని, అక్కడ అందించే సేవలు వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని ఆయన అన్నారు.
ఈ విశ్వాస కేంద్రాల పునరుద్ధరణలో మరో కోణాన్ని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా వివరించారు. ఈ కార్యక్రమాల ద్వాఆ పర్వత ప్రాంత ప్రజలకు జీవన సౌలభ్యం కలుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు. “రోప్ వే, రైలు, రోడ్డు మార్గాలు వారికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి. తద్వారా వారికి జీవన సౌలభ్యంతోపాటు సాధికారత సిద్ధిస్తుంది. ఈ సౌకర్యాల రాకతో పర్వత ప్రాంతాలకు రవాణా మెరుగుపడి పర్యాటకం వృద్ధి చెందుతుంది. ఈ దుర్గమ ప్రాంతాల్లో సదుపాయాల పెంపు దిశగా డ్రోన్లను వినియోగించే యోచన కూడా ఉంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.
కొండ ప్రాంతాల ప్రజల లో ఉన్న ఆటు పోటుల కు తట్టుకొని నిలబడగలిగే తత్వాన్ని వారి కి వ్యతిరేకం గా ఉపయోగించడం జరిగింది అనే వాస్తవం శోచనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. కష్టించి పనిచేసేటటువంటి వారి యొక్క స్వభావాన్ని మరియు బలాన్ని వారి కి ఎలాంటి సౌకర్యాలు దక్కకుండా చేయడానికి ఒక సాకు గా వాడుకోవడమైంది అని ఆయన అన్నారు. వసతి, సదుపాయాల లో మరియు ప్రయోజనాల లో ప్రాథమ్య క్రమం లో వారు చివర న నిలచారు. దీనిని మనం తప్పక మార్చాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పూర్వం, దేశ సరిహద్దుల చివరి ప్రాంతాలు అని చిన్నచూపు చూసిన ప్రాంతాల లో మేము పనిచేయడం మొదలుపెట్టి మరి వాటిని సమృద్ధి తాలూకు ఆరంభ స్థానం గా గుర్తించాం. స్థానికుల లోని చాలా శక్తి ని వ్యర్థం చేస్తూవచ్చినటువంటి గుట్టల్లా పెరిగిన ఈ తరహా సవాళ్ళ కు పరిష్కారాల ను కనుగొనడానికని మేం ప్రయత్నించాం’’ అని ఆయన వివరించారు. గ్రామాలు అన్నిటిని విద్యుత్తీకరించడం, హర్ ఘర్ జల్ (ఇంటింటి కి నీటి ని అందించడం), పంచాయతీల ను ఆఫ్టికల్ ఫైబర్ తో కలపడం, ప్రతి ఒక్క పల్లె ప్రాంతం లో ఆరోగ్య కేంద్రాల ను మరియు వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేయడం, ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో కొండ ప్రాంతాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, మహమ్మారి కాలం లో పేదలకు ఆహారాన్ని ఉచితం గా సమకూర్చడం వంటి కార్యక్రమాల ను ఆయన వల్లిస్తూ ఆ కార్యక్రమాలు జీవించడం లో సౌలభ్యాన్ని పెంపొందింప చేయడం తో పాటు ప్రజల కు గౌరవాన్ని కల్పించాయి అన్నారు. ఈ సదుపాయాలు యువత కు కొత్త అవకాశాల ను ఇస్తాయి, పర్యటన ను ప్రోత్సహిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘యువతీయువకులు హోం స్టే స్ సదుపాయాల ను మెరుగుపరచేలా వారు వారి యొక్క నైపుణ్యాల ను అభివృద్ధి పరచుకొనేందుకు డబల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతర ధన సహాయాన్ని అందిస్తోంది అని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. సరిహద్దు ప్రాంతాల కు చెందిన యువత ను ఎన్ సిసి తో జతపరచే కార్యక్రమం వారి ని ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తుకై సన్నద్ధుల ను చేస్తోంది,’’ అని ఆయన అన్నారు.
‘‘ఆధునిక సంధానం అనేది జాతీయ రక్షణ కు ఒక పూచీకత్తు గా ఉంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ దిశ లో ప్రభుత్వం గడచిన 8 సంవత్సరాలు గా ఒక దాని తరువాత మరొకటి గా అడుగుల ను వేస్తున్నది అని ఆయన స్పష్టం చేశారు. కొన్నేళ్ళ క్రితం ప్రారంభించిన రెండు ప్రధాన సంధాన పథకాల ను గురించి ఆయన నొక్కి చెబుతూ భారత్ మాల మరియు , సాగర్ మాల లను ఉదాహరణలు గా పేర్కొన్నారు. భారత్ మాల లో భాగం గా దేశం యొక్క సరిహద్దు ప్రాంతాల ను ఉత్తమమైనటువంటి మరియు విశాలమైనటువంటి హైవేల తో జోడించడం జరుగుతోందని, సాగర్ మాల ద్వారా భారతదేశం లోని సముద్ర తీర ప్రాంతాల లో కనెక్టివిటీ ని బలపరచడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం గత 8 సంవత్సరాల లో జమ్ము- కశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ కు సరిహద్దు సంధానం విషయం లో ఇది వరకు ఎన్నడూ ఎరుగనంతటి విస్తరణ ను అమలుపరచింది అని ప్రధాన మంత్రి తెలియజేశారు. 2014వ సంవత్సరం నుండి చూస్తే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేశన్ కొత్త గా దాదాపు 7,000 కిలోమీటర్ల రహదారుల ను, అలాగే వందల కొద్ది వంతెనల ను నిర్మించింది. ముఖ్యమైన అనేక సొరంగాల ను కూడా పూర్తి చేయడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు.
పర్వత రాష్ట్రాల లో కనెక్టివిటీ ని పర్వత్ మాల యోజన మెరుగుపరుస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకం లో భాగం గా హిమాచల్ ప్రదేశ్ లో మరియు ఉత్తరాఖండ్ లో రోప్ వేస్ తాలూకు ఒక విశాలమైన నెట్ వర్క్ ను నిర్మించడం మొదలైంది అని ఆయన తెలిపారు. సైనిక వ్యవస్థ వలెనే సరిహద్దు ప్రాంతాల గ్రహణ శక్తి లో మార్పు ను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అభివృద్ధి ని వేడుక గా జరుపుకొనే ఒక హుషారైన జీవనాన్ని ఈ ప్రాంతాలు గడిపేటట్లు మేం ప్రయత్నాల ను చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. మానా నుండి మానా పాస్ వరకు నిర్మించబోయే రహదారి ఆ ప్రాంతానికి ఎక్కడ లేని మేలును చేకూర్చుతుంది. జోషి మఠ్ నుండి మలారీ రోడ్డు యొక్క విస్తరణ పూర్తి అయ్యింది అంటే గనుక సరిహద్దును చేరుకోవడం మన జవాన్ లతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా చాలా సులభం అయిపోతుంది అని ఆయన అన్నారు.
ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామి, ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ శ్రీ గుర్ మీత్ సింహ్, పార్లమెంట్ సభ్యుడు శ్రీ తీరథ్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వం లో మంత్రి శ్రీ ధన్ సింహ్ రావత్, మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ లు ఉన్నారు.
పూర్వ రంగం
కేదార్ నాథ్ లో రోప్ వే దాదాపు గా 9.7 కిలోమీటర్ల పొడవు న ఏర్పాటు కానుంది. అది గౌరీ కుండ్ ను కేదార్ నాథ్ తో కలుపుతుంది. ఈ రెండు స్థలాల మధ్య ప్రయాణించడానికి ప్రస్తుతం 6-7 గంటలు పడుతున్నది కాస్తా ఈ రోప్ వే సాయం తో కేవలం 30 నిమిషాల కు తగ్గిపోనుంది. ఇక హేమ్ కుండ్ రోప్ వే గోవింద్ ఘాట్ ను హేమ్ కుండ్ సాహిబ్ తో కలుపుతుంది. ఇది సుమారు 12.4 కి.మీ. మేర ఏర్పాటవుతుంది. ప్రయాణ కాలం ఒక రోజు కు పైగా ఉన్నది కాస్తా దీని సాయంతో కేవలం 45 నిమిషాల కు తగ్గిపోనుంది. ఈ రోప్ వే ఘాంఘరియా ను కూడా కలుపుతూ సాగుతుంది. ఘాంఘరియా అనేది వేలీ ఆఫ్ ఫ్లవర్స్ నేశనల్ పార్కు కు ప్రవేశద్వారం గా ఉంది.
ఈ యాత్ర లో భాగం గా దాదాపు గా 1000 కోట్ల విలువ కలిగిన రహదారి విస్తరణ పథకాల కు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మాణా నుండి మాణా పాస్ (ఎన్ హెచ్07) వరకు మరియు జోశీ మఠ్ నుండి మలారీ (ఎన్ హెచ్107 బి) వరకు.. ఈ రెండు రహదారి విస్తరణ పథకాలు మన సరిహద్దు ప్రాంతాల కు అన్ని రుతువుల లో రహదారి సంధానాన్ని అందించే దిశ లో మరొక అడుగు గా నిలవనుంది. కనెక్టివిటీ ని పెంచడానికి తోడు, ఈ ప్రాజెక్టు లు వ్యూహాత్మక దృష్టి కోణం లో చూసినా కూడా ను ప్రయోజన కరం కానున్నాయి.
కేదార్ నాథ్. ఇంకా బద్రినాథ్ లు అత్యంత ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాల లో ఒకటి గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రాంతం లో సిఖ్కుల ఆరాధ్య తీర్థయాత్ర స్థలం హేమ్ కుండ్ సాహిబ్ సైతం నెలకొంది. ప్రస్తుతం చేపట్టబోతున్న కనెక్టివిటీ ప్రాజెక్టు లు ధార్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల లో మౌలిక సదుపాయాల ను మెరుగుపరచాలన్న మరియు ఆయా క్షేత్రాల కు చేరుకోవడాన్ని సులభతరం చేయడానికి వీలైన చర్యల ను తీసుకోవాలన్న ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత ను చాటి చెబుతున్నాయి.
Kedarnath and Badrinath are significant to our ethos and traditions. https://t.co/68IErTo24N
— Narendra Modi (@narendramodi) October 21, 2022
PM @narendramodi begins his speech at a programme in Badrinath. pic.twitter.com/S62ckFYewx
— PMO India (@PMOIndia) October 21, 2022
For me every village on the border is the first village in the country, says PM @narendramodi pic.twitter.com/GwsI7fQQfM
— PMO India (@PMOIndia) October 21, 2022
Two major pillars for developed India of the 21st century. pic.twitter.com/iFhOtXprYz
— PMO India (@PMOIndia) October 21, 2022
We have to completely free ourselves from the colonial mindset. pic.twitter.com/qaQ6uEOoGl
— PMO India (@PMOIndia) October 21, 2022
आस्था के ये केंद्र सिर्फ एक ढांचा नहीं बल्कि हमारे लिए प्राणवायु हैं। pic.twitter.com/wsJjsh0aRJ
— PMO India (@PMOIndia) October 21, 2022
Enhancing 'Ease of Living' for the people in hilly states. pic.twitter.com/L0ZHHGXK6L
— PMO India (@PMOIndia) October 21, 2022
We began working with utmost priority in the areas which were ignored earlier. pic.twitter.com/ci5w2DNljL
— PMO India (@PMOIndia) October 21, 2022
Our focus is on improving multi-modal connectivity in the hilly states. pic.twitter.com/9hjG7AG1AI
— PMO India (@PMOIndia) October 21, 2022
आधुनिक कनेक्टिविटी राष्ट्ररक्षा की भी गांरटी होती है। pic.twitter.com/h69bxCI0En
— PMO India (@PMOIndia) October 21, 2022