Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ స్టేషన్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ స్టేషన్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లలో ఒకటి గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కాగా, రెండోది జోధ్ పూర్- అహమ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. రూ.498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్  పటేల్,  ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గోరఖ్ పూర్ ఎంపీ శ్రీ రవి కిషన్ ఉన్నారు.  .

నేపథ్యం

గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అయోధ్య గుండా వెళుతుంది. రాష్ట్రంలో ముఖ్యమైన నగరాల గుండా వెళ్ళటం ద్వారా అనుసంధానత పెంచుతూ, పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుంది. జోధ్ పూర్ – సబర్మతి  వందే భారత్ ఎక్స్ ప్రెస్ జోధ్ పూర్, అబూ రోడ్, అహమ్మదాబాద్ లాంటి ప్రముఖ స్థలాలకు అనుసంధానత పెంచుతుంది.  ఆ విధంగా ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసినట్టావుతుంది.  

గోరఖ్ పూర్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులకు రూ. 498 కోట్లు వెచ్చించటానికి సిద్ధమై శంకుస్థాపన చేయగా ఈ పనులు పూర్తయితే ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 

***