ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
“ఉత్తరప్రదేశ్ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నా సోదర, సోదరీమణులందరికీ నేను అనేకానేక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతిలో లెక్కపెట్టలేనన్ని పౌరాణిక, చరిత్రాత్మక కళాఖండాలకు సాక్షిగా నిలిచిన ఈ పవిత్ర ధరణి గత ఎనిమిది సంవత్సరాలుగా అభివృద్ధిలో ప్రతి రోజూ ఒక కొత్త అధ్యయాన్ని లిఖించడంలో నిమగ్నమైంది. ప్రజల సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వం, ఇక్కడి ప్రజల అద్భుత ప్రతిభ, వారి అలుపెరుగక శ్రమించే తత్వం.. ఇవి మన ఈ ప్రియమైన రాష్ట్రం వికసిత్ భారత్ నిర్మాణంలో వాటి అమూల్య తోడ్పాటును అందిస్తాయని నాకు పూర్తి భరోసా ఉంది.’’
उत्तर प्रदेश के स्थापना दिवस पर राज्य के अपने सभी भाई-बहनों को मेरी ढेरों शुभकामनाएं। भारतीय संस्कृति में अनगिनत पौराणिक और ऐतिहासिक कालखंडों की साक्षी रही यह पावन धरती पिछले आठ वर्षों से विकास के नित-नए अध्याय रचने में जुटी है। मुझे पूरा भरोसा है कि जनकल्याण के लिए समर्पित सरकार…
— Narendra Modi (@narendramodi) January 24, 2025
***
MJPS/SR