Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ

ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ


గ్లోబల్‌ ట్రేడ్‌ షో ను , ఇన్వెస్ట్‌ యుపి 2.0ను ప్రారంభించిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి నాయకత్వాన్ని, ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి అవకాశాలను ప్రశంసించిన పరిశ్రమ నాయకులు

‘‘ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ సుపరిపాలనకు పెట్టింది పేరు, మెరుగైన శాంతి భద్రతలు, శాంతి సుస్థిరత ఉన్నాయి’’
‘‘ఇవాళ ఉత్తరప్రదేశ్‌ ఆశకు, ప్రేరణకు మూలంగా నిలుస్తోంది’’

‘‘దేశంలోని ప్రతి పౌరుడూ ప్రగతి పథంలో పయనించాలనుకుంటున్నాడు, వికసిత భారతదేశాన్ని దర్శించాలనుకుంటున్నాడు’’

‘ఇవాళ ఇండియా విధిలేక సంస్కరణలు చేపట్టడంలేదు. ఒక నిబద్ధతతో చేపడుతోంది’’‘

‘‘డబుల్‌ ఇంజిన్‌ సర్కారు సంకల్పం, ఉత్తరప్రదేశ్‌లోని అవకాశాలు వీటిని చూసినపుడు ఇంతకంటే గొప్ప
భాగస్వామ్యం మరొకటి ఉండబోదు’’

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్‌ ట్రేడ్‌ షోను, ఇన్వెస్ట్‌ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 అనేది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్‌ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.

ఈ సందర్భంగా పరిశ్రమకు చెందిన నేతలు మాట్లాడారు. పారిశ్రామిక వేత్త శ్రీ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ, ఇండియా గొప్పగా ఎంటర్‌ప్రెన్యుయర్‌ డైనమిజాన్ని ప్రదర్శిస్తోందని , ఆవిష్కరణలు చేస్తోందని ఇది క్రెడిట్‌ ప్రధానమంత్రికి దక్కుతుందని ఆయన అన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి కొత్త శక్తిని ఎక్కించారని ఆయన అన్నారు. శ్రీముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ, ఈఏడాది బడ్జెట్‌ ఇండియాను అభివృద్ధి చెందిన దేశాల సరసనచేరేందుకు పునాదిని వేసిందని అన్నారు.కాపెక్స్‌ వ్యయానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, గణనీయమైన ఆర్థిక ప్రగతికి, సాంఘిక సంక్షేమానికి దోహదపడుతుందని అన్నారు.

ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గొప్ప పరివర్తన సాధించిందని ప్రధానమంత్రి దార్శనికత, వివిధ కార్యక్రమాల అమలులో వారి సునిశిత దృష్టితో నవభారతం రూపుదిద్దుకుంటున్నదని ఆయన అన్నారు.
టాటా సన్స్‌ ఛైర్మన్‌ శ్రీ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ, ప్రధానమంత్రి దార్శనిక పాలనతో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నదని అన్నారు. ‘‘ కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రధానమంత్రి అన్ని రంగాలలో ప్రగతికి వీలుకల్పించారు’’ అని ఆయన అన్నారు.

బడ్జెట్‌ లో జరిపిన కేటాయింపులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వినియోగంలో వృద్ధికి వీలు కల్పిస్తుందన్నారు. అలాగే మనం గ్రామీణ రంగంలో వృద్ధిని చూడగలమని అన్నారు. జూరిచ్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఆసియా సంస్థ సి.ఇ.ఒ డానియల్‌ బిర్‌చెర్‌ మాట్లాడుతూ, ఇండియా 75 వసంతాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటున్నట్టే , జూరిచ్‌ విమానాశ్రయం కూడా 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నదని అన్నారు. ఇండియా, జూరిచ్‌ ఎయిర్‌ పోర్టులమధ్య ఎంతోకాలంగా ఉన్న బంధం గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దశాబ్దాల క్రితమే జూరిచ్‌ ఎయిర్‌ పోర్టు బెంగళూరు విమానాశ్రయ అభివృద్ధికి మద్దతునిచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టును అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.యమున ఎక్స్‌ప్రెస్‌ వేతో నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ను నేరుగా అనుసంధానించడం గురించి ఆయన ప్రస్తావించారు. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ శ్రీ సునీల్‌ వచాని మాట్లాడుతూ, ఇండియాలో అమ్ముడవుతున్న 65 శాతం మొబైల్‌ ఫోన్లు అన్నీ ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్నాయన్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ అద్బుత విధానాలే కారణమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ మొబైల్‌ తయారీ హబ్‌ గా మారడానికి యుపి ప్రభుత్వ అద్భుత విధానాలే కారణమన్నారు. డిక్సన్‌ టెక్నాలజీస్‌, సుమారు 100 బిలియన్‌ డాలర్ల విలువగల మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేయడానికి ఎదురుచూస్తున్నదని ఆయన అన్నారు.

ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇన్వెస్టర్లకు , పరిశ్రమ నాయకులకు, విధాన నిర్ణేతలకు ప్రధానమంత్రి గా, ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడిగా సాదర స్వాగతం పలికారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, అద్భుత చరిత్రకు, గొప్ప వారసత్వానికి ఆలవాలమని ప్రధానమంత్రి అన్నారు. ఉత్తరప్రదేశ్‌ సామర్ధ్యాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఈ రాష్ట్రానికి వెనుకబడిన ప్రాంతంగా, బీమారు రాష్ట్రంగా, శాంతిభద్రతలు దయనీయంగా ఉన్న రాష్ట్రంగా అనవసర ప్రచారం జరిగేదని అన్నారు. అలాగే గతంలో రోజూ కోట్ల రూపాయల విలువగల కుంభకోణం ఏదో ఒకటి బయటపడుతూ వచ్చేదని అన్నారు. అయితే వాటన్నింటినీ వదిలించుకుని గత ఐదారేళ్లలో ఉత్తరప్రదేశ్‌ కొత్త గుర్తింపును తెచ్చుకున్నదన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ నూతన ప్రభుత్వం సుపరిపాలనకు , మెరుగైన శాంతి భద్రతలకు, శాంతి, సుస్థిరతకు పెట్టింది పేరని అన్నారు.‘‘సంపదసృష్టికర్తలకు ఇక్కడ కొత్త అవకాశాలు కల్పించడం జరుగుతోంది’’ అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మెరుగైన మౌలికసౌకర్యాలు కల్పించేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలవంతమయ్యాయని తెలిపారు.

త్వరలోనే ఉత్తరప్రదేశ్‌రాష్ట్రం 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా అవతరించనున్నదని అన్నారు. సరకురవాణా కారిడార్‌్‌ రాష్ట్రాన్ని నేరుగా మహారాష్ట్ర సముద్రతీరంతో అనుసంధానమవుతుందని అన్నారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి ఉత్తరప్రదేవ్‌ ఆలోచనలో అర్థవంతమైన మార్పు వచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఇవాళ ఉత్తర ప్రదేశ్‌ ఆశావహ దృక్పధానికి, స్ఫూర్తికి మూల ప్రేరణగా నిలుస్తోంది’’ భారత ఆర్థిక వ్యవస్థ మునుముందుకు దూసుకుపోతుండడం పట్ల ప్రపంచంలోని ప్రతి విశ్వసనీయ గొంతుక ఆశావహంగానే ఉందని ప్రధానమంత్రి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ, కోవిడ్‌ మహమ్మారి నుంచి ఇతర దేశాలలోని యుద్ధ ప్రభావం నుంచి అద్భుతంగా కోలుకున్నదని అన్నారు.

భారతదేశ యువత, భారతీయ సమాజం ఆలోచనలో ఆకాంక్షలలో గొప్ప మార్పును గమనించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్నాడని

రాగలరోజులలో వికసిత భారతాన్ని దర్శించాలని అనుకుంటున్నారని అన్నారు. భారతదేశ ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే చోదకశక్తిగా పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఊపుతోనే దేశంలో అద్భుత అభివృద్ధికార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జనసంఖ్యస్థాయి గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్‌ కూడా ఆకాంక్షిత సమాజమని అన్నారు. ఇది మీకోసం ఎదురుచూస్తున్నది అని ఇన్వెస్టర్లతో అన్నారు.

డిజిటల్‌ విప్లవం కారణంగా ఉత్తరప్రదేశ్‌ సమాజం సమ్మిళతంగా ఎదిగిందని, అనుసంధానత పెరిగిందని అన్నారు. ‘‘ మార్కెట్‌గా ఇండియా నిరంతరాయత సాధిస్తోంది. విధానాలు సులభతరమవుతున్నాయి ’’ అని అన్నారు. ‘‘ ఇవాళ ఇండియా సంస్కరణలు అమలు చేస్తోంది. అయితే వీటిని ఒత్తిడి వల్ల కాక, నిబద్ధతతో చేపడుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.

ఇవాళ ఇండియా వాస్తవంగా భారీ స్థాయిలో , వేగంగా ముందుకు దూసుకుపోతున్నదని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పెద్దమొత్తంలోని ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంతో వారు మరింత ముందుకు ఆలోచిస్తున్నారు. ఇండియా పై విశ్వాసానికి ఇదే పెద్ద ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు.

బడ్జెటు ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పన కు కేటాయింపు పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆరోగ్య రంగం లో, విద్య రంగం లో మరియు సోశల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగం లో ఇన్ వెస్టర్ లకు గల అవకాశాల ను గురించి కూడా ఆయన వివరించారు. భారతదేశం అనుసరిస్తున్న గ్రీన్ గ్రోథ్ మార్గం లో లభించే అవకాశాల ను వినియోగించుకోవలసింది అంటూ ఇన్ వెస్టర్ లకు ఆహ్వానం పలికారు. ఈ సంవత్సరం బడ్జెటు లో శక్తి పరివర్తన కు ఒక్కదానికే 35,000 కోట్ల రూపాయల ను కేటాయించడం జరిగింది అని ఆయన తెలియ జేశారు.

ఒక సరికొత్త వేల్యూ ఎండ్ సప్లయ్ చైన్ ను అభివృద్ధిపరచే విషయాని కి వస్తే, ఉత్తర్ ప్రదేశ్ ఒక చాంపియన్ గా తెర మీద కు వచ్చింది అని ప్రధాన మంత్రి తెలిపారు. రాష్ట్రం లో సాంప్రదాయికమైనటువంటి మరియు ఆధునికమైనటువంటి సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థ ల(ఎమ్ఎస్ఎమ్ఇ స్) తో కూడిన ఒక హుషారైన నెట్ వర్క్ ఏర్పాటైందని ఆయన ప్రస్తావించి భదోహీ పట్టు ను, వారాణసీ పట్టు ను ఉదాహరణ గా పేర్కొంటూ, ఉత్తర్ ప్రదేశ్ ను భారతదేశం లో వస్త్ర కేంద్రం గా ఇవి తీర్చిదిద్దాయన్నారు. భారతదేశం లో 60 శాతం మొబైల్ ఫోన్ ల తో పాటు గరిస్ఠ సంఖ్య లో మొబైల్ విడి భాగాలు ఉత్తర్ ప్రదేశ్ లో తయారు అవుతున్నాయి అని ఆయన వెల్లడించారు. దేశం లోని రెండు డిఫెన్స్ కారిడార్ లలో ఒక డిఫెన్స్ కారిడార్ ను ఉత్తర్ ప్రదేశ్ లో అభివృద్ధి పరచడం జరుగుతోందని కూడా ఆయన సభికుల దృష్టి కి తీసుకు వచ్చారు. భారతదేశం యొక్క సైన్యాని కి ‘మేడ్ ఇన్ ఇండియా’ రక్షణ వ్యవస్థ లను మరియు ప్లాట్ ఫార్మ్ స్ ను అందజేయాలి అనేది ప్రభుత్వం యొక్క వచనబద్ధత అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

పాడి, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరియు ఫూడ్ ప్రోసెసింగ్ లకు సంబంధించినంత వరకు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ప్రైవేటు ప్రాతినిధ్యం ఇంకా పరిమితం గానే ఉన్న రంగాల లో ఒకటి గా ఈ రంగం ఉంది అని ఆయన అన్నారు. ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లో పిఎల్ఐ ని గురించి ఇన్ వెస్టర్ లకు ఆయన వివరించారు. రైతుల కు ఇన్ పుట్ దశ మొదలుకొని పంట కోతల అనంతర కాలం లో నిర్వహణ దశ వరకు ఒక నిరంతరాయమైనటువంటి ఆధునిక వ్యవస్థ ను అందుబాటు లోకి తీసుకు రావాలని ప్రభుత్వం కంకణం కట్టుకొందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. చిన్న ఇన్ వెస్టర్ లు ఎగ్రీ-ఇన్ ఫ్రా ఫండ్స్ ను వినియోగించుకోవచ్చు అని ఆయన అన్నారు.

పంట ల వివిధీకరణ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రైతుల కు మరిన్ని వనరుల ను కల్పించడాన్ని గురించి, ఇన్ పుట్ కాస్ట్ ను తగ్గించడాన్ని గురించి ప్రస్తావించారు. ప్రాకృతిక వ్యవసాయం విషయం లో తీసుకొంటున్న శ్రద్ధ ను గురించి ప్రధాన మంత్రి సమగ్రం గా తెలియ జేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది తీర ప్రాంతాల లో కుడి ఎడమ వైపు లలో 5 కి.మీ. మేర కు ప్రాకృతిక వ్యవసాయం మొదలైపపోయింది అని ఆయన వెల్లడించారు. ఈ బడ్జెటు లో 10 వేల బయో-ఇన్ పుట్ రిసోర్స్ సెంటర్ లను ప్రతిపాదించడం జరిగిందని కూడా ఆయన అన్నారు. భారతదేశం లో ‘శ్రీ అన్న’ గా పిలిచేటటువంటి చిరుధాన్యాల కు ఉన్న పోషక విలువల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ప్రపంచం లో పోషణ భద్రత తాలూకు అవసరాల ను భారతదేశం యొక్క ‘శ్రీ అన్న’ పరిష్కరించాలి అనే దిశ లో ప్రభుత్వం కృషి చేస్తుంది అని స్పష్టం చేశారు. భుజించడాని కి సిద్ధం గా ఉండేటటువంటి మరియు వండుకోవడాని కి సిద్ధం గా ఉండేటటువంటి ‘శ్రీ అన్న’ కు సంబంధించిన అవకాశాల ను ఇన్ వెస్టర్ లు గుర్తించవచ్చు అని ఆయన అన్నారు.

రాష్ట్రం లో విద్య పరం గా మరియు నైపుణ్యాభివృద్ధి పరం గా చోటుచేసుకొన్న అభివృద్ధి కార్యాల ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. మహాయోగి గురు గోరఖ్ నాథ్ ఆయుష్ యూనివర్సిటీ, అటల్ బిహారీ వాజ్ పేయీ హెల్థ్ యూనివర్సిటీ, రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ యూనివర్సిటీ మరియు మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లు విభిన్నమైన కోవల కు చెందిన నైపుణ్యాల ను నేర్పిస్తాయని ఆయన చెప్పారు. నైపుణ్యాభివృద్ధి ఉద్యమం లో భాగం గా 16 లక్షల మంది కి పైగా యువతీ యువకుల కు శిక్షణ ను ఇవ్వడమైందని ఆయన వెల్లడించారు.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఎఐ) కి సంబంధించిన పాఠ్యక్రమాల ను పిజిఐ లఖ్ నవూ లో, ఐఐటి కాన్ పుర్ లో మొదలుపెట్టిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దేశం లోని స్టార్ట్-అప్ క్రాంతి లో రాష్ట్రం పాత్ర అంతకంతకూ పెరుగుతూ పోతోందని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. రాబోయే కాలాల్లో 100 ఇన్ క్యూబేటర్స్ ను మరియు మూడు అత్యాధునికమైన కేంద్రాల ను ఏర్పాటు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకొందని, అవి ప్రతిభావంతులైనటువంటి మరియు నైపుణ్యం కలిగినటువంటి యువతీ యువకుల తో ఒక పెద్ద సమూహాన్ని సన్నద్ధం చేస్తాయని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో ఉత్తర్ ప్రదేశ్ లోని డబల్ ఎన్ జిన్ ప్రభుత్వం యొక్క సంకల్పానికి మరియు ఆ రాష్ట్రం లోని అవకాశాల కు మధ్య గల పటిష్టమైనటువంటి భాగస్వామ్యాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. కాలాన్ని ఎంత మాత్రం వృథా పోనివ్వకండి, సమృద్ధి లో వారు పాలుపంచుకోండి అంటూ ఇన్ వెస్టర్ లకు మరియు పరిశ్రమ రంగ ప్రముఖుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రపంచం యొక్క సమృద్ధి అనేది భారతదేశం యొక్క సమృద్ధి లో ఇమిడి ఉంది. ఈ సమృద్ధి యాత్ర లో మీ యొక్క ప్రాతినిధ్యం చాలా ముఖ్యం’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరు శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లో మంత్రులు, విదేశీ ప్రముఖులు మరియు పరిశ్రమ రంగ ప్రముఖులు పాలుపంచుకొన్నారు.

పూర్వరంగం

ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023ను ఫిబ్రవరి 10వ తేదీ నాటి నుండి 12వ తేదీ వరకు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేయడమైంది; ఈ కార్యక్రమం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధానమైన పెట్టుబడి శిఖర సమ్మేళనం గా ఉంది. ఇది విధాన రూపకర్తల ను, పరిశ్రమ కు చెందిన నాయకుల ను, విద్యారంగ ప్రముఖుల ను, ఆలోచనపరుల ను, అలాగే ప్రపంచం లో వివిధ ప్రాంతాల కు చెందిన నేతల ను ఒక చోటు కు తీసుకు రావడం తో పాటు సామూహికం గా వ్యాపార అవకాశాల అన్వేషణ కు మరియు భాగస్వామ్యాల ఏర్పాటు కు కూడా దోహద పడనుంది.

ఇన్ వెస్టర్ యుపి 2.0 అనేది ఉత్తర్ ప్రదేశ్ లో ఒక సమగ్రమైనటువంటి, ఇన్ వెస్టర్ ను కేంద్ర స్థానం లో నిలిపేటటువంటి మరియు సేవ ప్రధానం గా పెట్టుబడి సంబంధి ఇకోసిస్టమ్ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించినటువంటి కార్యక్రమం. ఇది ఇన్ వెస్టర్ లకు ప్రాసంగికం గా ఉండేందుకు, రాచబాట ను వేసేందుకు మరియు ప్రామాణికమైన సేవల ను అందజేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం.