Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో స్వానిధి మహోత్సవంపై ప్రధానమంత్రి ప్రశంస


   త్తరప్రదేశ్‌లోని ఎటావాలో స్వానిధి మహోత్సవం నిర్వహణను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద గరిష్ఠ స్థాయిలో రుణ పంపిణీ, డిజిటల్‌ లావాదేవీలకు తోడ్పడినందుకుగాను పథకం లబ్ధిదారులను సత్కరించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇటావా యంత్రాంగం ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయం! డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే కాకుండా ప్రధానమంత్రి స్వానిధి యోజనకు విస్తృతంగా తోడ్పడిన లబ్ధిదారులను సత్కరించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఒక మాధ్యమంగా మారుతున్నాయి” అని పేర్కొన్నారు.