ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
మృతుల కుటుంబీకులకు ప్రధాన మంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 సహాయం ప్రకటించారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’ మాధ్యమంగా ఇలా పోస్ట్ చేశారు:
“ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించుగాక. దీంతో పాటు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పాలన యంత్రాంగం బాధితులకు సాధ్యమైన సహాయం అందించడంలో నిమగ్నమై ఉంది: ప్రధానమంత్రి @narendramodi.”
“ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.”
उत्तर प्रदेश के हाथरस में हुई सड़क दुर्घटना अत्यंत पीड़ादायक है। इसमें जिन्होंने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की…
— PMO India (@PMOIndia) September 6, 2024
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in Hathras, UP. The injured would be given Rs. 50,000. https://t.co/7qucGLR6ug
— PMO India (@PMOIndia) September 6, 2024