Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉజ్జ్వల యోజన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉజ్జ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 2.5 కోట్లను మించినందుకుగాను సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఉజ్జ్వల యోజన తన వ్యాప్తిని విస్తరించుకుంటూ పోతోంది. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఈ రోజున 2.5 కోట్లను అధిగమించడం ఎంతో సంతోషాన్నిస్తోంది.

పశ్చిమ బెంగాల్ లోని జంగీపుర్ లో లబ్ధిదారులకు ఎల్ పిజి కనెక్షన్ లను అప్పగించేందుకు ముందుకు వచ్చిన రాష్ట్రపతి గారి ప్రత్యేక చొరవకు ఇవే నా ధన్యవాదాలు.

ఉజ్జ్వల యోజన విజయవంతం కావడం కోసం రోజులో 24 గంటలూ శ్రమిస్తున్న మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను మరియు ఆయన యావత్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.