Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం  కోసం ఆర్థిక సహాయం అనే అంశం పై మూడవ ‘నో మనీ ఫార్ టెర్రర్’ మంత్రుల స్థాయి సమావేశం లో నవంబర్ 18వ తేదీ నాడు ప్రారంభోపన్యాసం చేయనున్నప్రధాన మంత్రి


ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం ఆర్థిక సహాయం అనే అంశం పై ఉగ్రవాదం కోసం ఎటువంటి ధనం లభించదు (నో మనీ ఫార్ టెర్రర్’ – ఎన్ఎమ్ఎఫ్ టి) పేరిట మంత్రుల స్థాయి మూడో సమ్మేళనం నవంబర్ 18వ తేదీ నాడు ఉదయం పూట 9:30 గంటల కు న్యూ ఢిల్లీ లో హోటల్ తాజ్ పేలిస్ లో జరగనుండగా ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.

నవంబర్ 18, 19వ తేదీల లో జరుగనున్న రెండు రోజుల సమ్మేళనం ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా ఆర్థిక సహాయం పై ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి లో తీసుకొంటున్న చర్యల యొక్క ప్రభావశీలత తో పాటు గా సరికొత్త గా ఎదురవుతున్న సవాళ్ళ ను పరిష్కరించడం కోసం అవసరపడే చర్యల విషయం లో కూడా చర్చలు జరపడానికి సమావేశం లో పాలుపంచుకొనే దేశాలు మరియు సంస్థల కు ఒక విశిష్టమైన వేదిక ను సమకూర్చనుంది. ఈ సమ్మేళనం ఏప్రిల్ 2018 ఏప్రిల్ లో పేరిస్‌ లో మరియు 2019 నవంబర్ లో మెల్‌ బర్న్ లో నిర్వహించిన రెండు సమ్మేళనాల యొక్క అనుభవం మరియు ఉపదేశాల వెలుగు లో ముందుకు పోనున్నది. అంతేకాక, ఉగ్రవాదుల కు ద్రవ్య సహాయాన్ని అందకుండా చేయడానికి మరియు తమ కార్యప్రణాళికల ను అమలుపరచే క్రమం లో అనుమతి పొందే అధికార క్షేత్రాల కు చేరుకొనే సౌలభ్యం కోసం ప్రపంచ వ్యాప్త సహకారాన్ని పెంపొందింపచేసే దిశ లో సంప్రదింపులను జరపనుంది. ఈ సమ్మేళనం లో ప్రపంచం నలు మూలల నుండి మంత్రులు, బహుళ పక్ష సంస్థల ప్రముఖులు, ఇంకా ఫినాన్శల్ ఏక్శన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ప్రతినిధిమండలి యొక్క ప్రముఖులు కలుపుకొని దాదాపు గా 450 మంది పాలుపంచుకోనున్నారు.

సమ్మేళనం జరిగే క్రమం లో, నాలుగు సమావేశాల లో చర్చోపచర్చల ను కొనసాగించడం జరుగుతుంది. ఈ నాలుగు సమావేశాలు ఉగ్రవాదం మరియు ఉగ్రవాద సంబంధి ఆర్థిక సహాయం లో ప్రపంచ వ్యాప్తం గా నెలకొన్న ధోరణులు’, ‘ఉగ్రవాదం కోసం నిధుల ను ఔపచారిక మరియు అనౌపచారిక చానల్స్ ను ఉపయోగించడం’, ‘సరికొత్త గా ఉనికి లోకి వస్తున్నటువంటి సాంకేతికత లు మరియు ఉగ్రవాద సంబంధి ఆర్థిక సహాయం, ఇంకా ఉగ్రవాదుల కు ఆర్థిక సహాయం లభించకుండా చూడడం లో ఎదురయ్యే సవాళ్ళ ను పరిష్కరించడానికి ఉద్దేశించినటువంటి అంతర్జాతీయ సహకారంపై కేంద్రీకృతం కానున్నాయి.

***