Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉగాండా అధ్యక్షుడితో భారత ప్రధాని టెలిఫోన్ సంభాషణ


ఉగాండా రిపబ్లిక్ అధ్యక్షుడు మాన్యులు యోవేరి కగుతా మూసెవేనితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం టెలిఫోన్ లో సంభాషించారు. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఎదురవుతున్న ఆరోగ్య, ఆర్ధిక సవాళ్ళను గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆఫ్రికా ఖండంలోని తమ మిత్రులతో ఇండియా సంఘీభావంతో వ్యవహరించగలదని, తమ (ఉగాండా) భూభాగంలో వైరస్ వ్యాప్తిచెందకుండా అరికట్టడానికి ఉగాండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వగలమని అధ్యక్షుడు మూసెవెనికి ప్రధాని హామీ ఇచ్చారు.

ఉగాండాలోని భారత సంతతి వారి పట్ల సుహృద్భావంతో వ్యవహరించి, వారి సంరక్షణకు చర్యలు తీసుకున్నందుకు, ప్రస్తుత పరిస్థితిలో అండగా నిలిచినందుకు ఉగాండా ప్రభుత్వాన్ని, సమాజాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

ఉగాండాలో 2018 జూలైలో తాను జరిపిన పర్యటనను ఎంతో ఉత్సాహంగా గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి ఇండియా – ఉగాండా దేశాల మధ్య సంబంధాలలో ప్రత్యేకతను గురించి ప్రస్తావించారు.
కోవిడ్ -19పై పోరాటంలో ప్రపంచ దేశాలు గెలువగలవన్న ఆశాభావాన్ని ఇరువురు నాయకులు వ్యక్తం చేశారు.