ఈస్టర్న్ రైల్వేలోని డాన్ కుని లో ఉన్న డీజిల్ కాంపొనంట్ ఫ్యాక్టరీ మెకానికల్ డిపార్ట్ మెంట్ లో రెవెన్యూ చార్జ్ డ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఎజి) పోస్ట్ ఆఫ్ చీఫ్ వర్క్ స్ మేనేజర్ (సిడబ్ల్యుఎమ్) ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈస్టర్న్ రైల్వేలోని డాన్ కుని లో ఉన్న డీజిల్ కాంపొనంట్ ఫ్యాక్టరీ లో ఈ పదవి ఒక కీలకమైన భాగం. ఇది ఆ కర్మాగారం సరిగ్గా పనిచేసేటట్లు చూడటానికి, నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి దోహదపడనున్నది. ఈ పోస్టు వల్ల రైల్వేలకు ఏడాదికి రూ.16,79,400 ఖర్చవుతుంది.
పూర్వ రంగం
ఈస్టర్న్ రైల్వేలోని డాన్ కుని లో ఉన్న డీజిల్ లోకోమోటివ్ కాంపొనంట్ ఫ్యాక్టరీ ని సంవత్సరానికి 100 హై హార్స్ పవర్ కలిగిన డీజిల్ లోకోమోటివ్ అండర్-ఫ్రేమ్స్ ను తయారు చేయడంతో పాటు, ఏడాదికి 72 క్రాంక్ కేస్ మెషినింగ్ కోసం ఏర్పాటు చేశారు. లోకో ఉత్పాదన అవసరాలు మరియు డీజిల్ లోకోమోటివ్ వర్క్ స్ / వారణాసి లోని సొంత తయారీ మరియు మెషినింగ్ కెపాసిటీ కి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటమనేది దీని ఏర్పాటు లోని ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఈ కర్మాగారం డీజిల్ లోకోమోటివ్ వర్క్ స్ / వారణాసి కి సోదరి సంస్థగా నడుస్తుంది.