Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య పారిశ్రామికాభివృద్ధి స్కీమ్ (నీడ్స్) 2017 కు కేబినెట్ ఆమోదం


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈశాన్య ప్రాంత పారిశ్రామికాభివృద్ధి ప‌థ‌కం-2017 కి (నీడ్స్) ఆమోద‌ముద్ర వేసింది. 2020 మార్చి నాటికి దీనిపై మూడు వేల‌కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డిగా పెడ‌తారు. గ‌తంలో అమ‌లు జ‌రుగుతున్న రెండు స్కీమ్ ల కింద ఉన్న ప్రోత్సాహ‌కాల‌ను మ‌రింత మెరుగైన పెట్టుబ‌డితో అమ‌లుప‌రిచే ప‌థ‌కం ఇది.

వివ‌రాలు…

ఈశాన్య రాష్ర్టాల్లో ఉపాధిక‌ల్ప‌న‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కీమ్ ద్వారా ఎంఎస్ఎంఇ రంగానికి ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా ప్రోత్సాహ‌కాలు అందిస్తుంది. ఉపాధిక‌ల్పన కింద ఈ స్కీమ్ ద్వారా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్రోత్సాహం అందిస్తోంది.

భారత ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లోని ఇతర స్కీమ్ ల అనుబంధ విభాగాల ద్వారా అందుతున్ ఒక‌టి లేదా అంత‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ అర్హత గల సంస్థ‌లు ఈ స్కీమ్ లోని అనుబంధ విభాగాల ద్వారా పొంద‌గ‌లుగుతాయి.

సిక్కిం స‌హా ఈశాన్య రాష్ర్టాల‌న్నింటిలోని కొత్త పారిశ్రామిక యూనిట్ల‌కు ఈ స్కీమ్ కింద ఈ దిగువ ప్రోత్సాహ‌కాలు అందుతాయి.

కేంద్ర వ‌డ్డీ ప్రోత్సాహం (సిఐఐ) 

యూనిట్ వాణిజ్య‌ప‌రంగా ఉత్ప‌త్తి ప్రారంభించిన రోజు నుంచి ఐదు సంవ‌త్స‌రాల పాటు అర్హ‌త గ‌త బ్యాంకులు లేదా ఆర్థిక స‌హాయ సంస్థ‌లు అందించిన వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ క్రెడిట్‌పై 3 శాతం వ‌డ్డీరాయితీ.

కేంద్ర స‌మ‌గ్ర బీమా ప్రోత్సాహ‌కం (సిసిఐఐ) 

యూనిట్ వాణిజ్యప‌రంగా ఉత్ప‌త్తిని ప్రారంభించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు అమ‌లులోఉండేలా భ‌వ‌నాలు, యంత్ర‌ప‌రిక‌రాలు, ప్లాంట్ పై చెల్లించిన బీమా ప్రీమియం నూరు శాతం వాప‌సు 

వ‌స్తుసేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) వాప‌సు 

యూనిట్ వాణిజ్య‌ప‌ర‌మైన ఉత్ప‌త్తి ప్రారంభించిన తేదీ నుంచి ఐదు సంవ‌త్స‌రాల పాటు కంపెనీ చెల్లించిన సిజిఎస్ టి, ఐజిఎస్ టిలో కేంద్ర ప్ర‌భుత్వ వాటా వాప‌సు.

ఆదాయ‌పు ప‌న్ను (ఐటి) వాప‌సు

ప్లాంట్ వాణిజ్య‌ప‌ర‌మైన ఉత్ప‌త్తి ప్రారంభించిన సంవ‌త్స‌రం నుంచి అమ‌లులోకి వ‌చ్చేలా ఐదు సంవ‌త్స‌రాల పాటు ఆదాయ‌పు ప‌న్నులో కేంద్ర ప్ర‌భుత్వ వాటా వాప‌సు.  

ర‌వాణా ప్రోత్సాహ‌కం (టిఐ)

రైళ్ల ద్వారా వ‌స్తు ర‌వాణాపై రైల్వే/   రైల్వే పిఎస్‌యు అందించే స‌బ్సిడీ స‌హా 20 శాతం ర‌వాణా వ్య‌యాల 

ఇన్ లాండ్ వాట‌ర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ర‌వాణా చేసే వ‌స్తువుల‌పై 20 శాతం ర‌వాణా వ్య‌యం

చెడిపోయే స్వ‌భావం గ‌ల వ‌స్తువుల‌ను వాయుమార్గంలో ర‌వాణా చేసేందుకు (ఐఏటిఏ నిర్వ‌చించిన మేర‌కు) విమానాశ్ర‌యం స‌మీపంలో ఉన్న ప్ర‌దేశం నుంచి దేశంలోని గ‌మ్యంలోని విమానాశ్ర‌యానికైనా ర‌వాణా వ్య‌యంలో 33 శాతం 

ఉపాధి ప్రోత్సాహ‌కం (ఇఐ)

ప‌్ర‌ధాన‌మంత్రి రోజ్ గార్ ప్రోత్సాహ‌యోజ‌న (పిఎంఆర్ పివై) కింద ఉద్యోగుల పింఛ‌ను స్కీమ్ కి (ఇపిఎస్‌) ప్ర‌భుత్వ వాటా 8.33 శాతానికి అద‌నంగా ఉద్యోగుల భ‌విష్య నిధికి (ఇపిఎఫ్‌) య‌జ‌మాని చెల్లిస్తున్న వాటాలో కూడా 3.67 శాతం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.

రుణ‌స‌దుపాయం అందుబాటులో ఉండ‌డం కోసం కేంద్ర మూల‌ధ‌న పెట్టుబ‌డి ప్రోత్సాహ‌కం (సిసిఐఐఎసి)  ఐదు కోట్ల రూపాయ‌ల గ‌రిష్ఠ ప‌రిమితికి లోబ‌డి ప్లాంట్‌, యంత్ర‌ప‌రిక‌రాల‌పై పెట్టే పెట్టుబ‌డిలో 30 శాతం రాయితీ