75 వ # #RepublicDay ఉత్సవాల సందర్భం లో ఈజిప్టు కు చెందిన బాలిక కరిమాన్ గారు పాడినటువంటి ‘‘దేశ్ రంగీలా’’ అనే దేశ భక్తి గీతం యొక్క ఆలాపన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఆమె కు భవిష్యత్తు ఉజ్వలం గా ఉండాలి అంటూ ఆయన శుభాకాంక్షల ను కూడా తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో –
‘‘ఈజిప్టు కు చెందిన కరిమాన్ గారు పాడినటువంటి ఈ గీతం మధురం గా ఉంది. ఈ ప్రయాస కు గాను ఆమె ను నేను అభినందిస్తూ, ఆమె భావి ప్రయాసల లో అత్యుత్తమం గా రాణించాలని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
This rendition by Kariman from Egypt is melodious! I congratulate her for this effort and wish her the very best for her future endeavours. https://t.co/I1mbVZuG8c
— Narendra Modi (@narendramodi) January 29, 2024
هذا الأداء الذي قدمته كاريمان من مصر رخيم! أهنئها على هذا المجهود وأتمنى لها كل التوفيق في مساعيها المستقبلية. https://t.co/I1mbVZuG8c
— Narendra Modi (@narendramodi) January 29, 2024