Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈజిప్టులో ప్రముఖ యోగా శిక్షకులు రీమ్‌ జబక్‌.. నదా అడెల్‌లతో ప్రధాని భేటీ

ఈజిప్టులో ప్రముఖ యోగా శిక్షకులు రీమ్‌ జబక్‌.. నదా అడెల్‌లతో ప్రధాని భేటీ


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు రాజధాని కైరో నగరంలో 2023 జూన్‌ 24న ప్రముఖ యోగా శిక్షకులు శ్రీమతి రీమ్‌ జబక్‌, శ్రీమతి నదా అడెల్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగాభ్యాసంపై వారి అంకితభావాన్ని ప్రధాని ప్రశంసిస్తూ- భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా కోరారు. కాగా, ఈజిప్టులో యోగాభ్యాసంపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని వారు ప్రధానమంత్రికి వివరించారు.

 

*****